నార్నూర్, న్యూస్‌లైన్ :
తెలంగాణ రాదేమోనన్న ఆందోళనతో నార్నూర్ మండలం రాజులగూడలో ఆత్మహత్య చేసుకున్న రాథోడ్ సుశాంత్(20)కు కుటుంబ పభ్యులు, గ్రామస్తులు, జేఏసీ నా యకులు, తెలంగాణవాదులు అశ్రునయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. సుశాంత్ శుక్రవారం పురుగుల మందు తాగి ఆత్మహ త్య చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణను అడ్డుకోవడానికి ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్‌ను యూటీ చేయడానికే సీమాంధ్ర సభకు అనుమతిచ్చారని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ ఏర్పాటుకు తన చావే చివరి చావు కావాలని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్. శనివారం అతడి సుశాంత్ మృతదే హానికి జేఏసీ నాయకులు, తెలంగాణవాదులు నివాళులర్పించారు.
అనంతరం రాజులాగూడ గ్రామంలోని ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. బిగ్గరగా తెలంగాణ నినాదాలు చేశారు. శవయాత్ర నిర్వహించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని జేఏసీ నాయకులు భీష్మించుకు కూర్చున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీఐ అచ్చేశ్వరరావు జోక్యం చేసుకొని జేఏసీ నాయకులకు నచ్చజెప్పారు.
ఆత్మహత్యలు కాదు హత్యలే!
జేఏసీ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ కోసం విద్యార్థులు, యువకులు చేసుకుంటున్నవి ఆత్మహత్యలు కాదని, సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కూమార్‌రెడ్డి చేస్తున్న హత్యలని విమర్శించారు. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణవాదులు శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామన్నా అనుమతి ఇవ్వని ముఖ్యమంత్రి, సీమాంధ్ర సభకు హైదరాబాద్‌లో ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నించారు. బాధితుడి కు టుంబానికి 10 లక్షల ఎక్షగ్రేషియా చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇ వ్వాలని డిమాండ్ చేశారు. జేఏసీ నాయకులు ఆడె సురేశ్, రాథోడ్ ఉత్తం, సయ్యద్ ఖాసీం, ఉర్వెత రూప్‌దేవ్, ఉట్నూర్ జేఏసీ కన్వీనర్, మర్సుకొల తిరుపతి, బానోత్ గజానంద్ నా యక్, లంబాడ హక్కుల పొరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు రామారావ్, టీఆర్‌ఎస్ నాయకు లు కాటం రమేశ్, సెడ్మాకి సీతారామ్, కృష్ణా జాదవ్, భిక్కు, స్థానిక నాయకులు షేక్ దస్తగీర్, కొర్రెళ్ల మహేందర్ పాల్గొన్నారు.
అమరుడికి అశ్రునివాళి
Published Sun, Sep 8 2013 2:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement