
సాక్షి, విశాఖ : ఉత్తరాంధ్రలో ఏదైనా అభివృద్ది జరిగింది అంటే అది వైఎస్ పాలనలోనేనని పురపాలకశాక మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోనే వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన, వార్డుల విభజన, విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడికి అభివృద్ధి గురించి ఏం తెలుసని.. అయిదేళ్ల పాలనలో సమావేశాల నిర్వహణ మినహా మరో పని చేయలేదని విమర్శించారు. జీవీఎంసీ ఎన్నికలకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయాయని, త్వరలోనే స్థానిక ఎన్నికలు జరగనున్నట్లు వెల్లడించారు. మూలకొద్దు గ్రామం సమస్య కూడా త్వరలోనే పరిష్కరిస్తామని, కన్సల్టెన్సీలు రిపోర్టులను చదివి అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో ఐటీ కంపెనీలు అభివృద్ధి కూడా వైఎస్ పాలనలో జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.