న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధానికి సరైన కారణం ఉందని అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడిన సందర్భాల్లో.. ‘ 3 నెలలకు మించి ముందస్తు నిర్బంధంలో ఉంచరాదు’ అనే నిబంధన వర్తించబోదని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. గత ఏడాది ఆగస్టులో తనను అరెస్ట్‌చేశారని, కాకినాడ జిల్లా మేజి్రస్టేట్ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వు చెల్లదంటూ పెసల నూకరాజు అనే వ్యక్తి ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయగా దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది.
‘ ముందుస్తు నిర్బంధం సహేతుకమని అడ్వైజరీ బోర్డు భావిస్తే మూడునెలలకు మించి కూడా సంబంధిత వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించవచ్చు. నిర్బంధం మూడు నెలలకు మించకూడదనే నిబంధన ఇలాంటి సందర్భాల్లో వర్తించదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ‘కింది కోర్టు ఉత్తర్వుల్లో ఇంతకాలం నిర్బంధించండి అని పేర్కొంటే అంత కాలానికే నిర్బంధంలో ఉంచుతారు. ఒకవేళ కాలావధిని కోర్టు పేర్కొనకపోతే ఆ వ్యక్తిని గరిష్టకాలం(12 నెలలు) నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ ఉత్తర్వులొచ్చాక ప్రతీ మూడు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును సమీక్షించాల్సిన అవసరంలేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment