కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ స్థానిక ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. మంగళవారం రాత్రి 11:30కి ప్రకటించిన ఫలితాల్లో 30,391 సీట్లను కైవసం చేసుకుంది. ఓట్ల లెక్కింపులో మరో 1,767 పంచాయతీ స్థానాల్లో ముందంజలో కొనసాగు తోంది. టీఎంసీ ప్రధాన ప్రత్యర్థి అయిన బీజేపీ 8,239 పంచాయతీ సీట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో 447 సీట్లలో ముందంజలో ఉంది.
లెఫ్ట్ ఫ్రంట్ 2,534 స్థానాల్లో విజయ బావుటా ఎగురవేసింది. కాంగ్రెస్ పార్టీ 2,158 సీట్లను సొంతం చేసుకుంది. సీపీఎంకు 2,409 సీట్లు లభించాయి. ఇతర పార్టీలు 725 సీట్లు దక్కించుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థులు 1,656 స్థానాలు సాధించడం విశేషం. రాష్ట్రంలో మొత్తం 63,229 గ్రామ పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇక 9,728 పంచాయతీ సమితి స్థానాలకు ఎన్నికలు జరగ్గా, టీఎంసీ 2,155 స్థానాలను గెలుచుకుంది.
493 సీట్లలో లీడింగ్‌లో ఉంది. బీజేపీ 214 స్థానాలను గెలిచింది. 113 చోట్ల లీడింగ్‌లో ఉంది. 928 జిల్లా పరిషత్ సీట్లకు టీఎంసీ ఇప్పటివరకు 77 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. బెంగాల్‌లో శనివారం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారీగా హింస చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ హింసాకాండలో కనీసం 15 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 11 మంది అధికార టీఎంసీకి చెందినవారే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment