సాక్షి, అనంతపురం : టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన చట్టంపై బుధవారం ఆయన స్పందించారు. నూతన చట్టం అమలు అయితే ఎన్నికల్లో పోటీ చేయలేమని పేర్కొన్నారు. కాగా స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం నిషేదిస్తూ సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. డబ్బు, మద్యం పంచినట్లు రుజువైతే మూడు సంవత్సరాల పాటు జైలుశిక్ష తప్పదని సీఎం ఆదేశాలపై జేసీ మాట్లాడుతూ.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలకు దూరంగా ఉంటామని.. మున్సిపల్, సర్పంచ్, పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయమని తెలిపారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయవద్దంటే ఎలా అని.. డబ్బు పంచితే జైలుకు వెళ్లాలా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి చట్టం ఉంటే పోటీ చేసినా ప్రయోజనం ఉండదని అభిప్రాయం వ్యక్తం చేశారు. (జేసీ ఫోర్జరీ కేసులో సరికొత్త ట్విస్ట్)
‘గత స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసే మా వాళ్లు ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో మా అనుచరులు దూరంగా ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో ఇటాంటి చట్టాలు లేవు కనుకే పోటీ చేస్తున్నాం. చంద్రబాబు అదృష్టవంతుడు.. విశాఖలో ఎలాంటి భౌతిక దాడి లేకుండానే క్షేమంగా బయటపడ్డారు’.అని వ్యాఖ్యానించారు. (అల్లు అర్జున్, విజయ్ డైట్ తెలుసుకోవాలి: హృతిక్ )
Comments
Please login to add a commentAdd a comment