loan reschedule
-
ఇంటి ఋణ భారం తగ్గే దారేది..!
ఇంటిని కొనుగోలు చేయడం ప్రతి ఒక్కరి జీవితంలో అదిపెద్ద ఆర్ధిక లక్ష్యం. ఇందుకోసం భారీ మొత్తం అవసరంపడుతుంది. ఎన్నో ఏళ్లపాటు కష్టార్జితాన్ని పొదుపు, మదుపు చేసి ఇల్లు కొనుక్కోవడం ఒక మార్గం అయితే, 20–25 ఏళ్ల కాలానికి రుణం తీసుకుని ఇంటిని సమకూర్చుకోవడం రెండో మార్గం. రెండు దశాబ్దాల క్రితం అయితే ఎక్కువ మంది జీవితాంతం కష్టపడి పొదుపు చేసి ఇంటిని సమకూర్చుకునే వారు. కానీ, ఇందులో మార్పు వచి్చంది. రుణం మార్గంలో చిన్న వయసులోనే సొంతింటివారయ్యే అవకాశం ఎక్కువ మందిని ఆకర్షిస్తోంది. కానీ, ఇదేమంత చిన్న విషయం కానే కాదు. తీసుకున్న అసలు రుణాన్ని, వడ్డీ సహా చెల్లించుకోవాలి. పైగా రుణం ఎంత ఇవ్వాలి, ఎంత వడ్డీ, ఎన్నేళ్ల కాల వ్యవధి అనే అంశాలను రుణమిచ్చే సంస్థే నిర్ణయిస్తుంటుంది. ఈ విషయంలో రుణదాతకు ఉన్న స్వేచ్ఛ తక్కువ. అందుకే రుణంపై ఇంటిని సమకూర్చుకునే వారు తప్పకుండా కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. దీర్ఘకాలం పాటు రుణ బాధ్యత మోయకుండా, ఆ భారాన్ని దింపుకునే, తగ్గించుకునే మార్గాల గురించి తెలుసుకోవాలి. ఇంటి రుణంపై చెల్లించే ఈఎంఐ ఓ సగటు మధ్య తరగతి కుటుంబానికి చాలా పెద్ద మొత్తమే అవుతుంది. నెలవారీ ఆర్జనలో 30–40 శాతం వరకు ఉండొచ్చు. 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. గడువు పూర్తయ్యే నాటికి రుణదాత చెల్లించే మొత్తం రెట్టింపు అవుతుంది. అంటే తీసుకున్న రుణం ఎంతో, అంత మేర వడ్డీ కూడా ఇక్కడ చెల్లించాల్సి వస్తుంది. కానీ, ఆరి్థక కోణం నుంచి చూస్తే ఇదేమంత లాభదాయక విషయం కాదన్నది వాస్తవం. ఇంటి రుణం విషయంలో కొంత లాభపడాలంటే ఆ రుణాన్ని వీలైనంత తొందరగా ముగించేయడం మెరుగైన ఆలోచన అవుతుంది. ‘రుణ’ వాటా తగ్గాలి ఇంటిని కొనుగోలు చేసే వారు రుణాన్ని వీలైనంత తక్కువకు పరిమితం చేసుకోవాలన్నది ప్లాన్ రూపీ ఇన్వెస్ట్మెంట్ సరీ్వసెస్ వ్యవస్థాపకుడు అమోల్ జోషి సూచించారు. అంటే రుణం వీలైనంత తక్కువగా ఉండాలి. కానీ, ఆచరణలో ఎక్కువ కేసుల్లో దీనికి విరుద్ధంగా జరుగుతుందంటున్నారు అమోల్ జోషి. ‘‘ఇంటి రుణం తీసుకునే వారు సరిపడా సైజు, చక్కని వసతులు వంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. దీనివల్ల వారు తీసుకోవాల్సిన రుణం మొత్తం పెరిగిపోతుంటుంది’’అని జోషి వివరించారు. కానీ, రుణం వస్తుంది కదా అని ఖరీదైన ఇంటిని సులభంగా కొనుగోలు చేయడం కాకుండా, తిరిగి నెలవారీ ఎంత మేర చెల్లించాల్సి వస్తుందన్నది కూడా పట్టించుకోవాలి. ఒక వ్యక్తి 20 ఏళ్ల కాలానికి గృహ రుణం తీసుకున్నారని అనుకుంటే.. 8.5 శాతం వార్షిక వడ్డీపై 20 ఏళ్లకూ కలిపి అసలుకు సరిపడా వడ్డీని చెల్లించాల్సి వస్తుంది. ఉదాహరణకు రూ. కోటి రుణం తీసుకుంటే 8.5 శాతం రేటుపై, 20 ఏళ్లలో రూ.1.08 కోట్లను వడ్డీ రూపంలోనే చెల్లించాల్సి వస్తుంది. వడ్డీ భారం తగ్గాలంటే..? పైన చెప్పుకున్నట్టు అసలుకు సమానంగా వడ్డీ చెల్లించకూడదని మీరు కోరుకునేట్టు అయితే, రుణాన్ని నిర్ధేశిత గడువు కంటే ముందుగానే చెల్లించేసేలా ప్రణాళిక ప్రకారం నడుచుకోవడం చక్కని మార్గం. అది కూడా రుణాన్ని తీసుకున్న తొలినాళ్లలోనే ముందస్తు అదనపు చెల్లింపులను ప్రారంభించాలి. ఎందుకంటే ఆరంభంలోనే రుణంపై వడ్డీ భారం ఎక్కువ పడుతుంది. కాలం గడుస్తున్న కొద్దీ వడ్డీ భారం తగ్గుతూ, అసలులో ఎక్కువ జమ అవుతుంది. పైన చెప్పుకున్న ఉదాహరణలో రూ.