
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ‍్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు.