Jayabheri
-
జయభేరి సంస్థ మమ్మల్ని మోసం చేసింది
-
నిండా ముంచిన జయభేరి సంస్థ..
-
సేల్‌డీడ్‌లో చెప్పినవీ చేయరా?
సాక్షి, న్యూఢిల్లీ: సేల్‌డీడ్‌లో చెప్పిన అంశాలు బిల్డర్లు తప్పకుండా పాటించాల్సిందేనన్న హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. తమపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కొట్టేయాలంటూ జయభేరి నిర్మాణసంస్థకు చెందిన దుగ్గిరాల కిషోర్, టీడీపీ మాజీ ఎంపీ మురళీమోహన్, మాగంటి రామ్మోహన్ దాఖలుచేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాతో కూడిన ధర్మాసనం కొట్టేసింది. సేల్‌డీడ్‌లో రాసింది ఎలా తగ్గిస్తారని, మునిసిపాలిటీకి వదిలేసింది ఎలా అమ్ముకుంటారని ప్రశ్నించింది. ఇదీ నేపథ్యం.. జయభేరి సిలికాన్ కంట్రీ (జేఎస్సీ)లోని బీటా కాంప్లెక్స్ నివాసి బండ్రెడ్డి మధుసూదన్ 2003లో కారు పార్కింగ్ సహా 3,010 చదరపు అడుగుల ఫ్లాట్ కొనుగోలు చేశారు. సేల్ డీడ్‌లో జయభేరి ప్రాపర్టీస్ పలు అంశాలను ప్రస్తావించింది. ‘ప్రధాన రహదారిని ఆనుకుని 7,322 చదరపు అడుగుల ఓపెన్ ప్లాట్ ఉంది. ఈ స్థలాన్ని 2005లో జేఎస్టీ రియాలిటీ లిమిటెడ్ గతంలో డీహెచ్ఎఫ్ఎల్కు విక్రయించింది. 2007లో జయభేరి సిలికాన్ టవర్స్ పేరిట భనవం నిర్మించారు. జేఎస్సీలో 18,521 చదరపు అడుగుల్లో ఆల్ఫా, బీటా, గామా టవర్లు నిర్మించారు. ప్లాటు ఉత్తరం వైపు 3,197 చదరపు అడుగుల క్లబ్ హౌస్ ఉంది. జేఎస్సీ ఫ్లాట్ యజమానులకు క్లబ్‌హౌస్‌లో ఉచిత ప్రవేశం. ఈ లేఔట్ 1999 నాటిది’ అని సేల్‌డీడ్‌లో పేర్కొంది. ఈ సేల్డీడ్లోని పలు అంశాలు క్షేత్రస్థాయిలో లేవని మధుసూదన్ 2008లో గుర్తించారు. ‘7,322 చదరపు అడుగుల ఓపెన్ ప్లాటు జయబేరి సిలికాన్ టవర్స్ (జేఎస్టీ) ఆధీనంలోకి వచ్చింది. సేల్‌డీడ్‌లో డ్రైవ్వే 24 అడుగులని పేర్కొనగా 16 అడుగులే ఉంది. మూడు టవర్ల మొత్తం ఏరియా 16,568.045 చదరపు అడుగులే ఉంది. జయభేరి సిలికాన్ కంట్రీ యజమానులకు చెందిన సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు (ఎస్టీపీ) జయభేరి సిలికాన్ టవర్స్ పేరిట బదిలీ అయింది. అపార్ట్మెంట్ యజమానులకు వినియోగహక్కులు మాత్రమే మిగిలాయి’ అని పేర్కొంటూ మధుసూదన్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో క్రిమినల్ కేసు పెట్టారు. పోలీసులు దీనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధుసూదన్ ట్రయల్ కోర్టు, వినియోగదారుల ఫోరం, హైదరాబాద్ మెట్రో పాలిటన్ అథారిటీలను ఆశ్రయించారు. ట్రయల్ కోర్టు మురళీమోహన్‌కు అనుకూలంగా డిశ్చార్జి పిటిషన్‌ను అనుమతించింది. దీంతో క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ మధుసూదన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. సివిల్ అంశాలతోపాటు క్రిమినల్ చార్జ్‌లు కూడా నమోదు చేయాలంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దీంతో మురళీమోహన్ తదితరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
మురళీమోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
సాక్షి, న్యూఢిల్లీ: సినీ నటుడు, టీడీపీ నేత మురళీ మోహన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురయ్యింది. హెచ్ఎండీఏ నిబంధనలను అతిక్రమించిన జయభేరి కన్స్ట్రక్షన్స్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జయభేరీ కన్స్ట్రక్షన్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసిన ఫ్లాట్ విషయంలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఓ కొనుగోలుదారుడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ నేపథ్యంలో కొనుగోలుదారుడికి అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. -
నేడు ప్రతిభాశాస్త్రి శతజయంతి
తెలుగు సినిమాల నిర్మాణ కార్యక్రమానికి ఒక క్రమబద్ధమైన రూపునిచ్చిన వ్యక్తిగా ఖ్యాతిగడించిన టి.వి.యస్.శాస్త్రి శత జయంతి నేడు. జూన్ 8, 1920న కృష్ణాజిల్లా గొడవర్రులో జన్మించిన ఆయన 1940లో కొందరు మిత్రులతో కలసి కె.యస్.ప్రకాశరావు, జి.వరలక్ష్మి హీరోహీరోయిన్లుగా సినిమా తీద్దామని ముంబాయి Ðð ళ్లారు. ఒక పాట రికార్డింగ్‌తో ఆ సినిమా ఆగిపోవడంతో అక్కడే నాటి హిందీ నటుడు మజర్‌ఖాన్ సినిమా కంపెనీలో జనరల్ మేనేజర్‌గా చేరారు. కె.యస్.ప్రకాశరావు కోరిక మేరకు ‘ద్రోహి’ చిత్రనిర్మాణ వ్యవహారాలు చూడటానికి చెన్నై వచ్చారు శాస్త్రి. ఆ తర్వాత ఘంటసాల బలరామయ్యగారి ప్రతిభా సంస్థలో చేరారు. దాంతో ఆయన ‘ప్రతిభా’శాస్త్రిగా పాపులర్ అయ్యారు. అక్కడ ఉన్నప్పుడే ఆయనకు అక్కినేని నాగేశ్వరరావు సన్నిహిత మిత్రులయ్యారు. 1959లో వాసిరెడ్డి నారాయణరావుతో కలసి శాస్త్రి ‘జయభేరి’ చిత్రం నిర్మించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన హిందీ చిత్రాలకు అసోసియేట్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారాయన. 2007 డిసెంబరు 20న ప్రతిభా శాస్త్రి మృతి చెందారు. -
సర్వే గుట్టు.. లాడ్జీలో రట్టు!
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న వైఎస్సార్సీపీ ఓట్ల తొలగింపు వ్యవహారం జిల్లాలోనూ బట్టబయలైంది. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కనుసన్నల్లో సర్వే బృందం పనిచేసినట్లు తెలుస్తోంది. చౌదరికి అత్యంత సన్నిహితుడైన టీడీపీ నేత ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన ‘వైభవ్’ లాడ్జి కేంద్రంగా ఈ వ్యవహారం సాగింది. ‘సాక్షి’ వరుస కథనాల నేపథ్యంలో సర్వే బృందాన్ని లాడ్జీ ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తుండగా.. ‘సాక్షి’ ప్రతినిధులు అక్కడికి చేరుకోవడంతో గుట్టు రట్టయింది. టీడీపీ ఎంపీ మురళీమోహన్‌కు చెందిన జయభేరి సంస్థలో పనిచేస్తున్న విజయవాడ యువకులు సర్వే కోసం అనంతపురంలో తిష్టవేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ అడ్డడారులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, అనంతపురం: గత ఎన్నికలతో పోలిస్తే టీడీపీ బలహీనపడిన నియోజకవర్గాల్లో ఎలాగైనా గెలవాలని టీడీపీ నేతలు వక్ర మార్గాలను ఎంచుకున్నారు. నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, తద్వారా వీలైనన్ని ఓట్లు తొలగిస్తే సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందచ్చనే కుటిల ఆలోచనకు తెర తీశారు. ఇందుకోసం పక్కా ప్రణాళిక రచించారు. మొదట సర్వే పేరుతో ఇంటింటికీ వెళ్లి ఓటరు కార్డులను సేకరించారు. వీటి ఫొటోలను ట్యాబ్‌లు, సెల్ఫోన్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఓటరు కార్డు అనేది ఎన్నికల కమిషన్ జారీ చేసిన గుర్తింపుకార్డు. ఈ సమాచారాన్ని వ్యక్తి అనుమతి లేకుండా రాజకీయ అవసరాలకు వాడుకోకూడదు. అయితే ఓటరు కార్డు ఫొటోలు సేకరించిన సర్వే బృందం ఈ వివరాలన్నీ టీడీపీకి చెందిన వెబ్సైట్లోకి చేరవేశారు. ఓటర్ ఐడీ కార్డులో ఏ ఫొటో ఉందో, అదే ఫొటోను కాపీ చేసి టీడీపీ సభ్యత్వ నమోదు కార్డులో ముద్రించారు. అంటే ఓటర్ ఐడీలోని సమాచారం టీడీపీ నేతలు పూర్తిగా సేకరించారనేందుకు ఇంతకంటే సాక్ష్యాం మరొకటి ఉండదు. దీన్నిబట్టి ఓటరు కార్డుదారుల ప్రమేయం లేకుండానే వారి పేరుతో టీడీపీ గుర్తింపు కార్డులు జారీ అయ్యాయనేది స్పష్టమవుతోంది. ఇది టీడీపీ చేసిన మొదటి తప్పు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్డు, ఓటరు ఐడీ కార్డులో ఒకే ఫొటో ఉన్న దృశ్యం ఓటర్ ఐడీ సమాచారంతోనే ఫారం–7 దరఖాస్తుల అప్లోడ్ టీడీపీ గుర్తింపుకార్డులోని ఫొటో, ఓటర్ ఐడీ ఫొటో చూస్తే టీడీపీ సభ్యత్వకార్డులు ఉన్న వారి సమాచారంతో పాటు, సభ్యత్వ కార్డులు లేని ఓటర్ల సమాచారం కూడా సేకరించారని అర్థమవుతోంది. ఈ సమాచారం ఆధారంగా వైఎస్సార్సీపీ నేతల ఓట్లు తొలగింపునకు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎవరి ఓటు వారే తొలగించుకునేలా, భార్య ఓటు భర్త, వైఎస్సార్సీపీ కార్యకర్త ఓటు ఆ పార్టీ నాయకుడు తొలగింపునకు దరఖాస్తు చేసినట్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. చివరకు అనంతపురంలోని 84వ పోలింగ్ బూత్ పరిధిలోని బీఎల్ఓ లక్ష్మి ఓటును కూడా తొలగించాలని దరఖాస్తు చేశారంటే ఈ దరఖాస్తుల్లోని డొల్లతనం తేటతెల్లమవుతోంది. అనంతపురంతో పాటు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఇదే తరహాలో తప్పుడు సమాచారంతో వైఎస్సార్సీపీ ఓట్లు తొలగించడమే లక్ష్యంగా దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఇందుకు సంబంధించిన సర్వే బృందాలను వైఎస్సార్సీపీ నేతలు ఎక్కడికక్కడ అడ్డుకుని పోలీసుల దృష్టికి తీసుకెళ్తే పోలీసులు తిరిగి వైఎస్సార్సీపీ నేతలపైనే కేసులు నమోదు చేశారు. అయితే సర్వే బృందాలతో తమకేమీ సంబంధం లేదని ఇన్నాళ్లూ టీడీపీ నేతలు బుకాయించారు. తాజా ఉదంతంతో ‘సర్వే బృందాలు’ టీడీపీ కనుసన్నల్లో పనిచేశాయనే విషయం స్పష్టమైంది. ‘వైభవ్’ లాడ్జీలో 20 రోజులుగా తిష్ట అనంతపురంలో సర్వే చేసేందుకు విజయవాడ నుంచి 15 మంది యువకులను ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి రప్పించినట్లు తెలుస్తోంది. వీరిని తనకు సన్నిహితుడైన ఎస్ఆర్ నాగభూషణానికి చెందిన బళ్లారిరోడ్లోని ‘వైభవ్’ లాడ్జీలో ఉంచారు. 206, 208తో పాటు మరో నాలుగు గదుల్లో వీరు ఉన్నట్లు తెలుస్తోంది. వీరంతా నగరంలో సర్వే చేసి వ్యక్తిగత సమాచారం సేకరించడంతో పాటు ఇదివరకే ఉన్న ఓటర్ ఐడీ కార్డు సమాచారం ద్వారా ‘ఫారం–7’ దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సర్వే బృందానికి చంద్రబాబు నాయుడు(సీఎం కాదు) అనే వ్యక్తి నాయకత్వం వహించినట్లు తెలుస్తోంది. ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితం కావడం, రాష్ట్రవ్యాప్తంగా సర్వేకు సంబంధించి దుమారం రేగడం, తెలంగాణలో పోలీసులు కేసు నమోదు చేయడంతో సర్వే బృందాలను విజయవాడకు వెళ్లిపోవాలని ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది. ఈ సమాచారం తెలిసి ‘సాక్షి’ బృందం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు లాడ్జీకి వెళ్లింది. 206 గదిలోకి వెళితే ఇద్దరు యువకులు ఉన్నారు. వీరి పేర్లను ఆరా తీస్తే చెప్పలేదు. అయితే తమది విజయవాడ అని, జయభేరి కంపెనీలో పనిచేస్తున్నామని చెప్పారు. 10 రోజులుగా ఇక్కడే ఉంటున్నామన్నారు. ‘జయభేరి’ అనేది ఎంపీ మురళీ మోహన్‌కు సంబంధించిన కంపెనీ. లగేజీ సర్దుకుని తిరుగు ప్రయాణం అవడానికి సిద్ధంగా ఉన్నారు. 208 గది వద్దకు వెళితే లాక్ చేశారు. వీరు ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిసింది. -
ముంబై అమ్మాయి ‘డబుల్’ సంచలనం
ముంబై: పదహారేళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ సంచలన బ్యాటింగ్‌తో అజేయ డబుల్ సెంచరీ సాధించింది. బీసీసీఐ మహిళల అండర్–19 వెస్ట్‌జోన్ వన్డే టోర్నీలో భాగంగా సౌరాష్ట్రతో ఔరంగాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబై 285 పరుగులతో జయభేరి మోగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై తరఫున జెమీమా (163 బంతుల్లో 202 నాటౌట్; 21 ఫోర్లు) చెలరేగడంతో ముంబై 50 ఓవర్లలో 2 వికెట్లకు 347 పరుగుల భారీ స్కోరు చేసింది. తర్వాత సౌరాష్ట్ర 62 పరుగులకే కుప్పకూలింది. 13 ఏళ్లకే అండర్–19 జట్టులోకి వచ్చిన జెమీమా ప్రస్తుతం 16 ఏళ్లకే జట్టు కెప్టెన్ అయ్యింది. ఈ టోర్నీలో ఆమెకిది రెండో సెంచరీ కావడం విశేషం. 83 బంతుల్లో సెంచరీని, 162 బంతుల్లో ద్విశతకాన్ని పూర్తిచేసింది. అన్నట్లు ఆమెది హాకీలోనూ అందెవేసిన చేయి! ముంబై అండర్–17 హాకీ జట్టు తరఫున మ్యాచ్‌లు కూడా ఆడుతుంది. -
స్థానిక ఎన్నికల్లో తృణమూల్ జయభేరీ
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సెమీఫైనల్‌గా భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కోల్‌కతా మునిసిపల్ కార్పొరేషన్ (కేఎంసీ)ను కైవసం చేసుకుంది. మొత్తం 144 వార్డులకు గాను 114 వార్డుల్లో జెండా పాతింది. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా 91 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగ్గా 69 సంస్థలను తృణమూల్ గెలుచుకుంది. వామపక్షాలు 5, కాంగ్రెస్ 5 మునిసిపాలిటీల్లో పాగావేయగా, బీజేపీ ఒక్క మునిసిపాలిటీలోనూ జెండా పాతకపోవడం గమనార్హం. 12 మునిసిపాలిటీల్లో ఎవరికీ ఆధిక్యంరాలేదు. -
సువార్త జయభేరి