
ఎందుకు విఫలమవుతున్నారు?
తనకు విశేష అనుభం ఉందని చెప్పుకున్న సీఏం చంద్రబాబు వ్యవసాయ రుణమాఫీ అంశంలో ఎందుకు విఫలం అవుతున్నారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ప్రశ్నించారు.
విజయవాడ: పరిపాలనలో తనకు విశేష అనుభం ఉందని చెప్పుకున్న సీఏం చంద్రబాబు నాయుడు వ్యవసాయ రుణమాఫీ అంశంలో ఎందుకు విఫలం అవుతున్నారని కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ ప్రశ్నించారు. హామీని ఎంతవరకు నెరవేరుస్తామన్న విషయం చంద్రబాబు మనసుకు తెలియదా అని అన్నారు.
రైతు రుణమాఫీ -సాగునీటి కొరతపై విజయవాడలో శుక్రవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమవేశంలో ఆయన పాల్గొన్నారు. ఎన్నికల సమయంలో ప్రతి కులం దగ్గరకు వెళ్లి రూ.1000 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు. ప్రజలను చంద్రబాబు నమ్మక ద్రోహం చేశారని విమర్శించారు. పంటల రుణమాఫీపై తనవిధానం ఏంటో స్పష్టంగా చంద్రబాబు వెల్లడించాలని దేవినేని నెహ్రూ డిమాండ్ చేశారు.