హాంకాంగ్‌ ఎన్నికల్లో చైనాకు షాక్‌ | Pro-democracy groups makes big gains in Local Hong Kong elections | Sakshi
Sakshi News home page

హాంకాంగ్‌ ఎన్నికల్లో చైనాకు షాక్‌

Published Tue, Nov 26 2019 4:33 AM | Last Updated on Tue, Nov 26 2019 4:36 AM

Pro-democracy groups makes big gains in Local Hong Kong elections - Sakshi

హాంకాంగ్‌: హాంకాంగ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైనా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రజాస్వామ్య అనుకూలవాదులు భారీ విజయం సాధించారు. మొత్తం 18 జిల్లాల్లోని 452 స్థానాల్లో 388 మంది ప్రజాస్వామ్య అనుకూలవాదులు గెలిచారు. చైనా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కేవలం 59 మంది, మరో ఐదుగురు స్వతంత్రులు గెలిచారు. చైనా అనుకూల పార్టీకి చెందిన  155 మంది ఓడిపోయారు. అయితే, హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ను ఎన్నుకునే 1,200 మందితో కూడిన ఎలక్టోరల్‌ కాలేజీ చైనా ప్రభుత్వ నియంత్రణలో ఉంటుంది. ‘ఎన్నికల ఫలితమెలా ఉన్నా చైనా ఆధీనంలోనే హాంకాంగ్‌ కొనసాగుతుంది. నిరసనలు, హింసాత్మక ఘటనలను అణచివేస్తాం’ అని చైనా స్పందించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement