భీమడోలు/ఉంగుటూరు, న్యూస్‌లైన్ :
వచ్చే సాధారణ ఎన్నికల్లో తాను పోటీ చేయనని, ఈ విషయూన్ని 2009లో రెండోసారి ఉంగుటూరు నుంచి గెలిచినప్పుడే చెప్పానని తాజా మాజీ మంత్రి వట్టి వసంత్ కుమార్ అన్నారు. తన నిర్ణయంపై అప్పట్లో పత్రికల్లో వచ్చిన వార్తను చూసి నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అడిగితే.. ఆయనకు కారణాలు కూడా అప్పుడే చెప్పానని వసంత్ పేర్కొన్నారు. సోమవారం భీమడోలు మండలం పూళ్ల సొసైటీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఉంగుటూరు నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.
సభకు పార్టీ భీమడోలు మండలాధ్యక్షుడు ఆల్తి సాంబ శివరావు అధ్యక్షత వహించగా వసంత్ కుమార్ మాట్లాడారు. తనను రెండుసార్లు ఉంగుటూరు ఎమ్మెల్యేగా గెలి పించినందుకు నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మారిన పరిస్థితులకు భయపడో.. గెలుపుపై అనుమానం వచ్చో.. పోటీ చేయటానికి వెనుకాడడం లేదని, ఆనాడు ప్రకటించిన నిర్ణయూనికే క ట్టుబడి ఉన్నానన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారని, నాకు 60 సంవత్సరాలు దాటాయన్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఎవరిని నిల బెట్టిన ఆ అభ్యర్థిని గెలిపిస్తానన్నారు. పార్టీలో క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడే ఎమ్మెల్యే, మంత్రి పదవులకు రాజీనామా చేద్దామని అనుకున్నానని, అరుుతే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ గురించి సంప్రదింపులు జరపడంతో పార్టీలో ఉండిపోయానన్నారు. పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు.
పోటీ చేయాలన్న కార్యకర్తలు
వసంత్ కుమార్ ప్రకటనతో కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహం చెందారు. పోటీ చేయాలని కార్యకర్తలు ముక్తకంఠంతో కోరారు. నియోజకవర్గంలోని చుట్టుపక్కల మండలాల నుంచి పెద్ద సంఖ్య కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. డీసీసీబీ అధ్యక్షుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యాల వెంకటరత్నం, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కనకదుర్గ, అఖిల భారత చేనేత కేంద్ర డెరైక్టర్ దొంతంశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు.
ఆనాటి మాటకే కట్టుబడి ఉన్నా..
Published Tue, Mar 4 2014 3:31 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement