
సాక్షి, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే వరకు ఓటరు నమోదు ప్రక్రియ కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. జూలైలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల నమోదుపై స్పష్టతనిచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలోనే ఓటర్ల నమోదు, బదిలీ ప్రక్రియ జరుగుతుందని పేర్కొంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఈ ఏడాది మార్చి 25న తుది ఓటర్ల జాబితాను రూపొందించింది. ఈ జాబితా ఆధారంగా రాష్ట్ర ఎన్నికల సంఘం గ్రామపంచాయతీల వారీగా, వార్డుల వారీగా ఓటర్ల జాబితాను తయారు చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఓటర్ల జాబితాలో మార్పులకు అవకాశం ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment