సాక్షి, చెన్నై: స్థానిక ఎన్నికల్ని ఒంటరిగానే ఎదుర్కునేందుకు డీఎండీకే అధినేత విజయకాంత్ సిద్ధమైనట్టున్నారు. ఇందులో భాగంగా పార్టీ తరఫున పోటీకి ఉత్సాహంగా ఉన్న వాళ్ల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 21 నుంచి దరఖాస్తుల్ని స్వీకరించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం డీఎండీకేను డీలా పడేలా చేసింది. ఆ పార్టీలో కీలక నేతలుగా ఉన్న వాళ్లందరూ డీఎంకే, అన్నాడీఎంకే గూటికి చేరి ఉన్నారు.
ప్రస్తుతం విజయకాంత్‌కు సన్నిహితంగా ఉన్న కొందరు నాయకులు, జిల్లాల్లో కొత్తగా నియమించబడ్డ నాయకులు మాత్రమే డీఎండీకేలో ఉన్నారు. ఈ సమయంలో స్థానిక సమరంతో తమ బలాన్ని పెంచుకునేందుకు తగ్గట్టుగా తీవ్ర కుస్తీలను విజయకాంత్ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పును ఈ సారి చేయకూడదన్న నిర్ణయానికి వచ్చి ఉన్న విజయకాంత్, ఒంటరిగా స్థానిక సమరంలోకి వెళ్లేందుకు నిర్ణయించినట్టుగా సంకేతాలు వెలువడుతున్నాయి.
ఇందుకు తగ్గ అధికారిక ప్రకటన మరో వారం రోజుల్లో వెలువడే అవకాశాలు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ తరఫున స్థానిక ఎన్నికల్లో పోటీకి ఉత్సాహంగా ఉన్న వారిని నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించేందుకు నిర్ణయించారు. ఆ మేరకు ఈ నెల 21 నుంచి రాష్ట్ర పార్టీ కార్యాలయంతోపాటుగా జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈ దరఖాస్తుల్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఒంటరిగానే!
Published Tue, Sep 20 2016 1:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
Advertisement
Advertisement