ఉత్తరాంధ్రలో ఏదైనా అభివృద్ది జరిగింది అంటే అది వైఎస్ పాలనలోనేనని పురపాలకశాక మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. జిల్లాలోనే వీఎంఆర్‌డీఏ కార్యాలయంలో మంగళవారం మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమావేశం నిర్వహించారు. విశాఖలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన, వార్డుల విభజన, విశాఖ ఉత్సవ్ ఏర్పాట్లపై చర్చించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వినయ్‌చంద్ వీఎంఆర్‌డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జీవీఎంసీ కమిషనర్ సృజన పాల్గొన్నారు.