కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెమీఫైనల్‌గా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)ను కైవసం చేసుకుంది.
మొత్తం 144 వార్డులకు గాను 114 వార్డుల్లో జెండా పాతింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 91 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా 69 సంస్థలను తృణమూల్ గెలుచుకుంది. వామపక్షాలు 5, కాంగ్రెస్ 5 మునిసిపాలిటీల్లో పాగావేయగా, బీజేపీ ఒక్క మునిసిపాలిటీలోనూ జెండా పాతకపోవడం గమనార్హం. 12 మునిసిపాలిటీల్లో ఎవరికీ ఆధిక్యంరాలేదు.
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ జయభేరీ
Published Wed, Apr 29 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 1:02 AM
Advertisement
Advertisement