
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని గతంలో హైకోర్టు చెప్పిందని.. ఎస్‌ఈసీకి సర్వాధికారాలు ఉండవని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి తెలిపారు. గతంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సరికాదన్నారు. నిమ్మగడ్డ కావాలనే ప్రతిష్టంభన వాతావరణం తీసుకొస్తున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ వాస్తవిక దృక్పథాన్ని అవలంభించాలన్నారు. ఎస్‌ఈసీ సంఘర్షణలతో కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని తెలకపల్లి రవి సూచించారు.(చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్)