preparing
-
‘ఆడుదాం ఆంధ్రా’ తొలిదశ అదుర్స్
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో మునుపెన్నడూ తలపెట్టని మెగాక్రీడాటోర్నికి క్రీడాభిమానం వెల్లువెత్తుతోంది. రాష్ట్రంలోని క్రీడాకారుల్లో ప్రతిభకు ‘ఆడుదాం ఆంధ్రా’ అద్దం పడుతోంది. తొలి దశలో భాగంగా 15,004 గ్రామ/వార్డు సచివాలయాల (జీఎస్‌డబ్ల్యూఎస్) పరిధిలో క్రీడా పోటీలు దిగ్విజయంగా ముగిశాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌కు (9వ తేదీ కంటే) ఒక రోజు ముందుగానే సచివాలయాల స్థాయిలో పోటీలు విజయవంతంగా పూర్తి చేశారు. 15 ఏళ్లకు పైబడిన మహిళలు, పురుషులు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడల్లో తమ సత్తా చాటారు. ఐదు క్రీడాంశాల్లో మొత్తం 1.68 లక్షల మ్యాచ్‌లను వంద శాతం సమర్థవంతంగా నిర్వహించారు. రేపటి నుంచి మండల స్థాయి.. జనవరి 10వ తేదీ నుంచి మండలాలు, మున్సిపాల్టిలు కలిపి 753 మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో ‘పెర్ఫార్మెన్స్ టాలెంట్ హంట్’ ఆధారంగా క్రీడాకారులతో మండల స్థాయి పోటీలకు జట్లు ఎంపిక చేశారు. వీరికి 10వ తేదీ నుంచి సంక్రాంతిలోగా పోటీలు పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. అనంతరం నియోజవకర్గ స్థాయి పోటీలకు వెళ్లే వారికి ప్రాక్టీస్‌కు ఎక్కువ సమయం ఇచ్చేలా శాప్ అధికారులు వేగంగా అడుగులు వేస్తున్నారు. వాస్తవానికి ఈనెల 10 నుంచి 23 వరకు మండల, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయి, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా, ఫిబ్రవరి 6 నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలకు షెడ్యూల్ ఇచ్చారు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన 2/3 క్రీడామైదానాల్లో సకల వసతుల మధ్య పోటీ నిర్వహించనున్నారు. జీఎస్‌డబ్ల్యూఎస్ స్థాయిలో విజేతల్లో ఉత్సాహాన్ని నింపేలా స్వాగత తోరణాలు, మస్కట్ లోగోలు, కామెంట్రీ, గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది స్పోర్ట్స్ వలంటీర్లు స్కోరర్లుగా, అంపైర్లుగా సేవలందిస్తున్నారు. విజేతలకు టీషర్టులు.. ఐదు క్రీడాంశాల్లో 9,478 క్రీడా ప్రాంగణాల్లో డిసెంబర్ 26వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు జరిగి న పోటీలు వీక్షించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి క్రీడాకారులకు మద్దతుగా నిలిచారు. జీఎస్‌డబ్ల్యూఎస్ దశలో మొత్తం 3.30 లక్షల జట్లను ఎంపిక చేశారు. ఇందులో 2.08 లక్షలు పురుషులు, 1.22 లక్షల మహిళల జట్లు ఉన్నాయి. వీరితో సమానంగా 14 రోజుల పాటు ఏకంగా 34.04 లక్షలకుపైగా వీక్షకులు పోటీలను ప్రత్యక్షంగా తిలకించారు. జీఎస్‌డబ్ల్యూఎస్ పరిధిలో పోటీలు ముగించుకుని మండల స్థాయి వేదికపై ప్రతిభ చాటేందుకు వెళ్లే జట్లకు సంబంధించి 34.20 లక్షల ప్రొఫెషనల్ టీషర్టులు, టోపీలను అందజేస్తున్నారు. ఇప్పటికే 15,004 గాను 9వేలకుపైగా సచివాలయాల్లో ముగింపు వేడుకలను నిర్వహించగా మంగళవారం (నేడు) మిగిలిన వాటిల్లో గెలుపొందిన జట్లకు టీషర్టులను బహూకరించనున్నారు. అనంతరం నియోజకవర్గ స్థాయి పోటీలకు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ కిట్లను అందించనున్నారు. ఇప్పటికే వాటి తరలింపు పూర్తి చేశారు. ఆన్లైన్లోనే మ్యాచ్‌ల డ్రా ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలు తొలి దశలో సమర్థవంతంగా నిర్వహించాం. 10వ తేదీ నుంచి మండల స్థాయి పోటీలకు సన్నద్ధమవుతున్నాం. గ్రామ/వార్డు సచివాలయ స్థాయిలో పోటీలు అనంతరం తుది జట్లను ఎంపిక పూర్తి చేస్తున్నాం. మండల స్థాయిలో తలపడే జట్లకు ఆన్లైన్లోనే డ్రా నిర్వహిస్తున్నాం. ఈ దశ పోటీలను సమీపంలోని పెద్ద మైదానాలు, స్టేడియాల్లో నిర్వహించేలా ఆదేశించాం. ఇక్కడ ప్రతి క్రీడాకారుడు ఆడుదాం ఆంధ్రా జెర్సీలు, టోపీలు ధరించి పోటీల్లో పాల్గొంటారు. వీటిని అన్ని సచివాలయాలకు తరలించాం. నేటితో అక్కడ ముగింపు వేడుకలు నిర్వహించి టీషర్టులను అందజేస్తారు. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ -
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య.. ఈ ఏడాది 26వది..
జైపూర్: పోటీ పరీక్షల హబ్‌గా పేరొందిన రాజస్థాన్ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్ నుంచి రాజస్థాన్ కోటాకు వచ్చిన విద్యార్థి నీట్ పరీక్షల కోసం సొంతంగానే సన్నద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కోటాలో ఆత్మహత్య చేసుకున్నాడు. తాజా మరణంతో ఈ ఏడాది 26 కేసులు కావడం గమనార్హం. కేటాలో నీట్ సంబంధిత విద్యార్థుల మరణాలు ఇటీవల పెరిగిపోతున్నాయి. ఈ మరణాలను అరికట్టడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఏ మాత్రం తగ్గడం లేదు. విద్యార్థులు నివసించే హాస్టళ్లకు జాలీలు కట్టడం, హ్యాంగింగ్ ఫ్యాన్లను వాడటం వంటి చర్యలు చేపట్టారు. విద్యార్థుల మానసిక స్థితిని మెరుకుపరచడానికి ప్రత్యేక తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. అయినా విద్యార్థుల ఆత్మహత్యలు ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదీ చదవండి: MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత -
Konaseema: కోనసీమలో సాగుకు శ్రీకారం
సాక్షి, అమలాపురం: నైరుతి రుతుపవనాల పలకరింపు పెద్దగా లేకున్నా గోదారి నీటి లభ్యతతో ఆయకట్టు రైతులు సాగుకు ఉరకలేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ఇప్పటికే ఆలమూరు, రామచంద్రపురం, కొత్తపేట వ్యవసాయ సబ్ డివిజన్లలో జోరుగా ఆకుమడులు పడగా, ఇప్పుడు అమలాపురం, పి.గన్నవరం, ముమ్మిడివరం సబ్ డివిజన్ల పరిధిలో నారుమళ్లు వేస్తూ ముందస్తు సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో 1.79 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోందని అంచనా కాగా.. ఇప్పటివరకు పది వేల ఎకరాలకు సరిపడా నారుమళ్లు పడ్డాయి. వర్షాలు పడితే నెలాఖరు నాటికి ఇంకా ఎక్కువగా పడే అవకాశముందని జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి ‘సాక్షి’కి తెలిపారు. చదవండి: కాలం దాచుకున్న కథ ఇది! వర్షాలు పడి భూమి చల్లబడితే రైతులు సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు వేస్తే మొలక దెబ్బతింటుందని రైతులు ఆలోచిస్తున్నారు. మరోవైపు.. తెలుగుదేశం పార్టీ మద్దతున్న కోనసీమ రైతు పరిరక్షణ సమితి నాయకులు చేస్తున్న సాగుసమ్మె ప్రకటనల నేపథ్యంలో సైతం అంబాజీపేట, అమలాపురం, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో అన్నదాతలు నారుమళ్లు పోస్తుండడం విశేషం. ముంపు కారణంగా ఈ ప్రాంతంలోనే రైతులు సాగుకు దూరమని టీడీపీ అనుకూల రైతు నాయకులు ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. అటువంటి చోట రైతులు నారుమళ్లకు సిద్ధంకావడం విశేషం. అంబాజీపేట మండలం గంగలకుర్రు, పుల్లేటికుర్రులలో గడిచిన రెండ్రోజుల్లో రైతులు పెద్దఎత్తున నారుమళ్లు పోశారు. అలాగే, అల్లవరం మండలం కోడూరుపాడు, బోడసకుర్రు, అల్లవరం, ఎంట్రికోన, మొగళ్లమూరు, తుమ్మలపల్లి గ్రామాల్లో రైతులు దమ్ము చేస్తున్నారు. ఉప్పలగుప్తం మండలం మునిపల్లిలో నారుమడిలో విత్తనాలు చల్లుతున్న రైతు కోనసీమలో పంట విరామంలేదు: కలెక్టర్ ఖరీఫ్ రైతులకు సాగునీటి సరఫరా, ఎరువులు, విత్తనాలు అందించడంలో అలసత్వం వహిస్తే ఊరుకునేదిలేదని, రైతుల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని కలెక్టర్ హిమాన్షు శుక్లా హెచ్చరించారు. జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశం