సాక్షి, న్యూఢిల్లీ : స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం పేర్కొంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు.. ఇబ్బంది లేకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చదవండి: ‘ప్రజల ప్రాణాలతో నిమ్మగడ్డ చెలగాటం’)
ఇది ఇలా ఉండగా, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ నెల 8వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా.. 11వ తేదీన ఎస్ఈసీ ఆదేశాలను హైకోర్టు సింగిల్ జడ్జి కొట్టేశారు. ఎన్నికల కమిషన్ ఆచరణ సాధ్యం కాని నిర్ణయం తీసుకుందని ఆక్షేపించారు. ఈ ఎన్నికల షెడ్యూల్ రాజ్యాంగంలోని అధికరణలు 14, 21లకు విరుద్ధమని తేల్చి చెప్పారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కరోనా వ్యాక్సినేషన్ బృహత్కార్యానికి విఘాతం కలిగిస్తుందని స్పష్టం చేశారు. చదవండి: చంద్రబాబు యూటర్న్.. వ్యూహకర్త నియామకం
Comments
Please login to add a commentAdd a comment