సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ బొత సత్యనారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్సీ బొత్స సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ పుంగనూరు వెళ్తున్నారని తెలిసి మంత్రులు అక్కడ పర్యటించారు. నిన్నటి వరకు మంత్రులు ఎందుకు పుంగనూరు వెళ్లలేదు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా విభజన హామీలు, విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి. అధికారంలో భాగస్వాములు కాబట్టి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆపాలి. రైల్వే జోన్ పనులు వెంటనే ప్రారంభించాలి. వాల్తేర్ డివిజన్‌తో కూడిన రైల్వే జోన్ ఇవ్వాలి. చంద్రబాబు ప్రత్యేక హోదాపై కూడా ప్రశ్నించాలి.
రాష్ట్రంలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. భవన నిర్మాణ కార్మికులు పని లేక వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇసుక కొరత 26 రంగాలకు చెందిన కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గత ప్రభుత్వ హయాంలో టన్నుకు 370 సీనరేజ్ చార్జీ ఉండేది. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో విజయనగరంలో సీనరేజ్ చార్జీతో 10 టన్నుల ఇసుక 10 వేలకు దొరికేది. ప్రస్తుతం విజయనగరంలో 13 నుంచి 14 వేలకు దొరుకుతుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో వైజాగ్‌లో ఇసుక 14 నుంచి 15 వేలకు దొరికేది. కూటమి పాలనలో విశాఖలో 21 వేయి నుంచి 22 వేలకు దొరుకుతోంది. ప్రభుత్వం ఉచితంగా ఇసుక అన్న తరువాత సీ ఫేజ్ లేక పోయినా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో కంటే ఎక్కువ రేటుకు వసూళ్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి.
ఏపీలో కూటమి పాలనలో నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో ధరలు పెరిగినప్పుడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రజలకు తక్కువ రేటుకు అందించేది. కూటమి ప్రభుత్వం నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రించాలి. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాస్తాను. విశాఖలో 25వేల కేజీల డ్రగ్స్ సంధ్యా ఆక్వాకు గతంలో వచ్చాయి. అవి పురంధరేశ్వరి బంధువులకు సంబంధించినది అనే ప్రచారం జరిగింది. మరి 25 వేల కేజీల డ్రగ్స్ కేసు ఏమైందో తెలియదు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలో దీనిపై ప్రస్తావిస్తాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment