సాక్షి, న్యూఢిల్లీ: ఏపీలో నదుల అనుసంధానంపై నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు జాతీయ హరిత ట్రెబ్యునల్(ఎన్‌జీటీ) అదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా పట్టిసీమ, పురుషోత్త పట్నం, చింతలపూడి, గోదావరి-పెన్నా అనుసంధాన ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు అవసరమా? కాదా? అనే విషయంపై కూడా వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని ఎన్‌జీటీ కోరింది. వారం రోజుల్లో నిర్ణయం తీసుకొని నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలికి ఎన్‌జీటీ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను పిబ్రవరి 22కు వాయిదా వేసింది.
ఏపీలో నదుల అనుసంధానం పేరిట అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఎన్‌జీటీలో మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్, త్రినాథ్ రెడ్డి పిటిషన్‌లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. గోదావరి డెల్టాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా నదులు అనుసంధానం చేస్తున్నారని పిటీషనర్లు తమ వాదన వినిపించారు. పిటీషనర్ల వాదనలు విన్న ఎన్‌జీటీ కేంద్ర పర్యావరణ శాఖ, ఏపీ కాలుష్య నియంత్రణ మండలిలో కూడా వీటిపై పిర్యాదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment