
సాక్షి, అమరావతి: గ్రామ స్థాయి నుంచే ఎన్నికల సంస్కరణలు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. స్థానికంగా నివాసం ఉండేలా సర్పంచ్‌లకు నిబంధనలు రూపొందించాలని అలాగే డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల నియమావళిని రూపొందించాలని తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడితే అనర్హత వేటు వేయాలని సూచించారు. అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, ఉగాది కల్లా పేదలందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు. వికేంద్రీకరణకు ప్రజలందరు మద్దతు తెలుపుతున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.