‘స్థానిక’ పోరుకు సన్నద్ధం  | Preparing For Local Elections | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ పోరుకు సన్నద్ధం 

Published Mon, Dec 2 2019 9:12 AM | Last Updated on Mon, Dec 2 2019 9:12 AM

Preparing For Local Elections - Sakshi

శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు నివేదించడంతో సందడి మొదలైంది. ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల కు ఆదేశాలు అందాయి. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తున్నారు. ప్రస్తు తం 2020 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. డిసెంబర్‌ 16 నాటికి ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రకటిస్తారు. కొత్త జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ను రూపొందిస్తారు.

జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,36,703 మంది పట్టణ ఓటర్లు కాగా 22,66,411 మంది గ్రామ ఓటర్లు. 2019 ఎన్నికల నాటికి కొత్త ఓటర్లను చేరుస్తూ రావడం వలన సుమారుగా 29 లక్షలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలలో కొత్తగా ఓటు హక్కు కోసం  దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చాలని నిర్ణయించారు. దీని వలన మరో 10 వేల వరకు ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 15 వరకు కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. వారందరినీ ఫిబ్రవరి 7న ప్రచురించనున్న తుది జాబితాలో ప్రటిస్తారు.

మునిసిపాలిటీలకు మేలోగా ఎన్నికలు... 
రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం మే నెలలోగా ఎన్నిక లు నిర్వహించాలని యోచిస్తోంది. జిల్లాలో శ్రీకా కు ళం నగరపాలకసంస్థకు తొమ్మిదేళ్లుగా, రాజాం నగ ర పంచాయతీకి 14 ఏళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోవాల్సి వ చ్చింది. అలాగే మునిసిపాలిటీల కాల వ్యవధి పూర్త య్యేనాటికి ఎన్నికలను నిర్వహించడం ద్వారా స్థాని క సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement