సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహించొద్దని హైకోర్టులో ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహణ సాధ్యం కాదంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఎస్‌ఈసీ నిర్ణయం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఉందని ప్రభుత్వం తెలిపింది. పిటిషన్‌లో ప్రతివాదిగా ఎన్నికల కమిషన్ కార్యదర్శిని ప్రభుత్వం చేర్చింది. కరోనా సమయంలో ప్రజారోగ్యం ప్రభుత్వ కర్తవ్యమని ఏపీ ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలో ఇప్పటికే కరోనాతో 6వేల మంది మరణించారని, ఎన్నికల ప్రక్రియను వెంటనే నిలిపివేసేలా ఆదేశాలివ్వాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. గతంలో కరోనా అంటూ ఎన్నికలు వాయిదా వేసి.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తామనడంపై పిటిషన్‌లో ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. (చదవండి: సీఎం జగన్‌పై దాఖలైన పిటిషన్లు కొట్టివేత..)
Comments
Please login to add a commentAdd a comment