కోటి రుణాన్ని తీసుకున్న మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ ఈఎంఐకి అదనంగా ముందస్తు చెల్లింపులు మొదలు పెట్టి.. రుణాన్ని 14–15 ఏళ్లలోనే తీర్చేసేట్టు అయితే, రూ.20–25 లక్షల వరకు వడ్డీ రూపంలో ఆదా చేసుకోవచ్చు. అలా కాకుండా అదనపు ముందస్తు చెల్లింపులను జాప్యం చేశారనుకుంటే.. పదో ఏట తర్వాతే మొదలు పెట్టేట్టు అయితే అప్పుడు వడ్డీ రూపంలో ఆదా చేసుకునేది స్వల్పంగానే ఉంటుంది. అందుకే రుణం తీసుకున్న తర్వాత వీలైనంత ముందుగా అదనపు చెల్లింపుల మార్గాలను అన్వేషించుకోవాలి. ‘‘వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలోనే ఉన్నాయి. ఇంకొంత పెరిగే అవకాశాలు లేకపోలేదు. కనుక వడ్డీ భారాన్ని వీలైనంత తగ్గించుకునేందుకు ముందస్తు చెల్లింపులు మంచి ఆప్షన్ అవుతుంది. ఒకవేళ వడ్డీ రేట్లు ఇక్కడి నుంచి తగ్గుముఖం పడితే ముందస్తు చెల్లింపుల రూపంలో వడ్డీని మరింత మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది’’అని సృజన్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వ్యవస్థాపక భాగస్వామి దీపాలి సేన్ సూచించారు. ముందస్తు చెల్లింపుల్లో మరో ఆప్షన్‌ను కూడా పరిశీలించొచ్చు. ఈఎంఐ రుణ కాలవ్యవధి అంతటా మారకుండా స్థిరంగా ఉంటుంది. కానీ, వేతన జీవి ఆదాయం ఏటా పెరుగుతూ వెళుతుంది. దీనికి తగ్గట్టుగా రుణ ఈఎంఐని ఏటా పెంచుకుంటూ, మధ్యలో అదనంగా సమకూరే మొత్తాన్ని కూడా ముందస్తు చెల్లింపులకు వినియోగించుకుంటే, 20 ఏళ్ల రుణాన్ని 10 ఏళ్లలోనే ముగించేయవచ్చు. దీనివల్ల వడ్డీ రూపంలో గణనీయమైన మొత్తం ఆదా అవుతుంది. ఏటా ఈఎంఐ పెంచుకోవడాన్ని స్టెపప్ ఈఎంఐగా చెబుతారు. పెరిగే వేతనాలు, బోనస్‌లను ఇందుకు వినియోగించుకోవాలి. వీలైనంత ముందుగా.. నిరీ్ణత గడువు కంటే ముందుగానే గృహ రుణాన్ని వదిలించుకోవడం వల్ల వడ్డీ రూపంలో పెద్ద మొత్తమే ఆదా అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. కనుక దీన్ని విస్మరించకూడదు. అయితే, రుణ గ్రహీత చెల్లింపుల సామర్థ్యమే అంతిమంగా దీన్ని నిర్ణయిస్తుంది. భారతీయుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు రుణ భారాన్ని మోయడానికి ఇష్టపడని వారేనని నిపుణులు సైతం చెబుతున్నారు. ‘‘పదేళ్ల క్రితం వరకు ఎక్కువ శాతం రుణాలు ఏడు నుంచి 9 ఏళ్ల మధ్యలోనే ముగించినట్టు మా డేటా తెలియజేస్తోంది. కాకపోతే ముందస్తుగా రుణాన్ని తీర్చేయడం అన్నది ఇప్పుడు 9–12 ఏళ్లకు మారింది. భారత్‌లో ఎక్కువ మంది రుణాల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు’’అని మార్ట్గేజ్ వరల్డ్ సీఈవో విపుల్ పటేల్ తెలిపారు. ఏక మొత్తంలో కొంత రుణాన్ని తీర్చి వేయడానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు అయినా వ్యవధి అవసరం పడొచ్చు. ఎందుకంటే ఎంతో కొంత సమకూర్చుకోవడానికి ఇంత మేర కాల వ్యవధి అవసరం కనుక. ఏటా ఈఎంఐను పెంచుతూ చెల్లించడం ఒక ఆప్షన్ అయితే, మధ్యలో వచ్చే బోనస్, ఇతరత్రా వెసులుబాటు లభించినప్పుడు అదనంగా ఒకే విడత చెల్లించడం మరో మార్గం. ‘‘రుణ గ్రహీత తన ఇష్టం ప్రకారం ఈఎంఐని పెంచి చెల్లించడం కాకుండా, స్టెపప్ ఈఎంఐ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి. దీనివల్ల ఆటోమేటిక్‌గా ఈఎంఐ పెరుగుతుంది. లేకపోతే కొన్ని ఆకర్షణీయమైన ఖర్చులతో ముందస్తు చెల్లింపులపై ప్రభావం పడుతుంది’’అని దీపాలిసేన్ సూచించారు. అన్ని అంశాలు చూసిన తర్వాతే వ్యక్తిగత ఆరి్థక అంశాల్లో గృహ రుణం అన్నది ఒక్క భాగం మాత్రమే. కనుక ముందస్తుగా రుణాన్ని చెల్లించే ముందు, ఇతర బాధ్యతలు, అవసరాలు, వెసులుబాటును కూడా చూసుకోవాలన్నది నిపుణుల సూచన. అందరి ఆరి్థక పరిస్థితులు ఒకే మాదిరిగా ఉండవు. తమ క్లయింట్ల విషయంలో భిన్న వ్యవహార శైలిని చూస్తుంటామని అమోల్ జోషి వెల్లడించారు. ‘‘పెరుగుతున్న జీవనశైలి ఖర్చులతో నెలవారీ పొదుపు కష్టంగా మారుతోంది. కనుక వ్యక్తులు సింగిల్ షాట్‌కే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఏడాదికోసారి ముందస్తు చెల్లింపునకే ప్రాధాన్యం ఇస్తున్నారు’’ అని జోషి వివరించారు. జీవితంలో ఎన్నో అవసరాలు పెరుగుతుంటాయి. కనుక వాటికి కూడా ప్రాధాన్యం ఇస్తూ గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గృహ రుణాన్ని ముందుగా తీర్చివేయాలని భావించే వారు తమ ఆదాయపన్ను కోణంలోనూ దీన్ని ఓ సారి విశ్లేíÙంచుకోవాలి. ఎందుకంటే పాత పన్ను విధానంలో గృహ రుణంపై అసలు, వడ్డీ మొత్తం కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.3.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. కనుక రూ. 9 లక్షల వరకు వార్షికాదాయం కలిగిన వారికి గృహ రుణం రూపంలో గణనీయమైన మొత్తమే ఆదా చేసుకోవచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ. 2 లక్షల మొత్తం వడ్డీ చెల్లింపులకే పన్ను ప్రయోజనం సెక్షన్ 24(బీ) కింద ఉంటుంది. సెక్షన్ 80సీ కింద అసలుకు జమ చేసే రూ.1.5 లక్షలకు కూడా పన్ను ఆదా ప్రయోజనం క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే, ఒక ఆరి్థక సంవత్సరంలో గృహ రుణంపై వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల లోపునకు తగ్గిపోయినప్పుడు, పన్ను పరిధిలో ఉన్న వారు ముందస్తు చెల్లింపుల వైపు మొగ్గు చూపించొచ్చు. ‘‘గృహ రుణం పెద్ద మొత్తంలో తీసుకుంటే, సమీప కాలంలో వేరే ఇతర పెద్ద ఆరి్థక లక్ష్యాలు లేకుంటే.. వీలైనంత అదనపు మొత్తంతో రుణాన్ని ముందుగా తీర్చివేయడమే మంచిది. అది నెలవారీ కావచ్చు, ఏడాదికోసారి కావచ్చు. మిగిలిన గృహ రుణం కొంతే ఉంటే, అప్పుడు మిగులు మొత్తాన్ని పెట్టుబడులు, ముందస్తు చెల్లింపులు అనే రెండు భాగాలుగా విభజన చేసుకోవాలి’’అని దీపాలి సేన్ సూచించారు. గృహ రుణం అనేది పెద్ద బాధ్యత. సొంతింటి కల సాకారానికి దీని సాయం తీసుకోవడంలో తప్పు లేదు. కానీ, ఈఎంఐ రూపంలో నెలవారీ ఎంత చెల్లింపుల సామర్థ్యం తమకు ఉంది, తమ కుటుంబ ఆదాయం, అవసరాలు, ఆరోగ్య చరిత్ర, ఇతర ఆరి్థక బాధ్యతలు ఇలాంటి ఎన్నో అంశాలు విశ్లేషించిన తర్వాతే దీనిపై స్పష్టతకు రావడానికి వీలుంటుంది. ఈ విషయంలో నిపుణుల సహాయం తీసుకునేందుకు వెనుకాడకూడదు. చెల్లింపుల సామర్థ్యం పూర్తి స్థాయిలో లేదంటే, ఇంటి కొనుగోలుకు అయ్యే వ్యయంలో ఎక్కువ మొత్తాన్ని సమకూర్చుకున్న తర్వాతే, గృహ రుణం విషయంలో ముందుకు వెళ్లడం ఆరి్థక సౌకర్యాన్నిస్తుంది. భారం ఎంత తగ్గుతుంది.. ► గృహ రుణం: రూ.కోటి ► కాలవ్యవధి: 20 ఏళ్లు ► వడ్డీ రేటు: 8.5 శాతం ► ఈఎంఐ: రూ.86,782 ► నికర వడ్డీ చెల్లింపు: 1.08 కోట్లు ► ఉదాహరణ: మూడేళ్ల తర్వాత నుంచి నెలవారీ రూ. 20వేలు అదనంగా చెల్లించడం/మూడేళ్ల తర్వాత నుంచి ఏటా ఒకేసారి రూ. 2 లక్షల చొప్పున చెల్లించడం/ఏడేళ్ల తర్వాత ఒకే విడత రూ.20 లక్షలు జమ చేయడం ► నికర వడ్డీ భారం: రూ.77.67 లక్షలు/రూ.79.39 లక్షలు/రూ.79.45లక్షలు ► ఆదా అయ్యే వడ్డీ: రూ.30.63 లక్షలు/రూ.28.91లక్షలు/రూ.28.85 లక్షలు ► రుణం ముగింపు కాలం: 14ఏళ్లు/15ఏళ్లు/15ఏళ్లు -
కేంద్రం కొర్రీ.. రాష్ట్రం వర్రీ.. తెలంగాణ సర్కారుకు భారీ ఝలక్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం భారీ ఝలక్ ఇచ్చింది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఓపెన్ మార్కెట్ నుంచి రూ.52,167 కోట్ల రుణాలను సమీకరించనున్నట్టు బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో రూ.19వేల కోట్ల మేర రుణాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా కోత విధించిందని రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. దీంతో రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33వేల కోట్లకు మించి అప్పు లభించని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ విషయంలో ప్రభుత్వానికి తీవ్ర ఇక్కట్లు తప్పేటట్టు లేవు. కేంద్రం ఆంక్షలతోనే కోత రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులపై కేంద్రం ఇటీవల అమల్లోకి తెచ్చిన తీవ్ర ఆంక్షలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు గండిపడినట్టు సమాచారం. గత రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న బడ్జెట్ అప్పులతోపాటు వివిధ కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న అప్పులను సైతం ఎఫ్ఆర్బీఎం చట్టం పరిధిలోకి తెస్తున్నట్టు కేంద్రం ఇటీవల రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. గత రెండేళ్లలో ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి ఎంత మేర అధిక అప్పులు తీసుకుని ఉంటే ఆ మేర అప్పులను 2022–23 సంవత్సరానికి సంబంధించిన అప్పుల్లో కోత విధిస్తామని చెప్పింది. రాష్ట్రానికి రావాల్సిన అప్పులను సైతం కొంతకాలంపాటు నిలుపుదల చేసింది. దీనిపై సీఎం కేసీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి లేఖ సైతం రాశారు. ఆ తర్వాత కొద్దిగా ఉపశమనం కల్పించింది. అయితే, ఎఫ్ఆర్బీఎం రుణపరిమితిపై కొత్తగా తెచ్చిన నిబంధనలతోనే రాష్ట్రానికి రావాల్సిన అప్పులకు కేంద్రం కోత విధించినట్టు తెలుస్తోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం.. రాష్ట్ర దేశీయ స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ) విలువలో 3.5శాతం వరకు రుణాలు తీసుకోవడానికి తెలంగాణకు అనుమతి ఉంది. ఈ లెక్కన రూ.42వేల కోట్ల అప్పులను తీసుకోవడానికి అర్హత ఉందని గతంలో కేంద్రం సైతం తెలిపింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.52వేల కోట్ల రుణాలను ప్రతిపాదించింది. కార్పొరేషన్లకు ఇక అప్పు పుట్టదు! రాష్ట్ర ప్రభుత్వగ్యారెంటీతో ఎఫ్ఆర్బీఎం పరిమితికి వెలుపల కార్పొరేషన్లు రుణాలు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎఫ్ఆర్బీఎం నిబంధనలను కేంద్రం కఠినంగా అమలు చేస్తుండటంతో ఇకపై కార్పొరేషన్లకు రుణాలు లభించకపోవచ్చని తెలుస్తోంది. సంబంధిత కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం, బ్యాంకు/ఆర్థిక సంస్థ మధ్య కొత్తగా త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటేనే కార్పొరేషన్లకు రుణాలను విడుదల చేస్తామని ఆంక్షలు విధించింది. ఒప్పందం చేసుకుంటే ఈ రుణాలు ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వచ్చే ప్రమాదం ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం విముఖతతో ఉంది. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో కాళేశ్వరం, ఇతర కార్పొరేషన్లకు సంబంధించిన రుణాలపై ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే నిలిచిన రూ.22వేల కోట్ల రుణాలు ఆర్ఈసీ, పీఎఫ్సీ వంటి సంస్థల నుంచి నీటిపారుదల శాఖ పరిధిలోని కార్పొరేషన్లకు రావాల్సిన రూ.22వేల కోట్ల రుణాలు ఇప్పటికే నిలిచిపోగా, ఇక భవిష్యత్తులోనూ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి పీఎఫ్సీ నుంచి జెన్కోకు రావాల్సిన రుణాలకు మాత్రం అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో విద్యుత్ ప్లాంట్ ద్వారా వచ్చే ఆదాయంతో ఈ రుణాలను తీర్చడానికి వీలుండటంతో కేంద్రం అనుమతిచ్చే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. నీటిపారుదల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీటిని రైతులకు ఉచితంగా సరఫరా చేస్తుండటంతో సంబంధిత కార్పొరేషన్లకు ఆదాయం వచ్చే అవకాశం లేదు. ఈ రుణాలను రాష్ట్ర ప్రభుత్వమే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి తేవాలని కేంద్రం ఒత్తిడి చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోంది. -
చిన్న పరిశ్రమలకు మరో నెల ‘రుణ’ హామీ
న్యూఢిల్లీ: లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) సంబంధించి అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఎమర్జె్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్–ఈసీఎల్జీఎస్) కేంద్రం సోమవారం మరో నెలపాటు పొడిగించింది. ఈ పథకం నవంబర్ 30వ తేదీ వరకూ అమలవుతుంది. నిజానికి అక్టోబర్‌తో ఈ పథకం గడువు ముగిసింది. దేశం మొత్తం కరోనా కోరల్లో చిక్కుకున్న పరిస్థితుల్లో– మేనెల్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ. 20లక్షల కోట్ల విలువైన ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజ్ (స్వావలంభన భారత్) ప్రకటించారు. ఇందులో భాగంగా చిన్న ఎంఎస్ఎంఈలకు ఆర్థిక వెసులుబాటు కల్పించడం లక్ష్యంగా రూ.3 లక్షల కోట్ల ఈసీఎల్‌జీఎస్‌ను ఆవిష్కరించారు. అక్టోబర్ చివరి వరకూ లేదా రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరు అయ్యే వరకూ పథకం అమల్లో ఉండాలన్నది పథకం లక్ష్యం. అయితే నిర్దేశించుకున్న మేరకు రూ.3 లక్షల కోట్ల రుణ మంజూరీలు జరక్కపోవడంతో లాంఛనంగా మరో నెలపాటు పథకం గడువును ఆర్థిక మంత్రిత్వశాఖ పొడిగించింది. వచ్చేది పండుగ సీజన్ కాబట్టి, వ్యవస్థలో డిమాండ్ పుంజుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో ఈ పథకం చిన్న పారిశ్రమలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థికశాఖ తెలిపింది. -
ఊరట : రుణగ్రహీతలకు వెసులుబాటు
సాక్షి, న్యూఢిల్లీ : కోవిడ్-19తో ప్రభావితమైన వ్యాపార సంస్థలను కాపాడేందుకు సెప్టెంబర్ 15 నాటికి రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బ్యాంకులను కోరారు. ప్రభుత్వ రంగ బ్యాంకులతో గురువారం నిర్మలా సీతారామన్ సమావేశమయ్యారు. రుణాల పునర్వ్యవస్థీకరణకు బోర్డు ఆమోదించిన విధానాన్ని సత్వరమే అమలు చేసేందుకు బ్యాంకులు సిద్ధం కావాలని ఆమె స్పష్టం చేశారు. ఈ పథకానికి అర్హులైన రుణగ్రహీతలను గుర్తించి సత్వరమే వారిని సంప్రదించి ఆయా వ్యాపారాలను బ్యాంకులు, ఆర్థిక సంస్ధలు కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. కోవిడ్-19తో దెబ్బతిన్న రంగాలకు రుణ పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలుకు సన్నద్ధతను ఆయా బ్యాంకుల సీఈఓలతో సమీక్షించారు. చదవండి : ఆర్బీఐకి చిదంబరం కీలక సలహా రుణాల చెల్లింపులపై మారటోరియంను ఎత్తివేసే సమయంలో రుణగ్రహీతలకు బ్యాంకులు బాసటగా నిలవాలని సూచించారు. రుణగ్రహీతల రుణసామర్ధ్యంపై ప్రభావం లేనివిధంగా వ్యవహరించాలని అన్నారు. రుణ పునర్వ్యవస్థీకరణపై తాము పూర్తిసమాచారాన్ని పలు భాషల్లో తమ వెబ్సైట్లపై అందుబాటులో ఉంచామని బ్యాంకులు ఆమెకు వివరించారు. తాము రుణ పునర్వ్యవస్థీకరణకు అర్హులైన రుణగ్రహీతలను గుర్తించే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని బ్యాంకులు వివరించాయి. కంపెనీలు, వాణిజ్య సంస్ధలతో పాటు వ్యక్తిగత రుణగ్రహీతల అవసరాలను గుర్తెరిగి బ్యాంకులు చురకుగా స్పందించాలని మంత్రి సూచించారు. కాగా, కార్పొరేట్, ఎంఎస్ఎంఈ, వ్యక్తిగత రుణం సహా వివిధ రుణగ్రహీతలకు ఆగస్ట్ 6న ఆర్బీఐ రుణ పునర్వ్యవస్థీకరణను ప్రకటించింది. రుణ పునర్వ్యవస్థీకరణ కోసం రుణగ్రహీతలు ఈ ఏడాది డిసెంబర్ 31లోగా బ్యాంకులను కోరవచ్చు. ఈ ప్రతిపాదనకు బ్యాంకులు అంగీకరించిన 180 రోజుల్లోగా రుణ పునర్వ్యవస్థీకరణ అమలవుతుంది. -
ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ సీపీకి 167 సీట్లు
శ్రీకాకుళం : ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు 167 సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారని ఆపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రజల్లోకి వెళ్లి ఓటు వేస్తారా అని అడగగలరా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. శుక్రవారం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుందని అనుకోలేదన్నారు. మామూలుగా ప్రజా వ్యతిరేకత రావటానికి ఏ ప్రభుత్వానికి అయినా రెండేళ్లు పడుతుందని, అయితే చంద్రబాబుకు మాత్రం ప్రజా వ్యతిరేకతకు నెలరోజుల సమయం కూడా పట్టలేదన్నారు. చంద్రబాబు దారుణంగా అబద్ధాలాడుతున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఎర్రచందనం అక్రమ నిల్వల విషయంలో ముఖ్యమంత్రి, మంత్రి చెరోమాట మాట్లాడుతున్నారని అన్నారు. ఎర్ర చందనాన్ని అమ్మి రుణమాఫీ చేస్తామంటున్నారని, 8వేల టన్నుల ఎర్రచందనం ఉందని, నాలుగు వేల టన్నులు వేలం వేస్తే టన్నుకు రై.10 లక్షల చొప్పున వస్తుందని ఓవైపు అటవీశాఖ మంత్రి చెబితే, మరోవైపు చంద్రబాబు మాత్రం 15వేల టన్నులని చెబుతున్నారన్నారు. అలా అయినా వచ్చే రూ.1500 కోట్లతో ఎలా రుణమాఫీ చేస్తారని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. ప్రజలను మోసం చేస్తున్న చంద్రబాబు అసలు మనిషేనా అని ప్రశ్నించారు. ఎన్నికల్లో హామీలిచ్చి ఇప్పుడు మాత్రం అమలుకు కష్టంగా ఉందంటున్నారని చెప్పటం శోచనీయమని వైఎస్ జగన్ అన్నారు. పార్లమెంట్లో ఓటేయించి రాష్ట్రాన్ని విడగొట్టించిన చంద్రబాబు రెండు రాష్ట్రాలకు రెండు మేనిఫెస్టోలు విడుదల చేసి రుణమాఫీ చేస్తానన్నారని గుర్తు చేశారు. పిక్‌పాకెట్ చేస్తేనో, దొంగతనం చేస్తేనో 420 కేసు పెడతారని, మరి ప్రజల్ని మోసం చేసి సీఎం అయిన చంద్రబాబుపై.. 