కలెక్టరేట్లో శుక్రవారం జరిగింది. వ్యవసాయ, సాగునీటిపారుదల శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందస్తు సాగుకు దన్నుగా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సిద్ధంచేశామన్నారు. ఈ ఏడాది డ్రైనేజీ, హెడ్‌వర్క్స్ పరిధిలో 82 పనులకు రూ.8.82 కోట్ల నిధులు వచ్చాయని, గుర్రపుడెక్క, కాలువల్లో పూడికతీత పనులకు ఈ నిధులు వినియోగిస్తామన్నారు. అల్లవరం మండలం బోడసకుర్రులో దమ్ము చేస్తున్న రైతులు ఈ పనులను తక్షణం పూర్తిచేయాలని, పనుల ప్రగతిని ప్రతీరోజూ తనకు నివేదించాలని ఆదేశించారు. ఇక కోనసీమలో పంట విరామం అనేదిలేదని, సాగు పూర్తయ్యే వరకూ అన్నదాతకు ప్రభుత్వం అండగా ఉంటుందని కలెక్టర్ భరోసా ఇచ్చారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మాట్లాడుతూ.. ఇళ్ల నుంచి, పంచాయతీల్లో డ్రెయిన్ల నుంచి వచ్చిన మురుగునీరు కాలువల్లో కలుస్తోందని వివరించారు. పంట కాలువల్లో మురుగునీరు కలవడంవల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. జేసీ ధ్యానచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి వై. ఆనందకుమారి, జిల్లా ఇరిగేషన్ అధికారి రవిబాబు, మధ్య డెల్టా బోర్డు చైర్మన్ కుడుపూడి బాబు, వ్యవసాయ సలహా మండలి సభ్యుడు గుబ్బల రమేష్ పాల్గొన్నారు. -
సగం సొంతం చేసుకుందాం
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన భారతీయ జనతా పార్టీ గత లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన స్థానాలపైనే ప్రధానంగా దృష్టిసారించింది. పార్టీ బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో బూత్ స్థాయి నుంచి బలోపేతం చేసే కార్యాచరణను సిద్ధం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన 144 లోక్‌సభ స్థానాల్లో సగమైనా గెలుచుకునేలా జూన్ ఒకటి నుంచి రంగంలోకి దిగనుంది. దీనికి సంబంధించి రెండ్రోజుల కిందటే పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ సీనియర్ నేతలు, కేంద్ర మంత్రులు, ఆఫీస్ బేరర్లకు దిశానిర్దేశం చేశారు. రోడ్ మ్యాప్ సిద్ధం ముందుగా గుర్తించిన 144 లోక్‌సభ స్థానాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై అంతర్గతంగా ఓ రోడ్‌మ్యాప్‌ను బీజేపీ సిద్ధం చేసింది. మొదటగా ఈ స్థానాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో బూత్‌ల వారీగా పార్టీ బలహీనతలకు సంబంధించిన సమాచారం సేకరిస్తారు. ఈ సమాచారం ఆధారంగా మూడు స్థాయిల్లో నేతలు బరిలోకి దిగనున్నారు. మొదటి స్థాయిలో జాతీయ స్థాయి నేతల కమిటీ ఈ 144 లోక్‌సభ స్థానాల్లో కార్యాచరణ అమలు బాధ్యతను పర్యవేక్షిస్తుంది. రెండో స్థాయిలో ఒక్కో కేంద్ర మంత్రికి రెండు లేక మూడు లోక్‌సభ స్థానాల బాధ్యతలు అప్పగిస్తారు. సోషల్ మీడియా గ్రూప్‌లు ప్రతి లోక్‌సభ పరిధిలో ఒక సోషల్ మీడియా గ్రూప్‌ను సైతం ఏర్పాటు చేస్తారు. ఈ గ్రూప్ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కులాలు, సమస్యలు, పార్టీల బలహీనతలు వంటి సమాచారాన్ని సేకరిస్తుంది. నియోజకవర్గంలో కులాల సమీకరణల ఆధారంగా పార్టీ అభ్యర్థిని ఎంపిక చేసేలా పార్టీకి సాయపడుతుంది. లోక్‌సభ సోషల్ మీడియా ఇన్చార్జి కనీసం 50వేల మందిని ఈ గ్రూపుల్లో చేర్చే బాధ్యత తీసుకోవాలి. డిసెంబర్ నాటికే ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొత్తంగా ఏడాదిన్నరలో ఈ నియోజకవర్గాల పరిధిలోని 74వేల బూత్‌లను బలోపేతం చేసి సగానికి పైగా సీట్లను గెలుచుకునే వ్యూహాలను బీజేపీ సిద్ధం చేసింది. -
ఉరితాళ్లు సిద్ధం చేయండి
పట్నా: ఏడేళ్ల సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత నిర్భయ దోషులను త్వరలో ఉరితీయనున్నారా? ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరిగిపోతున్నాయా? అవునంటున్నాయి ఇటీవలి పరిణామాలు. ఉరితాళ్లను తయారు చేయడంలో దేశంలో పేరెన్నికగన్న ఓ జైలుకు 10 తాళ్లను ఈ వారాంతంలోగా సిద్ధంగా ఉంచాలన్న ఆదేశాలు రావడం దీనికి కారణం. డిసెంబర్ 14వ తేదీకల్లా పది ఉరితాళ్లను సిద్ధంగా ఉంచాలని తమకు జైళ్లశాఖ డైరెక్టరేట్ నుంచి ఆదేశాలు వచ్చాయని, వీటిని ఎక్కడ ఉపయోగిస్తారో మాత్రం తెలియదని బక్సర్ జైలు సూపరింటెండెంట్ విజయ్ అరోరా తెలిపారు. ఒక్కో ఉరితాడు తయారీకి కనీసం మూడు రోజులు పడుతుందని, దాదాపు పెద్ద యంత్రాలేవీ వాడకుండా చేతులతోనే వీటిని తయారుచేస్తారని విజయ్ వివరించారు. పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురును ఉరితీసిన తాడు కూడా ఈ బక్సర్ జైలులోనే తయారైందని చెప్పారు. 2016–17లో పటియాలా జైలు నుంచి కూడా ఉరితాళ్లు కావాలంటూ తమకు ఆర్డర్లు వచ్చాయని, కాకపోతే వినియోగించేది ఎక్కడ అనేది మాత్రం తెలియలేదని విజయ్ చెప్పారు. చివరిసారిగా తాము సరఫరా చేసిన ఒక్కో ఉరితాడుకు రూ.1,725 రూపాయలు ఖర్చయిందని, ఇనుము, ఇత్తడి ధరల్లో మార్పులను బట్టి ఉరితాడు ధర మారుతుందని తెలిపారు. తాళ్లను పురివేసి ఉరితాడుగా మార్చేటపుడు ఈ లోహాల తీగలనూ వినియోగిస్తారు. మెడచుట్టూ ఉరి బిగుతుగా ఉండేందుకు ఉరితాడులోని ఈ లోహాల తీగలు సాయపడతాయని, దోషి శరీరం వేలాడేటప్పుడు ముడి విడిపోకుండా చేస్తాయని విజయ్ వివరించారు. ఒక్క తాడు తయారీకి ఐదారుగురు ఒక ఉరితాడు తయారుచేయడానికి సుమారు ఐదారుగురు పనివాళ్లు అవసరమవుతారని విజయ్ అరోరా తెలిపారు. ఉరితాడు తయారీ ప్రక్రియలో భాగంగా మొదటగా 152 పోగులను పెనవేసి ఒక చిన్నపాటి తాడుగా చేస్తారని విజయ్ చెప్పారు. ఇలాంటి తాళ్లను పురివేసి ఉరితాడును తయారుచేస్తారు. మొత్తంగా చూస్తే ఒక ఉరితాడు తయారీలో దాదాపు 7000 పోగులను వినియోగిస్తారని తెలిపారు. ఈసారి నిర్దేశిత సమయంలోపే ఉరితాళ్లను సిద్ధం చేయగలమని, అనుభవజ్ఞులైన సిబ్బంది తగినంత మంది ఉన్నారని చెప్పారు. తాము తయారు చేసే ఉరితాళ్లను ఎక్కువ కాలం నిల్వ ఉంచితే పాడైపోతాయని స్పష్టం చేశారు. నిర్భయ దోషులను ఈ నెల పదహారున ఉరితీయనున్నారని ఒక వర్గం మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఉరితాడు తయారీ వార్తకు ప్రాధాన్యమేర్పడింది. -
‘స్థానిక’ పోరుకు సన్నద్ధం
శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నాటికి పంచాయతీ ఎన్నికలు పూర్తి చేస్తామని హైకోర్టుకు నివేదించడంతో సందడి మొదలైంది. ఎన్నికలకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారుల కు ఆదేశాలు అందాయి. ఇందుకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఏటా జనవరి నెలలో ఓటర్ల జాబితాను ప్రకటిస్తున్నారు. ప్రస్తు తం 2020 సంవత్సరానికి సంబంధించిన ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. డిసెంబర్ 16 నాటికి ఓటర్ల జాబితా ముసాయిదాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిబ్రవరి 7న తుది జాబితా ప్రకటిస్తారు. కొత్త జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ను రూపొందిస్తారు. జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం 27,03,114 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,36,703 మంది పట్టణ ఓటర్లు కాగా 22,66,411 మంది గ్రామ ఓటర్లు. 2019 ఎన్నికల నాటికి కొత్త ఓటర్లను చేరుస్తూ రావడం వలన సుమారుగా 29 లక్షలకు ఓటర్ల సంఖ్య పెరిగింది. పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాలలో కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న వారిని చేర్చాలని నిర్ణయించారు. దీని వలన మరో 10 వేల వరకు ఓటర్ల సంఖ్య పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. జనవరి 15 వరకు కొత్త ఓటర్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తారు. వారందరినీ ఫిబ్రవరి 7న ప్రచురించనున్న తుది జాబితాలో ప్రటిస్తారు. మునిసిపాలిటీలకు మేలోగా ఎన్నికలు... రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు సైతం మే నెలలోగా ఎన్నిక లు నిర్వహించాలని యోచిస్తోంది. జిల్లాలో శ్రీకా కు ళం నగరపాలకసంస్థకు తొమ్మిదేళ్లుగా, రాజాం నగ ర పంచాయతీకి 14 ఏళ్లుగా పాలకవర్గాలు లేకపోవడంతో 14వ ఆర్థిక సంఘం నిధులు కోల్పోవాల్సి వ చ్చింది. అలాగే మునిసిపాలిటీల కాల వ్యవధి పూర్త య్యేనాటికి ఎన్నికలను నిర్వహించడం ద్వారా స్థాని క సంస్థలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇందుకు తగ్గ ఏర్పాట్లు పూర్తిచేసి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించింది. -
దక్షిణ కొరియాపై దాడికి ఆదేశం!
సియోల్: ప్రపంచదేశాల ఆంక్షలను లెక్క చేయకుండా హైడ్రోజన్ బాంబు ప్రయోగం నిర్వహించిన ఉత్తర కొరియా అదే దూకుడును ప్రదర్శిస్తోంది. దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా దక్షిణ కొరియాపై దాడి చేయడానికి సన్నద్ధం కావాలని అధికారులకు ఆదేశాలిచ్చాడన్న వార్తలు ఇప్పుడు కొరియన్ ద్వీపకల్పంలో కలకలం సృష్టిస్తున్నాయి. కిమ్ జోన్ ఉన్ ఆదేశాలను అమలు చేయడానికి అతని స్పై ఏజెన్సీ ప్రయత్నాలను ప్రారంభించిందని దక్షిణ కొరియాకు చెందిన నేషనల్ ఇంటలిజెన్స్ సర్వీస్ నివేదిక తెలిపింది. సైబర్ దాడులతో పాటు ఇతర దాడులు నిర్వహించడానికి సన్నాహకాలు చేస్తున్నారని ఆ నివేదికలో వెల్లడించారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న కార్యకర్తలు, అధికారులపై దాడులు జరపడానికి అవకాశాలున్నాయని దక్షిణ కొరియా గూఢచార ఏజెన్సీ తెలిపింది. అమెరికా నాలుగు అత్యాధునిక ఫైటర్ జెట్ విమానాలను దక్షిణ కొరియాకు పంపిన ఒక రోజు అనంతరం ఈ వార్తలు రావడం గమనార్హం. గతంలోనూ దక్షిణ కొరియాపై ఉత్తరకొరియా దాడికి దిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అగ్రారాజ్య అండదండలున్న దక్షిణ కొరియాపై ప్రస్తుత పరిస్థితుల్లో ఉత్తర కొరియా దాడులకు పాల్పడే సాహసం చేయబోదని విశ్లేషకులు చెబుతున్నారు. -
చిన్న పార్టీలకు మమత స్నేహ హస్తం
-
ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్న పార్టీలు
-
హొంశాఖ నివేదిక రూపొందిస్తోంది - చిదంబరం
-
ఉభయసభల్లోనూ సీమాంధ్ర ఎంపీల ఆందోళనలు