తెలంగాణ కోసం మరో ఊపిరి ఆగిపోయింది. ఈ నెల 16న చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న పొట్లపల్లి మమత జిల్లాకేంద్ర ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి శనివారం తుదిశ్వాస విడిచింది. టీజేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలో ఆమె మృతదేహం వద్ద నివాళులర్పించారు.
- న్యూస్‌లైన్, నల్లగొండ టౌన్/చిట్యాల
తెలంగాణ కోసం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన పొట్లపల్లి మమత(22) జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని జేఏసీ నాయకులు స్థానిక గడియారం సెంటర్‌కు తీసుకువచ్చి అక్కడ రాస్తారోకో నిర్వహించారు. అనంతరం మృతదేహంపై పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జూలై 30 తరువాత తెలంగాణ ప్రకటన ఆచరణరూపం దాల్చకపోవడంతోనే ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని ఆవేదనవ్యక్తం చేశారు. వీటికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎవ్వరు కూడా తెలంగాణ కోసం ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా టీఎన్‌జీఓ ఆధ్వర్యం లో మమత అంత్యక్రియల నిర్వహణకు రూ.10 వేలను బంధువులకు అందజేశారు. కార్యక్రమంలో పందిరి వెంకటేశ్వరమూర్తి, మామిడాల రమేష్, ఎం.శ్రవణ్‌కుమార్, సీహెచ్ నర్సిం హాచారి, వెంక ట్రాంరెడ్డి, మారం సంతోష్‌రెడ్డి, రేకల బద్రాద్రి, మైనం శ్రీనివాస్,అభిమణ్యుశ్రీనివాస్, ఫరీదుద్దిన్, జానిమియా, పందుల సైదులు, నాగార్జున, సురభి వెంకటేశ్వర్లు, విశ్వం, అయితగోని జనార్దన్, వెకన్న, మహేం ద్రనాథ్, పి.రవి, వెంకటాచారి, వెంకటేశ్, రావి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు
చిట్యాల : తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న ప్రైవేట్ ఉపాధ్యాయురాలు మమత అంత్యక్రియలు చిట్యాల మండలం పెద్దకాపర్తిలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. పలువురు జేఏసీ నాయకులు అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, టీఆర్‌ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు చెరుకుసుధాకర్, గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, తెలంగాణ జాగృతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, గ్రామ సర్పంచ్ కందిమళ్ల శిశుపాల్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ కందిమళ్ల జైపాల్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకుడు పొట్లపల్లి రవి, గంట్ల రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మమతకు నివాళి
Published Sun, Sep 22 2013 3:35 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
Advertisement
Advertisement