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని అడుగుతున్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఏప్రిల్ 11న ఎన్నికల కమిషన్‌కు లేఖ రాసిన బాబు రాష్ట్రంలోని వనరులపై తనకు అవగాహన ఉందని, రుణమాఫీ అమలు చేస్తానన్నారని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఆ తర్వాత 40, 50 సమావేశాల్లోనూ తనకు చాలా అనుభవం ఉందని, ప్రపంచానికే పాఠాలు చెప్పానని చాలా మాటలు చెప్పారని, రుణాలు కట్టవద్దని ఆయన మనుషులు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్లి చెప్పారన్నారు. రుణమాఫీ కష్టమని తెలిసినా అంతా తెలిసే ఉద్దేశ్యపూర్వకంగానే చేశారని జగన్ వ్యాఖ్యానించారు. అలాంటి బాబుపై 420 కేసు పెట్టాలో, 840 కేసు పెట్టాలో ఆయన మనస్సాక్షినే అడగాలన్నారు. ఇంటికో ఉద్యోగమన్న చంద్రబాబు... ఉద్యోగం లేనివారికి నెలకు రెండువేలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని వైఎస్ జగన్ అన్నారు. ఆ హామీలు అమలు చేయాలని నిరుద్యోగులు అడుగుతుంటే... ఇప్పుడు జాబంటే ప్రభుత్వ ఉద్యోగమనలేదని మాట తప్పుతున్నారన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంలో హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. వారిని ఆదుకునే వారే కనిపించడం లేదన్నారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై తాను గర్వపడుతున్నానని, ఇచ్చే భావన, మంచి ఆలోచన లేనప్పుడు పథకాలు ఎత్తివేసే కార్యక్రమంలోనే భాగంగా ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ జగన్ అన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
రుణ మాఫీపై సర్కారుకు నెల గడువు
ఆ తర్వాత రైతులతో కలసి ఆందోళన చేపడతాం: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి * రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం * రుణాల రీషెడ్యూల్ చేయడం పెద్దగొప్పా?.. ఆ పని ఏ ప్రభుత్వమైనా చేస్తుంది * ప్రజలను మోసం చేసిన బాబూ మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? సాక్షి, శ్రీకాకుళం: ‘‘రుణ మాఫీ అనే అబద్ధపు హామీతో ముఖ్యమంత్రి పీఠమెక్కిన చంద్రబాబు ఇప్పుడు రైతులు, డ్వాక్రా సంఘాలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మాఫీ ఊసెత్తకుండా రుణాలు రీషెడ్యూల్ చేస్తామని చెబుతున్నారు. రీషెడ్యూల్ చేయడం గొప్ప విషయమా? పదేళ్లుగా ప్రతి ప్రభుత్వం కూడా ఎప్పుడు వరదలొచ్చినా, కరువులొచ్చినా రొటీన్‌గా రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నాయి. కానీ ఇదేదో గొప్ప అన్నట్లు చంద్రబాబు చెప్పడం విడ్డూరం. రాష్ట్ర ప్రభుత్వం రుణ మాఫీ విషయంలో కాలయాపన చేస్తుండటంతో రైతులు, డ్వాక్రా సంఘాల సభ్యులను బ్యాంకులు నోటీసులతో వేధిస్తున్నాయి. ప్రభుత్వం ఇదేమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. కానీ మేం రైతుల వెంట ఉన్నాం. ప్రభుత్వానికి మరో నెల సమయం ఇస్తాం. అప్పటికీ పూర్తిస్థాయిలో రుణాలు మాఫీ చేయకపోతే వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతాం. నిరాహార దీక్షలు, ధర్నాలు చేస్తాం. రైతులతో కలసి ఉద్యమిస్తాం’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారు. ‘‘పిక్‌పాకెటింగ్ చేస్తే కేసు పెడతారు. చిట్‌ఫండ్ మోసాలకు పాల్పడితే 420 కేసు పెడతారు. మరి ఏకంగా ప్రజలను మోసం చేసి సీఎం సీటులో కూర్చున్న మీపై 420 కేసు పెట్టాలా.. 840 కేసు పెట్టాలా? అని రైతుల తరఫున మేం ప్రశ్నిస్తున్నాం’’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చెన్నైలో భవనం కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. రుణాల మాఫీపై ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రూ.90 వేల కోట్ల రుణాల మాటేమిటి? ‘‘ఎన్నికల సంఘానికి ఏప్రిల్ 11న రాసిన లేఖలోనూ, ఎన్నికల ప్రచారంలోనూ వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ అబద్ధమే ఆయన్ని సీఎంని చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక తన బాధ్యత నుంచి తప్పించుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. రుణాలు మాఫీ చేయకుండా దారులు వెదుకుతున్నారు. మాఫీని పక్కనబెట్టి రుణాలు రీషెడ్యూల్ చేస్తామంటున్నారు. అదీ.. రూ. 10 వేల కోట్ల రుణాలు మాత్రమే రీషెడ్యూల్ అంటున్నారు. మిగిలిన రూ.90 వేల కోట్ల గురించి ఏం చెబుతారు’’ అని జగన్ నిలదీశారు. మరోనెల చూస్తామని, ఆ తర్వాత రైతులమంతా ఏకమవుతామని, రైతుల తరఫున వైఎస్సార్ సీపీ పోరాడుతుందని చెప్పారు. ‘కూలి’న బతుకులను నిలబెట్టండి సాక్షి,శ్రీకాకుళం: ‘‘మా బతుకులు బాగు చేయండి. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన మాకు అండగా నిలబడండి. ఇంటాయన పోయాక పిల్లలు అనాథలుగా మారారు. మాకు న్యాయం చేయండి. ఇక్కడ కూలి దొరక్క చెన్నైకి వలసపోయాం. రాష్ట్రంలో ఉపాధి జాబ్ కార్డులు ఇచ్చినా పని కల్పించడంలేదు. అందుకే దిక్కులేక పరాయి ప్రాంతాలకు వలసపోతున్నాం’’ అని చెన్నైలో బహుళ అంతస్తుల భవనం, ఆ తర్వాత తిరువళ్లూరులో గోడ కూలిన ఘటనలో మరణించిన వారి కుటుంబాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వద్ద కన్నీటి పర్యంతమయ్యాయి. వారి ఆవేదనకు జగన్ చలించిపోయారు. వారికి ధైర్యం చెప్పి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. చెన్నై, తిరువళ్లూరు ఘటనల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన వారి కుటుంబాలను జగన్ గురువారం పరామర్శించారు. -
ప్రభుత్వం ఆ విషయం మరిచిపోయిందా?
విజయవాడ: వ్యవసాయ రుణమాఫీ హామీ నుంచి చంద్రబాబు నాయుడు తప్పుకోరాదని రాష్ట్ర మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కోరారు. జూన్ 30లోగా రైతులు వ్యవసాయ రుణాలు చెల్లిస్తే అన్ని రాయితీలు రైతులకు వర్తిస్తాయని తెలిపారు. కాలం గడిచాక ఇప్పుడు రీషెడ్యూలు చేస్తామంటున్నారని, ఓవర్ డ్యూ రుణాలు రీషెడ్యూల్ కిందకు రావన్న విషయం రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయిందా అని ఆయన ప్రశ్నించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై శుక్రవారం విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. రైతు సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
'చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ'
-
ఎందుకు విఫలమవుతున్నారు?
విజయవాడ: పరిపాలనలో తనకు విశేష అనుభం ఉందని చెప్పుకున్న సీఏం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణమాఫీ అంశంలో ఎందుకు విఫలం అవుతున్నారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ప్రశ్నించారు. హామీని ఎంతవరకు నెరవేరుస్తామన్న విషయం చంద్రబాబు మనసుకు తెలియదా అని అన్నారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి కులం దగ్గరకు వెళ్లి రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రజలను చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. పంటల రుణమాఫీపై తనవిధానం ఏంటో స్పష్టంగా చంద్రబాబు వెల్లడించాలని దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు. -
'చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ'
విజయవాడ: పంట రుణాల రీషెడ్యూల్ అంటూ ఏపీ సీఎం చంద్రబాబు పబ్లిసిటీ చేసుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలకమండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. విభజన తర్వాతనే చంద్రబాబు మేనిఫెస్టో ప్రకటించారని, అన్ని రుణాలను మాఫీచేస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్లు తొలిసంతకాలను అమలుచేసి చూపారని చెప్పారు. చంద్రబాబు మాత్రం తొలిసంతకంతో కమిటీ వేశారని తెలిపారు. చంద్రబాబు తెలిసి చేసిన దగా రుణాల మాఫీ అన్నారు. రీషెడ్యూలు అంటే భారం పెంచడం కాదా అని ప్రశ్నించారు. మూడేళ్లు లేదా ఐదేళ్లలోనైనా రుణాలు తీర్చాల్సిందేనని, ఆ మేరకు వడ్డీ కూడా పెరగదా అని అన్నారు. రీషెడ్యూలుతో రైతులు రుణవిముక్తులవుతారా అని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. -
రుణమాఫీ అమలు జరిగేనా..?
-
ఆర్బీఐ చెబితేనే రీషెడ్యూల్
* రుణాల రీషెడ్యూలుపై చంద్రబాబుకు బ్యాంకర్ల స్పష్టీకరణ సాక్షి, దరాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా వ్యవసాయ రుణాలన్నిటినీ మాఫీ చేస్తానని హామీ ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఆ రుణ మాఫీపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ విజ్ఞప్తి చేసినా మాఫీ మాటను దాటవేసి, రీషెడ్యూల్ రాగమే వినిపించారు. రుణాల తిరిగి చెల్లింపులు లేకపోవటంతో బ్యాంకులు సక్రమంగా పనిచేయలేకపోతున్నాయని, రైతులు రుణాలు చెల్లించకపోతే ఖరీఫ్ రుణాలు ఇవ్వలేమని ఎస్ఎల్బీసీ భేటీలో బ్యాంకర్లు స్పష్టంచేసినా.. ఆ రుణాలను రీషెడ్యూల్ చేసి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు తప్పితే మాఫీపై స్పష్టత ఇవ్వలేదు. రుణాలను రీషెడ్యూలు చేయాలంటే భారతీయ రిజర్వు బ్యాంకు అనుమతి అవసరమని బ్యాంకర్లు చెప్తే.. రీషెడ్యూలు చేయాల్సిందిగా తీర్మానం చేసి ఆర్బీఐకి పంపించాలని చంద్రబాబు సూచించారు కానీ.. మాఫీకి తమ ప్రణాళిక ఏమిటో చెప్పలేదు. పైగా.. రుణాలు రీషెడ్యూలు చేశాక వాటిపై ఏడాదిపాటు మారటోరియం విధించాలని, తిరిగి చెల్లించానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలనీ చంద్రబాబు కోరటం విశేషం. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) సమావేశం సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతుల రుణాలను రీషెడ్యూలు చేయాలని సీఎం విజ్ఞప్తి చేయగా.. బ్యాంకర్ల నుంచి సానుకూల స్పందన రాలేదు. రుణాలు రీషెడ్యూలు చేయడానికి ఆర్బీఐ అనుమతి అవసరమని, ప్రభుత్వ విజ్ఞప్తిని ఆర్బీఐకి నివేదించి అక్కడ నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేస్తామని బ్యాంకర్లు సమాధానం ఇచ్చారు. మాఫీ కంటే రీ షెడ్యూల్‌పైనే దృష్టి... రైతుల రుణ మాఫీ ఎలా అమలు చేయనున్నారన్న అంశంకన్నా ప్రభుత్వం రుణాల రీషెడ్యూలుపైనే భేటీలో బాబు ప్రధానంగా దృష్టిపెట్టారు! కరువు, తుపాన్లు వచ్చిన 90 రోజుల్లోగా రుణాలు రీషెడ్యూలు చేయాలనే నిబంధనను పరిగణనలోనికి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ని 113 కరువు, 462 తుపాను బాధిత మండలాలతో పాటు మిగతా 86 మండలాల్లోనూ రుణాల రీషెడ్యూలు ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. దీన్ని ఆర్ఐ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకెళ్తానని ఆర్బీఐ ప్రాంతీయ డెరైక్టర్ కె.ఆర్.దాస్ చెప్పా రు. నిర్ణీత గడువు తర్వాత రీషెడ్యూలు చేస్తే బ్యాంకులకు ఇ బ్బందులు ఉంటాయన్నారు. రుణాల రీషెడ్యూలుపై నిర్ణ యం వచ్చే వరకు కొంత సమయం పడుతుందని, ఆలో గా రైతులు రుణాలు చెల్లించి తాజా రుణాలు పొందాలని, రుణా లు చెల్లించిన వారికీ మాఫీ వర్తిస్తుందని ప్రకటన చేయాలని బాబుకు ఎస్ఎల్బీసీ చైర్మన్ రాజేంద్రన్ విజ్ఞప్తి చేశారు. రుణాల చెల్లింపు 3-7 ఏళ్ల గడువివ్వండి... రుణమాఫీ హామీ అమలుకు కట్టుబడ్డామని చంద్రబాబు అన్నారు. ‘‘రుణాలు సకాలంలో చెల్లించిన వారీకీ మాఫీ వర్తింపజేస్తాం. బంగారంపై తీసుకున్న రుణాలు రద్దు చేస్తాం. రుణాలు చెల్లించడానికి రైతులు సిద్ధమైతే సంతోషం. లేదంటే బలవంతంగా వసూలు చేయడానికి బ్యాంకులు చర్యలు చేపట్టకుండా సంయమనం పాటించాలి. హామీ అమలుకు ఏదో మార్గం కనుగొంటాం. ముందు రీషెడ్యూలు చేస్తే బ్యాంకుల కార్యకలాపాలు సజావుగా సాగుతాయి. తర్వాత ఏదొకటి చేస్తాం’’ అని విజ్ఞప్తి చేశారు. రీషెడ్యూలు చేసిన తర్వాత ఏడాది పాటు రుణాల వసూళ్ల మీద మారిటోరియం ఉండాలని, రుణాలు తిరిగి చెల్లించడానికి 3 నుంచి 7 ఏళ్ల గడువు ఇవ్వాలని కోరారు. ఏపీ వార్షిక రుణ ప్రణాళిక రూ. 91,459 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ. 91,459 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఖరారు చేసింది. ఇందులో ప్రాధాన్యత రంగాలకు రూ. 77,894 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రుణాల కింద మొత్తం రూ. 56,019 కోట్లు కేటాయించారు. ఇందులో స్వల్పకాలిక రుణాల కింద రూ. 41,978 కోట్లు, టర్మ్ లోన్స్, వ్యవసాయ అనుబంధ రుణాల కింద రూ. 14,041 కోట్లు కేటాయించారు.