భోపాల్: మధ్యప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్నాయి. ఈ నెల 17న రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, నగర కౌన్సిళ్లు, 51 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. శనివారం కౌంటింగ్ కొనసాగుతోంది. తాజాగా వెలువడిన రాఘవ్‌గఢ్ నగర కౌన్సిల్ ఎన్నికల్లో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. రాఘవ్‌గఢ్ నగర్‌లో మొత్తం 24 వార్డులు ఉండగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఏకంగా 20 వార్డులను గెలుపొంది సత్తా చాటింది. అధికార కమల దళానికి కేవలం నాలుగు వార్డులు మాత్రమే దక్కాయి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఎన్నికలు ‘సెమీఫైనల్’గా భావిస్తున్నారు. ఈ ఎన్నికలను ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటీచేశాయి. సీఎం శివ్‌రాజ్‌సింగ్ చౌహాన్‌తోపాటు ప్రధాన నేతలు ఎన్నికల ప్రచారంలో హోరాహోరీగా పాల్గొన్నారు. మొత్తం ఫలితాలు వెలువడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment