Polaki srinivasa rao
-
ఆ విషయంలో పునరాలోచన చేయాలి
సాక్షి, విశాఖపట్నం: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఎన్నికల కమిషన్ పునరాలోచన చేయాలని ఏపీ బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు పోలాకి శ్రీనివాస్ కోరారు. కరోనా నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తగదని, కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే మంచిదని పేర్కొన్నారు. రోజుకి మూడు, నాలుగు వేలు కరోనా కేసుల నేపథ్యంలో ఎన్నికల వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులకు ఏమైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల పేరుతో ఉద్యోగులను బలి చేయొద్దని కోరారు. -
9న విద్యుత్ జేఏసీ సమావేశం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈనెల 9న ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్టు సమైక్యాంధ్ర విద్యుత్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ పోలాకి శ్రీనివాసరావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్లో ఈ సమావేశం ఉంటుందని, రాష్ట్ర విభజనకు పాల్పడితే తక్షణమే మెరుపు సమ్మెకు దిగేందుకు కార్యాచరణ ప్రణాళికను చర్చించనున్నట్టు వెల్లడించారు. శుక్రవారం నుంచి సీమాంధ్రలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్లట్లు పేర్కొన్నారు.