సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లాలో 40వ రోజు ఆదివారం సమైక్యాంధ్ర ఉద్యమం మరింత ఉధృతంగా సాగింది. తిరుపతి ఎంపీ చింతా మోహన్ కనిపించలేదని వెంకటగిరిలో విద్యార్థి జేఏసీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికుల దీక్షలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, ఆనం వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో వీఆర్ కళాశాలలో ఆదివారం ప్రజా సంఘాలతో చర్చావేదిక నిర్వహించారు. వీఆర్‌సీ కూడలిలో యూటీఎఫ్ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉదయగిరిలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ రిలే దీక్షలకు తపాలా ఉద్యోగులు మద్దతు ప్రకటించారు. వరికుంటపాడు బస్టాండ్ సెంటర్‌లో ఉపాధ్యాయుల రిలే దీక్షలు కొనసాగాయి.
దుత్తలూరులో ఉపాధ్యాయులు, వింజమూరులో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షలు 33వ రోజుకు చేరాయి. గూడూరులో బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో టవర్‌క్లాక్ కూడలిలో శాంతిహోమం నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు మోకాళ్లపై కూర్చుని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. జేఏసీ నాయకులు ర్యాలీ నిర్వహించి టవర్‌క్లాక్ సెంటర్‌లో రాస్తారోకో చేశారు.గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరులో జేఏసీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రాస్తారోకో చేశారు. కోట క్రాస్‌రోడ్డులో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల అర్చకులు ర్యాలీ చేపట్టి శాంతిహోమం నిర్వహించారు. వాకాడులో భవన కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది.
అశోక్ స్తంభం కూడలిలో భవన కార్మిక సంఘర రాస్తారోకో నిర్వహించి రోడ్డుపై రాతిగోడను కట్టి నిరసన తెలిపారు. పొదలకూరు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తడలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 27వ రోజు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. మదర్‌సేవా సంస్థ కేంద్ర మంత్రులకు ఉత్తర క్రియలు చేసే కార్యక్రమాన్ని చేపట్టి ప్రదర్శన నిర్వహించారు. నాయుడుపేటలో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా నాయుడుపేట జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.
సమైక్యంపై వెనక్కి తగ్గం
Published Mon, Sep 9 2013 4:37 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement