Preventive Detention
-
సలహా బోర్డు అనుమతిస్తే.. 3 నెలలకుపైగా నిర్బంధించొచ్చు
న్యూఢిల్లీ: ముందస్తు నిర్బంధానికి సరైన కారణం ఉందని అడ్వైజరీ బోర్డు అభిప్రాయపడిన సందర్భాల్లో.. ‘ 3 నెలలకు మించి ముందస్తు నిర్బంధంలో ఉంచరాదు’ అనే నిబంధన వర్తించబోదని సర్వోన్నత న్యాయస్థానం తేలి్చచెప్పింది. గత ఏడాది ఆగస్టులో తనను అరెస్ట్‌చేశారని, కాకినాడ జిల్లా మేజి్రస్టేట్ ఇచ్చిన ముందస్తు నిర్బంధ ఉత్తర్వు చెల్లదంటూ పెసల నూకరాజు అనే వ్యక్తి ఆంధ్రపదేశ్ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలుచేయగా దానిని హైకోర్టు కొట్టేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా గురువారం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పారి్ధవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం ఆయనకు వ్యతిరేకంగా తీర్పును వెలువరించింది. ‘ ముందుస్తు నిర్బంధం సహేతుకమని అడ్వైజరీ బోర్డు భావిస్తే మూడునెలలకు మించి కూడా సంబంధిత వ్యక్తులను నిర్బంధంలో కొనసాగించవచ్చు. నిర్బంధం మూడు నెలలకు మించకూడదనే నిబంధన ఇలాంటి సందర్భాల్లో వర్తించదు’ అని కోర్టు తీర్పు చెప్పింది. ‘కింది కోర్టు ఉత్తర్వుల్లో ఇంతకాలం నిర్బంధించండి అని పేర్కొంటే అంత కాలానికే నిర్బంధంలో ఉంచుతారు. ఒకవేళ కాలావధిని కోర్టు పేర్కొనకపోతే ఆ వ్యక్తిని గరిష్టకాలం(12 నెలలు) నిర్బంధంలో ఉంచుతారు. నిర్బంధ ఉత్తర్వులొచ్చాక ప్రతీ మూడు నెలలకు రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వును సమీక్షించాల్సిన అవసరంలేదు’ అని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. -
జనసేన నేత బైండోవర్
సాక్షి, అనంతపురం: జనసేన పార్టీ నాయకుడు, గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే కొట్రికె మధుసూదన గుప్తాను బైండోవర్ చేశారు. 21, 23న జరిగే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, ముందస్తు చర్యల్లో భాగంగా గుంతకల్లు మధుసూదన్ గుప్తాని శుక్రవారం పోలీసులు బైండోవర్ చేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గుత్తి పట్టణం కర్నూలు రోడ్డులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన మధుసూదన్ గుప్తా ఈవీఎంను పగులగొట్టారు. అప్పడు ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా జరిగేందుకు గుత్తి పోలీసులు పాత కేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌ని బైండోవర్ చేశారు. రూ.లక్ష సొంత పూచికత్తు తీసుకుని తహసీల్దార్ బ్రహ్మయ్య ఎదుట బైండోవర్ చేశారు. (చదవండి: ఇది ఫెవికాల్ బంధం) కాగా, గత ఎన్నికలకు ముందు అప్పటి టీడీపీ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్, ఆయన కుమారుడిని ఉద్దేశించి మధుసూదన గుప్తా తీవ్ర వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ‘మర్డర్లు చేయడం నాకు కొత్తకాదు, గతంలో టీడీపీ వారి ఆస్తులు, ఆడవాళ్ల జోలికి వచ్చానంటే అది రాజకీయంలో భాగమేన’ని వ్యాఖ్యానించి కలకలం రేపారు. (వెంటాడి కత్తులతో నరికిన జనసేన కార్యకర్తలు) పలువురి నామినేషన్ల తిరస్కరణ జెడ్పీటీసీ నామినేషన్ల పరిశీలన (స్క్రూట్నీ)లో రెండేసి సెట్లు వేసిన అభ్యర్థులకు సంబంధించి ఒక సెట్టును తిరస్కరించారు. అలాగే వివిధ కారణాల వల్ల మరో 8 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించారు. 1995 తర్వాత మూడో సంతానం కల్గిన కారణంగా కదిరి ఇండిపెండెంట్ అభ్యర్థి ఎం.కమలాబాయి నామినేషన్‌ను, కుల ధ్రువీకరణ పత్రం జత చేయని కారణంగా విడపనకల్లు వైఎస్సార్సీపీ తరుఫున దాఖలు చేసిన మేకల పంపాపతి నామినేషన్‌ను, డిక్లరేషన్‌లో అభ్యర్థి సంతకం చేయని కారణంగా అగళి బీజేపీ అభ్యర్థి ఇ.చిక్కప్ప నామినేషన్‌ను, అనంతపురం నగరంలో ఓటరుగా నమోదైన కారణంగా గోరంట్ల బీజేపీ అభ్యర్థి కె.భాస్కర్ నాయక్ నామినేషన్‌ను తిరస్కరించారు. కాగా, తిరస్కరణకు గురైన నామినేషన్లకు సంబంధించి తనకల్లు అభ్యర్థి వై. ఈశ్వరమ్మ, రొళ్ల అభ్యర్థి ఎస్.గౌడప్ప, పరిగి అభ్యర్థి కె.లక్ష్మీదేవమ్మ శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి వద్ద అప్పీలు చేసుకున్నారు. నేటితో నామినేషన్ల ఉపసంహరణ పూర్తి జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల నామినేషన్ల అంకం తుదిదశకు చేరుకుంది. శనివారం నామినేషన్ల ఉపసంహరణతో ఈ ప్రక్రియ ముగుస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. కాగా గురువారం రాత్రి 428 మంది నామినేషన్లు ఆమోదం పొందినట్లు తెలిపిన జెడ్పీ అధికారులు శుక్రవారం ఉదయానికి 409 నామినేషన్లను ధ్రువీకరించారు. ఇందులో 9 బీఎస్పీ, 40 బీజేపీ, సీపీఐ 5, సీపీఎం 7, కాంగ్రెస్ 33, వైఎస్సార్సీపీ 138, టీడీపీ 132, జనసేన 16, ఇండిపెండెంట్లు 29 నామినేషన్లు ఉన్నాయి. -
టార్గెట్..సేఫ్ సిటీ
► ఎనిమిది శాతం మేర తగ్గిన నేరాలు ► తీవ్రమైన వాటిపై ప్రత్యేక దృష్టి ► ఆపరేషన్ స్మైల్‌లో దేశంలోనే అగ్రస్థానం ► యూబ్ఖాన్పై చట్ట ప్రకారం చర్యలు ► వార్షిక సమావేశంలో నగర కొత్వాల్ వెల్లడి సిటీబ్యూరో: ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, పోలీసుల సమష్టి కృషి ఫలితంగా గత ఏడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో 8 శాతం నేరాలు తగ్గాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను సేఫ్ సిటీగా మార్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని పోలీసు ఆఫీసర్స్ మెస్‌లో 2016కు సంబంధించి వార్షిక నివేదిక విడుదల చేసేందుకు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్వాల్ చెప్పిన అంశాలు ఆయన మాటల్లోనే.. సేఫ్ సిటీ స్థాపన లక్ష్యంతో... ‘తెలంగాణ ముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి ఆదేశాల మేరకు నగరంలో వ్యవస్థీకృత నేరాలకు తావు లేకుండా, దేశంలోనే ఉత్తమ సేఫ్ సిటీగా తీర్చిదిద్దడానికి సిటీ పోలీసు వింగ్ అహర్నిశలు పని చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది జరిగిన బోనాలు, గణేష్ ఉత్సవాలు సహా అన్ని కీలక ఘట్టాలనూ చిన్న ఉదంతం కూడా లేకుండా పూర్తి చేయగలిగాం. ఒకప్పుడు నగరంలో మహిళలు ఆభరణాలు ధరించి బయటకు రావడానికి భయపడేవారు. దీన్ని ఛాలెంజ్‌గా తీసుకుని పని చేయడంతో స్నాచింగ్స్ కేసుల్లో 66 శాతం తగ్గుదల నమోదైంది. తీవ్రమైన నేరాలు 31 శాతం, ప్రాపర్టీ అఫెన్సులు 16 శాతం, వేధింపులు 18 శాతం, మహిళలపై జరిగే నేరాలు 12 శాతం తగ్గుదల నమోదుచేసుకున్నాయి. షీ–టీమ్స్ పని తీరు కారణంగా వేధింపుల కేసులు 1175 (2015) నుంచి 969కు (2016) వచ్చాయి. నేరగాళ్ళకు శిక్షలు పడేలా చర్యలు... కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు పెండెన్సీ తగ్గించడం, నేరగాళ్ళపై కేసులు రుజువు చేయడానికి అండర్ ఇన్వెస్టిగేషన్ (యూఐ) కేసు మేళాలు చేపట్టాం. ఫలితంగా 50 శాతం పెండెన్సీ తగ్గింది. కరుడుగట్టిన, పదేపదే నేరాలు చేసే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నాం. మరోపక్క న్యాయవ్యవస్థతో సమన్వయం ఏర్పాటు చేసుకుని వారు జైల్లో ఉండగానే కేసు విచారణ పూర్తయ్యేలా ప్రయత్నిస్తున్నాం. ఫలితంగా నేరం నిరూపితమయ్యే కేసుల శాతం 36కు పెరగడంతో పాటు 23 మందికి జీవితఖైదు పడింది. సేఫ్ సిటీగా పిలిచే చెన్నైలో ప్రతి ఏడాది 2500 మంది నేరగాళ్ళపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తారు. దాన్ని ఆదర్శంగా తీసుకుంటూ సిటీలో ఈ ఏడాది 283 మందిపై ప్రయోగించాం. దీంతో ఇప్పటి వరకు మొత్తం 547 మందిపై ఇది ప్రయోగించినట్లైంది. ప్రజల కోసం, వారి భాగస్వామ్యంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది వీటి ఆధారంగా 244 కేసుల్లో ఆధారాలు లభించగా... 210 మందిని గుర్తించి అరెస్టు చేశాం. బాలబాలికల కోసం ‘స్మైల్’... ప్రమాదకరమైన పరిశ్రమల్లో పని చేస్తున్న, బాల్యాన్ని కార్ఖానాలకు అంకితం చేస్తున్న బాలబాలికల విముక్తి కోసం ఆపరేషన్ స్మైల్ చేపట్టి వారిని రెస్క్యూ చేస్తున్నాం. 800 మందికి పైగా బాలకార్మికులకు విముక్తి కల్పించి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచాం. సుప్రీం కోర్టు గతంలో ఐటీ యాక్ట్‌లోని సెక్షన్ 66 (ఎ)ను తొలగించింది. దీనిస్థానంలో రావాల్సిన మరో సెక్షన్ అమలులోకి రాలేదు. దీంతో ఈ సెక్షన్ కింద నమోదు చేసే కేసులు తగ్గడంతో సైబర్ క్రైమ్స్‌లో 24 శాతం తగ్గుదల నమోదైంది. ట్రాఫిక్ విషయంలో హైదరాబాద్ సిటీ దేశంలోనే ఉత్తమంగా ఉంది. అయినప్పటికీ సంతృప్తి పడకుండా ఇంకా మెరుగుదలకు కృషి చేస్తున్నాం. వివిధ రకాల క్రమశిక్షణా చర్యల కింద ఈ ఏడాది దాదాపు 25 మంది పోలీసుల్ని డిస్మిస్ చేశాం. పోలీసు ట్విన్ టవర్స్ పనులు ప్రారంభమయ్యాయి. 21 నెలల్లో నిర్మాణం పూర్తవుతుంది. ఈ లోపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకుంటాం. పదేపదే ‘నిర్లక్ష్యాలపై’ చర్యలు... నగరంలోని కొన్ని ఆస్పత్రులు, స్కూళ్ళల్లో అపశృతులు చోటు చేసుకుంటున్నాయి. వీరి నిర్లక్ష్యం కారణంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ప్రస్తుతం ఈ ఉదంతాలపై కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ఓకే హాస్పటల్, స్కూల్లో పదేపదే ఉదంతాలు జరిగితే వాటి లైసెన్సులు రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించాం.’ అని కమిషనర్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. అయూబ్‌ఖాన్ కేసులపై ప్రత్యేక దృష్టి... సౌత్‌జోన్ పోలీసులు అరెస్టు చేసిన అయూబ్‌ఖాన్‌పై పీడీ యాక్ట్ ప్రయోగిస్తాం. అతడు సాక్షుల్ని బెదిరించే, ప్రభావితం చేసే ఆస్కారం లేకుండా జైల్లో ఉన్నప్పుడే కేసుల విచారణ పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తాం. ఇతడి బోగస్ పాస్‌పోర్ట్ వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రాథమిక సమాచారం బట్టి శిక్షపడక ముందే దీన్ని పొందాడని తెలుస్తోంది. ఎలాంటి ఉల్లంఘనలు ఉన్నట్లు తేలినా బాధ్యులైన సిబ్బంది పైనా చర్యలు తీసుకుంటాం. ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉంది. నగరంలో సోషల్ మీడియా మానిటరింగ్ ద్వారా దీనికి ఆకర్షితులైన వారిని గుర్తించి కుటుంబీకులు, సంబంధీకులతో కలిపి డీ–రాడికలైజేషన్ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. హద్దులు దాటిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నాం. మరోపక్క మద్యం తాగి వాహనాలు నడపటం ద్వారా జరుగుతున్న ప్రమాదాలు నిరోధించే చర్యలు తీసుకుంటున్నాం. 2015లో 16,633 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు కాగా... 2940 మంది జైలుకు వెళ్ళారు. నవంబర్ 30 వరకు 16,602 కేసులు నమోదుకాగా.. జైలుకు వెళ్ళిన వారి సంఖ్య 7017గా ఉంది. ‘నిషా’చరుల నుంచి రూ.2,92,40,700 జరిమానా వసూలైంది. -
‘పేకాట’ పైనా పీడీ యాక్ట్!
మోసం కోణాన్ని గుర్తించిన టాస్క్‌ఫోర్స్ నిర్వాహకులపై చీటింగ్ కేసుల నమోదు పీడీ యాక్ట్ ప్రయోగానికీ అవకాశం రంగం సిద్ధం చేస్తున్న ఎస్బీలోని {పత్యేక సెల్ సిటీబ్యూరో: నగరంలో పేద, మధ్య తరగతి కుటుంబాలను కూలుస్తున్న పేకాటపై ఉక్కుపాదం మోపడానికి సిటీ కాప్స్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ శిబిరాలను నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటి వరకు అవకాశం చిక్కలేదు. దీంతో లోతుగా ఆరా తీసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ‘మోసం’ కోణం గుర్తించారు. దీని ఆధారంగా కీలక వ్యక్తులపై ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్ట్ ప్రయోగించడానికి సన్నాహాలు చేస్తున్నారు. సిటీలో ఒకప్పుడు దాదాపు 15 వరకు ప్రముఖ, అనుమతులు ఉన్న క్లబ్బులు ఉండేవి. వీటివల్ల జరుగుతున్న దారుణాలు, కూలిపోతున్న కుటుంబాలను పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం ఏడాదిన్నర క్రితం పేకాట క్లబ్బుల్ని బ్యాన్ చేసింది. మొదలైన స్థానిక ‘శిబిరాలు’... నగరంలోని క్లబ్బులు మూతపడటంతో పేకాటరాయుళ్లు ప్రత్యామ్నాయాల కోసం వెతికారు. ఇలాంటి వారి బల హీనతల్ని క్యాష్ చేసుకోవడానికి స్థానికంగా పేకాట శిబి రాలు పట్టుకొచ్చాయి. ఒకప్పుడు క్లబ్బులకు వెళ్లి ఆడినవాళ్లు, పేకాటరాయుళ్లతో పరిచయం ఉన్న వ్యక్తులు తమ ఇళ్లు, పరిచయస్తుల ప్రాంగణాలను మినీ క్లబ్బులుగా మార్చేశారు. గరిష్టంగా పది మంది పరిచయస్తులు, వారి ద్వారా వచ్చే వారికి ‘ఆశ్రయం’ ఇస్తూ పేకాట ఆడిస్తున్నారు. ఇలాంటి వాటికి వెళ్తున్నది, బలవుతున్నది ఎక్కువగా పేద, దిగువ మధ్య తరగతి వారే. సాధారణ పోలీసులతో పాటు టాస్క్‌ఫోర్స్, ఎస్ఓటీ వంటి ప్రత్యేక బృందాలు సైతం సమాచారం అందినప్పుడల్లా దాడులు చేసి నిర్వాహకులతో పాటు పేకాటాడుతున్న వారినీ అరెస్టు చేస్తున్నాయి. మోసం’..... పేకాట ఆడుతూ చిక్కిన, శిబిరాలు నిర్వహిస్తున్న వారిపై ఇప్పటి వరకు పోలీసులు గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తున్నారు. అయితే, వారికి తేలిగ్గా బెయిల్ దొరకడంతో ప్లేసులు మార్చి మళ్లీ తమ పంథా కొనసాగి స్తున్నారు. ఇలాంటి వారికి చెక్ చెప్తేనే పేకాట శిబిరాల కు అడ్డుకట్ట వేయొచ్చని భావించిన టాస్క్‌ఫోర్స్ పోలీ సు లు పలు కేసుల్ని లోతుగా పరిశీలించారు. ఈ నేపథ్యం లోనే నిర్వాహకుల మోసం కోణం వెలుగులోకి వచ్చింది. పేకాట శిబిరాలు నిర్వహిస్తున్న వారు పేకాట రాయుళ్లను ఆకర్షిస్తున్నప్పుడు ఉచితంగా ఆడుకోమని చెప్పి.. ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేసి తీసుకుంటున్నారని, తమ వద్ద పెట్టుకుని ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తున్నారని గుర్తించారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న అధికారులు పేకాటరాయుళ్లపై నమోదు చేస్తున్న మాది రి గానే నిర్వాహకుల పైనా గేమింగ్ యాక్ట్ కింద కేసు నమో దు చేయడంతో పాటు చీటింగ్ సెక్షన్‌ను జోడిస్తున్నారు. పీడీ యాక్ట్ ప్రయోగానికి అవకాశం... ఇటీవల బంజారాహిల్స్ పరిధిలోని కమలాపురి కాలనీ లో, ఆదివారం లంగర్‌హౌస్ పరిధిలో పట్టుబడిని రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ చేర్చారు. ఈ రెండింటిలోనూ నిర్వాహకులుగా ఉన్న నాగేంద్రబాబు, అంజద్ అహ్మద్ ఖాన్‌లపై ఈ ఆరోపణలు చేశారు. గేమింగ్ యాక్ట్ కింద అరెస్టు అయిన వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించే అవకాశం లేదు. అయితే ఈ రెండు కేసుల్లోనూ చీటింగ్ సెక్షన్ నమోదుతో ఆ అవకాశం ఏర్పడింది. దీంతో వీరిపై పీడీ యాక్ట్ ప్రయోగానికి అవసరమైన సన్నాహాలను స్పెషల్ బ్రాంచ్ ఆధీనంలోని పీడీ సెల్ చేస్తోంది. ఇలాంటి కఠిన చర్యలు తీసుకుంటేనే స్థాని కంగా వెలుస్తున్న పేకాట శిబిరాలను కట్టడి చేయొచ్చని, అప్పుడే అనేక కుటుంబాలు రోడ్డున పడకుండా ఉంటాయని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు.