నల్లగొండ స్థానిక ఎన్నికల్లో జాయింట్‌ కిల్లర్‌..! | Political Parties Interested In Local Elections | Sakshi
Sakshi News home page

నల్లగొండ స్థానిక ఎన్నికల్లో జాయింట్‌ కిల్లర్‌..!

Published Thu, Jan 2 2020 7:08 AM | Last Updated on Thu, Jan 2 2020 7:09 AM

Political Parties Interested In Local Elections - Sakshi

సాక్షి, కోదాడ : ఎందుకైనా మంచిది... అనే ఒక ఆలోచన ఆమెకు ఏకంగా చైర్మన్‌గిరి దక్కేలా చేసింది. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని ఆమె ప్రత్యర్థి అయిన చైర్మన్‌ అభ్యర్థిని ఓడించి జాయింట్‌ కిల్లర్‌గా మారింది. అంతే కాకుండా చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన తన తోటి కోడలు అనూహ్యంగా ఓటమి పాలు కావడంతో లక్కీగా చైర్మన్‌ రేసులో నిలిచింది. నాటకీయ పరిణామాల మధ్య పదవి దక్కించుకొని కోదాడ మున్సిపాలిటీ మొదటి చైర్మన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. మారిన రాజకీయ పరిస్థితుల్లో సీటు ఇచ్చి గెలిపించిన కాంగ్రెస్‌ పార్టీకి చెయ్యిచ్చి అధికార టీఆర్‌ఎస్‌లో చేరి ఐదు సంవత్సరాలు చైర్‌పర్సన్‌గా పరిపాలన చేసింది కోదాడ మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వంటపులి అనిత. నెల రోజుల క్రితం వరకు రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్న ఆమె ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 

అనూహ్యంగా తెర మీదకు..
మేజర్‌ గ్రామపంచాయతీగా ఉన్న కోదాడ 2013లో మున్సిపాలిటీగా మారింది. దీనికి 2014లో మొదటిసారిగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ, టీడీపీ ముఖాముఖి పోటీపడ్డాయి. చైర్మన్‌ పదవి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో కాంగ్రెస్‌ పార్టీ నుంచి వంటిపులి గోపయ్య పెద్ద కోడలు వంటిపులి నాగలక్ష్మిని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో 30వ వార్డులో బరిలోకి దిగింది. ఇక టీడీపీ నుంచి మాజీ సర్పంచ్‌ పారా సీతయ్య సతీమణి పారా సత్యావతిని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రకటించడంతో 19వ వార్డులో పోటీకి దిగింది.

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన చైర్మన్‌ అభ్యర్థిత్వాన్ని తమ కుటుంబానికి అప్పగించినందున ఎందుకైనా మంచిదని వంటిపులి గోపయ్య తన చిన్న కోడలు వంటిపులి అనితను 19వ వార్డులో పోటీలో నిలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాడు 30 వార్డుల్లో పోటీ చేయడానికి, అభ్యర్థులను నిలపడానికి నానా తి ప్పలు పడింది. ఒక్కరు కూడా 100కు మించి ఓట్లు సాధించలేకపోయారు.

ఇద్దరు చైర్మన్‌ అభ్యర్థుల ఓటమి..
కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా 30వ వార్డులో పోటీ చేసిన వంటిపులి నాగలక్ష్మిపై టీడీపీ అభ్యర్థి గు డుగుంట్ల మానస 36 ఓట్ల తేడాతో గెలుపొందారు. టీడీపీ నుంచి చైర్మన్‌ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యవతిపై కాంగ్రెస్‌ అభ్యర్థి వంటిపులి అ నిత 180 ఓట్ల మెజార్టీతో విజయం సాధించా రు. ఇ ద్దరు చైర్మన్‌ అభ్యర్థులు ఓటమి పా లు కా వ డం నాటి ఎన్నికల్లో చర్చనీయాంశమైంది.

ఇద్దరిని దోబూచులాడిన పదవి..
30 వార్డులున్న కోదాడ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ 14, టీడీపీ 14 స్థానాలను గెలుచుకున్నాయి. ఇక వైఎస్సార్‌సీపీ నుంచి ఒకరు గెలుపొందారు. 22వ వార్డులో కాంగ్రెస్‌ అభ్యర్థిగా తెప్పని శ్రీనివాస్‌ను కాదని కట్టెబోయిన శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇచ్చింది. దీంతో శ్రీనివాస్‌ టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుపొందారు. దీంతో చైర్మన్‌ అభ్యర్థిగా టీడీపీ వారికి అవకాశం వస్తుందని అనుకున్నారు.

కాని నాటి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే పద్మావతి, కాంగ్రెస్‌ ఎంపీ గుత్తా సుఖేంధర్‌రెడ్డి చక్రం తిప్పారు. దీనికి తోడు ఇండిపెండెంట్, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంతో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా తమ ఓటును ఇక్కడే వినియోగించుకోవడంతో వంటిపులి అనిత చైర్మన్‌గా, ఇండిపెండెంట్‌ తెప్పని శ్రీను వైస్‌ చైర్మన్‌గా ఎంపికయ్యారు.

అటు నుంచి ఇటు..
మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి చైర్మన్‌ పదవి దక్కించుకున్న  వంటిపులి అనిత కొంత మంది కౌన్సిలర్లతో కలిసి టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఇదే సమయంలో టీడీపీ నుంచి గెలిచిన పారా సీతయ్య కూడా తన వర్గానికి చెందిన 11 మంది కౌన్సిలర్లతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ప్రత్యర్థి వర్గాలు రెండు అధికార పక్షంలో ఉన్నప్పటికీ ఉప్పు నిప్పులా వ్యవరించేవారు. ఒక దశలో అనితపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని చూసినప్పటికీ అనిత వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని ఐదు సంవత్సరాల తన పదవిని కాపాడుకున్నారు.

ఈ క్రమంలో 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు పారా సీతయ్య వర్గానికి చెందిన 11మంది కౌన్సిలర్లు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. టీడీపీ మద్దతుతో కౌన్సిలర్‌గా గెలిచి ఈ తరువాత కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో  వైస్‌ చైర్మన్‌గా వ్యవహరించిన తెప్పని శ్రీనివాస్‌ ఐదు సంవత్సరాలు అదే పార్టీలో, అదే పదవిలో కొనసాగారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement