telakapalli ravi
-
సెప్టెంబర్ 17.. ప్రాధాన్యత ఏమిటి?
‘తారీఖులూ దస్తావేజులూ ఇవి కావోయ్ చరిత్ర సారం’ అని శ్రీశ్రీ అన్నాడు గానీ అటు సమయం ఇటు సారాంశం కూడా మారిపోతుంటాయి. సెప్టెంబర్ 17 ఇందుకో ఉదాహరణ. ఆ తేదీ ప్రాధాన్యత ఏమిటి? ఏ కోణంలో ఏ పేరుతో జరపాలి అన్నది ఒక కొలిక్కి రావడానికి దాదాపు 75 ఏళ్లు పట్టింది. ఇప్పుడు కూడా కేంద్రం దీన్ని విమోచన దినం అంటే, రాష్ట్రం సమైక్యతా దినోత్సవం అంటున్నది. తెలంగాణ సాయుధ పోరాట వార్షి కోత్సవాలు ఇంతకాలంగా జరుపుతూనే ఉన్న కమ్యూనిస్టులు తదితరులకు వేరే అభిప్రాయాలున్నా కూడా ఆ మహత్తర పోరాట వారసత్వం గుర్తుచేసుకోవడానికి ఏదో ఒక సందర్భం ఉందని సంతోషిస్తున్నారు. ముస్లిం రాజు నిజాం నుంచి విమోచన కనుక విమోచన దినోత్సవాన్ని గట్టిగా జరపాలని బీజేపీ వారంటుంటే, సంస్థానం దేశంలో విలీనమైంది గనక సమైక్యతా దినోత్సవమే సరైందని టీఆర్ఎస్ చెబుతున్నది. విమోచన ఎవరి నుంచి అనేది మరో ప్రశ్న. నిరంకుశ పాలకుల అండతో సాగిన వెట్టిచాకిరీ నుంచి, దోపిడీ పీడనల నుంచి విముక్తి అని కమ్యూనిస్టులంటారు. ‘బానిసోన్ని దొరా’ అనే వాడితో బందూకు పట్టించినంతగా మార్పు తెచ్చిన కమ్యూనిస్టుల దగ్గర ఏ ఇంద్రజాలమున్నదో అని సురవరం ప్రతాపరెడ్డి ఆశ్చర్యపోయారు. ‘విలేఖించనిండు నన్ను తెలంగాణ వీరగాథ’ అని గానం చేశారు హరీంద్రనాథ్ ఛటోపా ధ్యాయ. 1947 ఆగస్టు 15 నాటికి తెలంగాణ సాయుధ పోరాటం సాగుతూనే ఉంది. ఆ పోరాటం తాకిడికి హడలిపోయిన కేంద్ర కాంగ్రెస్ పాలకులు పోలీసు చర్య పేరుతో సైనిక చర్య జరి పారు. నిరంకుశ పాలకుడిని రాజ్‌ప్రముఖ్‌ను చేసి, హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేసుకుని, పోరాడే ప్రజలపై తుపాకులు ఎక్కుపెట్టారు. విప్లవ పోరాటం ముందు నిజాం దాదాపు చేతులెత్తేసిన పరిస్థితిలో తిరిగి ఆయనకు ఊపిరి పోశారు. నిజాంకు బ్రిటిషర్లతో సైనిక ఒప్పందం గనక, సొంత సైనిక బలం లేదు గనక అనధికార సైన్యంగా రజాకార్లు ప్రజలపై దాడులు, హత్యాకాండ సాగించారు. వాళ్లను అణచి వేయడానికి వచ్చామంటూనే సైన్యం కమ్యూనిస్టులపై మారణకాండ సాగించింది. ‘మూడువేల మృతవీర సమాధుల పుణ్యక్షేత్రమీ నల్లగొండరా’ అనే పాట చాలు దాని తీవ్రత తెలియడానికి. సర్దార్ పటేల్ హోంమంత్రిగా దీనికి ఆధ్వర్యం వహించారు. మీరు రాజీకి రాకపోతే కమ్యూనిస్టుల రాజ్యం వచ్చేస్తుందని బెదిరించి దారికి తెచ్చుకున్నారు. ఆ విలీనం వాస్తవంగా జరిగిందే గనక వివాదం లేదు. పోరాటంపై దాడి చేశారు గనక విద్రోహం అని అన్నా ఇప్పటి సందర్భం వేరు. పోరాట విరమణే విద్రోహం అనే వారిది సైద్ధాంతిక చర్చ తప్ప ఉత్సవాలతో నిమిత్తం లేదు. స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా సంస్థానాధీశులపైనా పోరాడాలని కమ్యూనిస్టులు తీసుకున్న విధానాన్ని కాంగ్రెస్ ఆమోదించలేదు. నాటి ఉమ్మడి మద్రాసులోని కేరళ ప్రాంతం; బెంగాల్, పంజాబ్, త్రిపుర ఇలా గొప్ప పోరాటాలే నడిచాయి. నైజాంలలో స్టేట్ కాంగ్రెస్ ఏర్పడటానికి చాలా కాలం పట్టింది. ‘ఆంధ్ర మహాసభ’ మాత్రమే అప్పటికి చెప్పు కోదగిన సంస్థ. నాటి హేమాహేమీలందరూ ఉన్న సంస్థ. మహజర్లు ఇవ్వడం వరకే పరిమితమైన ఆ సంస్థను సమరశీల పథం పట్టించిన కమ్యూనిస్టులు ప్రజలకు నాయకత్వం వహించి నిరంకుశ పాలకుడిపై, గ్రామీణ పెత్తందార్లపై పోరాడారు. భాషా సాంస్కృతిక స్వేచ్ఛ ఈ పోరాటంలో అంతర్భాగం. 3,000 గ్రామాల విముక్తి, పదిలక్షల ఎకరాల పంపిణీ, వెట్టిచాకిరీ రద్దు, దున్నేవాడికి భూమి నినాదం, బానిసలుగా బతుకుతున్న ప్రజల ఆత్మగౌరవం, స్వతంత్ర జీవనం... ప్రధాన విజయాలు. ఇందుకు అర్పించిన ప్రాణాలు నాలుగు వేల పైన. అత్యాచారాలకు, అమానుషాలకు గురైన వారి సంఖ్యలు మరింత భయంకరంగా ఉంటాయి. ఆ పోరాటాన్ని గుర్తించడానికి కాంగ్రెస్ పాలకులకు దాదాపు పాతికేళ్లు పట్టింది. కేసీఆర్‌కు ఎనిమిదేళ్లుపట్టింది. ఇక బీజేపీ మతతత్వ కోణంలో ముస్లిం రాజుపై హిందువుల తిరుగు బాటుగా వక్రీకరించి 1998 నుంచి విమోచన దినం జరుపుతున్నది. అప్పుడు వారి అభినవ సర్దార్ పటేల్ అద్వానీ. ఇప్పుడు అమిత్‌షా. పటేల్ మాత్రమే తెలంగాణ విమోచన సాధించినట్టు చెబుతూ ఆయన సైన్యాలు తర్వాత సాగించిన దారుణకాండను దాటేయడం మరో రాజకీయం. తెలంగాణ ఏర్పడింది గనక ఇప్పటి రాజకీయాలు గతానికి పులమడం అనవసరం. (క్లిక్ చేయండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?) తెలంగాణ యోధులతో రెడ్డి హాస్టల్లో ఉండి పోరా టానికి తొలుత రంగం సిద్ధం చేసింది చండ్ర రాజేశ్వరరావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, భీమిరెడ్డి వంటివారు ముందు నిలవకపోతే పోరాటం సాధ్యమయ్యేది కాదని సుందరయ్య స్పష్టంగా రాశారు. ఈ పోరాటం తెలుగువారం దరిదీ. మహిళలు, అణగారిన వర్గాలది అతి కీలక పాత్ర. వారు ఎగరేసింది ఎర్రజండానే. ఇప్పుడు కమ్యూనిస్టులను ఎవరూ పట్టించుకోరని కంచ ఐలయ్య వంటివారు అనొచ్చు గానీ (సాక్షి, సెప్టెంబరు 12) దాచేస్తే దాగని సత్యం ఎర్రెర్రని సూర్యకాంతిలా పలకరిస్తూనే ఉంటుంది. నాటి రజాకార్ నాయకుడు ఖాసీం రజ్వీ స్థాపించిన పార్టీ కూడా సమైక్య ఉత్సవాలు జరపాలని కోరడం ఇందుకో నిదర్శనం. స్వాతంత్య్ర వజ్రోత్సవాలతో పాటు సమైక్యతా ఉత్సవంగా జరపడం నేటి పరిస్థితులలో ఆహ్వానించదగింది. తెలంగాణ వారసత్వంలో భాగంగా ఈ పోరాట ఉత్స వాలు జరపాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మొదటి ఎడిటర్స్ మీట్లోనే నేను అడిగాను. గ్లోరిఫై చేయాలి అని ఆయనన్నారు. అంతకు అయిదారేళ్ల ముందు ఒక టీవీ చర్చలో నిజాం పాత్ర గురించి కూడా మా మధ్య వివాదం జరిగింది. ఆ మాట ఆయన ఇప్పటికీ గుర్తు చేస్తుంటారు. గోదావరి ప్రజలు పూజించే కాటన్‌తో నిజాంను ఆయన పోల్చారు. ప్రజలు కాటన్‌ను తప్ప విక్టోరియా మహారాణిని పూజిం చడంలేదని నేను చెప్పాను. ఏదైనా అది చరిత్ర. నిజాం వ్యక్తిగత దూషణ వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. వీర తెలంగాణ విప్లవ స్ఫూర్తిని విభజన రాజకీయాలకు వాడుకోవడం తగని పని. - తెలకపల్లి రవి సీనియర్ జర్నలిస్ట్ -
ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవు: తెలకపల్లి రవి
సాక్షి, అమరావతి: కరోనా నేపథ్యంలో ఎన్నికలు సరికాదని గతంలో హైకోర్టు చెప్పిందని.. ఎస్ఈసీకి సర్వాధికారాలు ఉండవని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి తెలిపారు. గతంలో ప్రభుత్వానికి చెప్పకుండా ఎన్నికలు వాయిదా వేయడం, ఇప్పుడు ప్రభుత్వానికి చెప్పకుండా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా సరికాదన్నారు. నిమ్మగడ్డ కావాలనే ప్రతిష్టంభన వాతావరణం తీసుకొస్తున్నారన్నారు. నిమ్మగడ్డ రమేష్ వాస్తవిక దృక్పథాన్ని అవలంభించాలన్నారు. ఎస్ఈసీ సంఘర్షణలతో కాకుండా సమన్వయంతో ముందుకెళ్లాలని తెలకపల్లి రవి సూచించారు.(చదవండి: చంద్రబాబు ఓ మానసిక రోగి: జోగి రమేష్) -
'పదవుల్లేక వారికి మతి భ్రమించినట్టయింది'
సాక్షి, అమరావతి : కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం శనివారం టీడీపీ నాయకులు అయ్యన్నపాత్రుడు, బుద్దా వెంకన్నలపై మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'అయ్యన్నపాత్రుడుకి మతిభ్రమించింది.. బుద్దా వెంకన్నకు బుద్ధిలేదు. అడ్డదారిలో రాజకీయాలు చేసే వ్యక్తి ట్విటర్ లోకేష్.. ప్రత్యక్ష రాజకీయాలకు మాత్రం పనికిరాడు. కార్మిక శాఖలో మందుల బిల్లు రావాలని ఏజెన్సీ అడిగితే నేను విచారణకు ఆదేశించా. విచారణలో గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు 2014-18 మధ్య అవినీతికి పాల్పడ్డారని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలోనే అవినీతికి పాల్పడిన అచ్చెన్నాయుడును అరెస్టు చేసి విచారణ జరుపుతున్నాం.(చదవండి : ఆ బెంజ్ కారు నా కుమారుడిది కాదు: మంత్రి) అయితే తెలకపల్లి కార్తిక్ 2019 డిసెంబర్లోనే బెంజ్ కారును కొనుగోలు చేశాడు. అయితే కారుకు సంబంధించిన కంతులు కట్టకపోవడంతో ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ బెంజ్ కారును సీజ్ చేసింది. 2020 జూన్‌లో ఈఎస్ఐ కుంభకోణం కింద కార్తిక్‌పై కేసు నమోదయింది. కారు తీసుకొని ఉంటే.. ఈఎస్ఐ స్కాంలో A14 ముద్దాయిగా ఉన్న కార్తిక్‌ను కేసులో నేనేందుకు పేరు తొలగించలేదో చెప్పాలి. టీడీపీ నాయకులు పదవులు లేక మతిభ్రమిచ్చింది.నేను భూమి కొనుగోలులో అన్ని పేపర్లు కరెక్టుగా ఉన్నందుకే కొన్నా,, ఎక్కడా భూకజ్జాకి పాల్పడలేదు. 'అంటూ చురకలంటించారు. -
తీవ్రమైన, అసాధారణ ఉత్తర్వులు ఇవి..
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ అడ్వకేట్ జనరల్‌పై ఏసీబీ పెట్టిన ఎఫ్ఐఆర్ గురించి వార్తలు రాయొద్దని హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం తీవ్రమైన, అసాధారణ విషయమని సీనియర్ జర్నలిస్టు తెలకపల్లి రవి అన్నారు. అమరావతిలో భూ లావాదేవీల్లో అక్రమాలు జరిగిన మాట వాస్తవమని, అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు భూములు కొంటే తప్పేముందని శాసన సభలో వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశారు. అక్రమాలు జరిగి ఉంటే దోషుల్ని శిక్షించాల్సిన పని న్యాయ వ్యవస్థదేనని పేర్కొన్నారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో ఆందోళన) అదే విధంగా.. ప్రజా జీవితానికి భంగం కలిగే అంశాలకే కోర్టులు అసాధారణ ఉత్తర్వులు ఇస్తాయని, కానీ ఇలా భావ ప్రకటనను హరించే విధంగా వ్యవహరించడం దేనికి సంకేతమని రవి ప్రశ్నించారు. అసలు ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వటానికి చెప్పిన కారణాలు కూడా సహేతుకం కాదని, వీటికి సంబంధించి సుప్రీంకోర్టులోనైనా సరైన మార్గదర్శకాలు లభిస్తాయని ఆశిద్దామని తెలకపల్లి రవి పేర్కొన్నారు. న్యాయస్థానాలు మీడియా స్వేచ్ఛను హరించడం సరికాదని సీనియర్ జర్నలిస్ట్ బండారు శ్రీనివాసరావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా చేయటం దారుణమన్నారు. (చదవండి: హైకోర్టు ఉత్తర్వులు : కేంద్రం జోక్యం చేసుకోవాలి) -
ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్
సాక్షి, హైదరాబాద్: చరిత్ర రాసేవారు లేకపోతే చరిత్ర కనుమరుగైపోతుందని, పుస్తకాల్లో నిక్షిప్తం చేయకపోతే తక్కువ స్థాయి వ్యక్తులు రాసిందే చరిత్రగా చలామణీ అవుతుందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ప్రపంచంలో ఎవరినైనా ఎదిరించొచ్చుగానీ లక్షల మెదళ్లను కదిలించగలిగే శక్తి ఉన్న కవులు, రచయితలను ఎదుర్కో వడం చాలా కష్టమన్నారు. అలాంటి వ్యక్తులపట్ల అపారమైన గౌరవం ఉందని, అందుకే సినిమా వేడుకల్లో తల ఎగరేయకుండా వాళ్ల ముందు తలదించుకొని కూర్చుంటానని అన్నారు. ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప ఒక్క వాక్యం కూడా రాయలేమని ఒక ఇంగ్లీష్ కవి చెప్పిన మాట ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి... అలాంటిది కనిపించని రక్తాన్ని చిందించి లక్షల పేజీలు రాసిన కవులు, రచయితలకు జోహార్లన్నారు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, పత్రికా సంపాదకుడు, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిన ‘మన సినిమాలు, అనుభవాలు - చరిత్ర – పరిణామం’పుస్తకాన్ని పవన్ కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు తనికెళ్ళ భరణి, పరుచూరి గోపాలకృష్ణ, సుద్దాల అశోక్ తేజ, రావి కొండల రావు, సినీ పాత్రికేయుడు డా.రెంటాల జయదేవ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘తెలుగు పరిశ్రమలో చాలా మంది గొప్ప స్టోరీ టెల్లర్స్ ఉన్నారు. బాహుబలి వంటి సినిమాలు వచ్చినాగానీ, ఇంకా అద్భుతమైన సినిమాలు తీయగల సాహిత్యం మన దగ్గర చాలా ఉందని చాలా మందికి తెలియదు. అదిగానీ మనం అర్ధం చేసుకోగలిగితే చాలా గొప్ప సినిమాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు తీయగలం. అలా తీయాలంటే ఇలాంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. జానీ సినిమా ఎందుకు ఆడలేదో నాకే బాగా తెలుసు. కమర్షియల్ యాంగిల్ లో పడి అనుకున్న కథను తెరకెక్కించలేకపోయాను. సావిత్రి, ఎస్వీ రంగారావులు ఎవరో ఈ జనరేషన్ వారిలో చాలా మందికి తెలియదు. సావిత్రిగారి బయోపిక్ తీస్తేనేగానీ ఆమె సామర్ధ్యం, కష్టాన్ని మనం గుర్తించలేకపోయాం. సినిమాలు నిజ జీవితాన్ని ఎంత ప్రభావితం చేస్తాయో.. నిజ జీవితాలు కూడా సినిమాలను అంతే ప్రభావితం చేస్తాయి. అలాంటి సినిమాలకు జాతీయ అవార్డులు రావడం నిజంగా ఆనందం కలిగించింది. అలాంటి సినిమాలతోపాటు చాలా విలువలు ఉన్న సినిమాలు ముందు ముందు చాలా రావాలి. మంచి సినిమాలు ఎవరు చేసినా ప్రేమించేవాడిని, ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు ముందు ముందు ఇంకా రావాలి, తెలుగు సినిమా చరిత్రను మరింత ముందుకు తీసుకెళ్లాలి. చరిత్రను ఇలా పుస్తకాల్లో నిక్షిప్తం చేయడానికి ఒక కమిటీ ఉంటే దానిని ముందుకు తీసుకెళ్లడానికి నా వంతు కృషి చేస్తాన’ని హామీ ఇచ్చారు. -
చంద్రబాబు సృష్టించుకున్న భ్రమరావతి..
సాక్షి, విజయవాడ : ప్రజా రాజధానిగా వుండాల్సిన అమరావతి రాజకీయ కారణాలతో వివాదాలకు కేంద్రంగా మారిందని ప్రముఖ రచయిత తెలకపల్లి రవి అన్నారు. రైతుల భూములతో ప్రభుత్వం సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. అయిదేళ్ళ కాలంలో అమరావతి ప్రస్థానంపై అమరావతి అడుగులెటు పుస్తకాన్ని వెలువరించినట్లు చెప్పారు. అమరావతి రాజధాని పరిణామాలపై పుస్తకం అవసరమని భావించానని, అందుకే పుస్తకం రాసినట్లు తెలకపల్లి రవి గురువారమిక్కడ తెలిపారు. ‘అమరావతి అడుగులెటు...?’ పుస్తకావిష్కరణ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ... అమరావతిని సింగపూర్ చేస్తానన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో సింగపూర్ మాటే ఎత్తడం లేదని విమర్శించారు. అమరావతికి బ్రాండ్ ఇమేజ్ తెస్తానన్న ఆయన..ఇప్పుడు డబ్బులు లేవని, బాండ్లు జారీ చేస్తూ బాండ్ ఇమేజ్ తెచ్చారని ఎద్దేవా చేశారు. రైతులను అంబానీలను చేస్తానని చెప్పిన చంద్రబాబు ....కనీసం వారికి ప్లాట్లు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారని సూటిగా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణం కోసం రైతుల భూములను తాకట్టు పెట్టి రూ.30వేల కోట్లు అప్పులు తెచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు సీఆర్డీఏకు అనుమతి ఇచ్చారని, ఇలా ఎన్నివేల కోట్లు అప్పులు తెస్తారని... వాటిని ఎలా తీరుస్తారని ప్రశ్నలు సంధించారు. రైతుల నుంచి ప్రభుత్వ భూ సమీకరణ చేస్తుంటూ..మరోవైపు ప్రభుత్వం నుంచి సింగపూర్ కంపెనీలు భూ సమీకరణ చేస్తున్నాయని తెలకపల్లి రవి అన్నారు. అమరావతిలో పదివేల కోట్ల విలువైన భూమిని సింగపూర్ కంపెనీలకు కేటాయించారని, పేరు తెలియని కంపెనీలను ప్రభుత్వమే రాజధానిలో ఏర్పాటు చేసిందన్నారు. ఇప్పుడు కనిపిస్తున్నది అమరావతి కాదని భ్రమరావతి అని అన్నారు. భ్రమరావతి అనేది చంద్రబాబు సృష్టించుకున్న కలల రాజధాని అని ఎద్దేవా చేశారు. హైకోర్టు, ప్రపంచ బ్యాంకు, ఎస్టీటీ, అంతర్జాతీయ సంస్థలు కూడా దీనిని ఆక్షేపించాయని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అమరావతిని చూసి ఓటు అడగలేకపోవడం చంద్రబాబు నాయుడు వైఫల్యమంటూ ఎండగట్టారు. ఇక్కడ జరిగిన ప్రజా ఉద్యమాలే ఈ పుస్తకం రాయడానికి ప్రేరణ అని తెలకపల్లి రవి పేర్కొన్నారు. అమరావతి ప్రజా రాజధాని అన్నారని, కనీసం ప్రజాస్వామ్య రాజధానిగా కూడా లేదన్నారు. ప్రజలతో ఓ సభ కూడా అమరావతిలో పెట్టుకోలేనివ్వలేదన్నారు. ఇంద్ర సభలా తాత్కాలిక సచివాలయం అన్నారని, అయితే చంద్రసభ... లోకేంద్ర సభగా మార్చేశారని తెలకపల్లి రవి విమర్శలు గుప్పించారు. -
‘చంద్రబాబు బరితెగించారు.. అందుకే ఇలా’
సాక్షి, విజయవాడ : ‘దున్నే వాడిదే భూమి’ అనే నినాదాన్ని ‘కంపెనీలకే భూమి’ అన్న చందంగా సీఎం చంద్రబాబు మార్చేశారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉంది కదా అని బరితెగించి.. పారదర్శకత లేకుండా కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రముఖ రచయిత తెలకపల్లి రవి రచించిన ‘అమరావతి అడుగులెటు..?’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం కార్యదర్శి పి. మధు, సీపీఎం వర్గసభ్యుడు వై. వెంకటేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. ఎంబీ భవన్లో గురువారం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ..2013 భూసేకరణ చట్టం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేయడం ఇదే ప్రథమని అన్నారు. అమరావతిలో ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగిందని దుయ్యబట్టారు. ఇష్టారీతిన కంపెనీలకు వేలాది ఎకరాల భూమిని కట్టబెట్టడం అనేక వివాదాలకు కారణమవుతోందని మండిపడ్డారు. ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ ప్రయత్నిస్తోందని.. అధికారంలోకి వస్తే తమకు కావాల్సిన వారికి భూములను కట్టబెట్టవచ్చని భావిస్తున్నారని విమర్శించారు. అన్నీపరిశీలించిన తర్వాతే.. ప్రజలు ఆశించిన పాలనను చంద్రబాబు అందించలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. ప్రభుత్వ తీరుతో కేంద్రం నుంచి సరైన సహకారం లభించలేదని.. రైతుల నుంచి పూలింగ్ ద్వారా భూమిని తీసుకోవడం వివాదంగా మారిందని పేర్కొన్నారు. రైతుల భూమితో ప్రభుత్వం.. సింగపూర్ కంపెనీలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే.. రైతు కూలీలు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావులు, రాజకీయ పక్షాలు, రాష్ట్ర ప్రభుత్వ నివేదికలు, ప్రపంచ బ్యాంకు నివేదికలను కూడా పరిశీలించి తెలకపల్లి రవి అమరావతి అడుగులెటు..? పుస్తకం రచించారని పేర్కొన్నారు. అమరావతి ప్రణాళిక, ప్రచారం, ప్రజాందోళన తదితర పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి పుస్తకాన్ని వెలువరించారని తెలిపారు. -
విరిగి పెరిగితి పెరిగి విరిగితి కష్ట సుఖముల పారమెరిగితి
తన 53వ ఏటే కన్నుమూశారు గురజాడ అప్పారావు(21 సెప్టెంబర్ 1862 – 30 నవంబర్ 1915). ఆ స్వల్ప జీవితకాలంలోనే తెలుగు సాహిత్యానికి దీపధారిగా నిలిచారు. కన్యాశుల్కం నాటకంలో వాడుక భాషకు పట్టం కట్టారు. దిద్దుబాటు ద్వారా ఆధునిక కథాప్రక్రియకు కీలకమలుపుగా నిలిచారు. ‘దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్’; ‘విరిగి పెరిగితి పెరిగి విరిగితి/ కష్ట సుఖముల పారమెరిగితి’ అంటూ తేలికమాటల్లో అనితరసాధ్య కవిత్వం వెల్లడించారు. ‘దేశభక్తి, ఆధునిక కవిత్వం, ప్రేమ, స్త్రీ చైతన్యం, సంఘ సంస్కరణ వంటి ఎన్నో ఉదాత్త వినూత్న భావాలను నిర్వచించి, నిర్వహించి వెళ్లిన కావ్యకర్త, కార్యకర్త’ గురజాడ అంటారు తెలకపల్లి రవి. గురజాడ జీవితాన్నీ సాహిత్యాన్నీ– యువకవిగా యుగకవి, గిరీశం పాత్ర–అపార్థాలు, ముత్యాల సరాలు! సత్యాల స్వరాలు, నైతిక విలువలపై వాస్తవిక దృక్పథం... ఇలా 17 అధ్యాయాలుగా విశ్లేషిస్తూ ఆయన ‘యుగస్వరం’ వెలువరించారు. ‘గురజాడ భావాలకూ, సంస్కరణలకూ ఇప్పుడు గతం కన్నా ప్రాధాన్యత పెరిగింది. అందుకు దేశంలో వచ్చిన రాజకీయ, సామాజిక దుష్పరిణామాలు కూడా ఒక కారణం. ప్రపంచీకరణలో భాగంగా మత, మార్కెట్ తత్వాలు విజృంభించిన నేపథ్యం ఇందుకు ప్రధాన భూమిక’ అంటూ అప్పటికి ఆధునికుడైన గురజాడ సాహిత్యానికి ఇప్పటి ఆధునిక కాలంలో ఉన్న ప్రాసంగికతను చర్చించారు. గురజాడ: యుగస్వరం; రచన: తెలకపల్లి రవి; పేజీలు: 208; వెల: 125; ప్రతులకు: ప్రజాశక్తి బుక్‌హౌస్, 27–1–64, కారల్ మార్క్స్ రోడ్, విజయవాడ–520002. ఫోన్: 0866–2577533 -
అలుపెరుగని అనువాదకుడు ఏజీ యతిరాజులు
నివాళి ఎనభై సంవత్సరాల వయసులో కూడా అలుపెరుగ కుండా తెలుగు, తమిళ భాషల్లో అనువాద రంగంలో నిరంతరం కృషి చేసిన సృజనకారుడు ఏజీ యతి రాజులు. తెలుగు, తమిళ సాహిత్యాభిమానులకు గత 56 సంవత్సరాలుగా వీరు సుపరిచితులే. తమిళనాట వీరి గ్రంథాలు పది ముద్రణలు పొందాయి. హోవర్డ్ ఫాస్ట్ – ‘స్పార్టకస్, అలెక్స్ హేలీ– ‘ఏడు తరాలు’, డా. కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’, కళ్యాణరావు ‘అంట రాని వసంతం’ తదితర పుస్తకాలను తమిళంలోకి అను వదించారు. రాహుల్ సాంకృత్యాయన్ రాసిన 12 హిందీ గ్రంథాల అనువాదాలకు కేంద్ర, తమిళనాడు పురస్కారా లను అందుకున్నారు. ప్రముఖ విద్యావేత్త గిజుభాయి సాహిత్యాన్ని హిందీ నుంచి తెలుగుకి అనువదించారు. తమిళనాడులోని గుడియాత్తంలో చేనేత కుటుం బంలో 1935 ఆగస్టు 4న యతిరాజులు జన్మించారు. మునెమ్మ, గోవిందస్వామి వీరి తల్లిదండ్రులు. తెలుగు, తమిళ, హిందీ, ఆంగ్ల భాషలలోనూ, ఆయా భాషల సాహిత్యంతోనూ మంచి పరిచయం ఉంది. మాతృభాష తెలుగు. చిత్తూరు జిల్లాలో హిందీ ఉపాధ్యాయులుగా పనిచేసి పదవీ విరమణ పొందారు. పదేళ్ల వయసులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక నెలకొన్న దారుణ కరవు పరిస్థితుల్లో ఆకలి, దారిద్య్రం, అభద్రతా భావనలు బాల్యంలోనే తన పైన తీవ్ర ప్రభావాన్ని చూపాయంటారు. శేరు బియ్యం కోసం ఒక రోజంతా వరు సలో నిలబడటం తనకింకా బాగా గుర్తుందం టారు. యుద్ధాలవల్ల స్త్రీలు, పిల్లలు, సాధారణ ప్రజా నీకం ఎన్ని అవస్థలు పడతారో, జీవితం ఎంత దారు ణంగా ఉంటుందో ప్రత్యక్షంగా చూసిన కారణంగానే హింసకు, యుద్ధానికి తాను వ్యతిరేకం అంటూ ప్రపంచ శాంతికి విఘాతం కలిగించే దుష్టశక్తుల్ని వ్యతిరేకించే సాహిత్యమే తనకు అత్యంత ప్రమాణీకరమైందని అంటారు యతిరాజులు. ‘రోజూ పుస్తకాలు చదువుతారా సార్’ అన డిగితే వారు చెప్పే సమాధానం ఒక్కటే– వారి సాహిత్య వ్యక్తి త్వాన్ని తెలియ జేస్తుంది. ‘రోజూ అన్నం తింటాం కదా అని తినటం ఏరోజూ మానెయ్యం కదా? అట్లాగే చదవటం కూడా నిరంతరం కొన సాగుతూనే ఉండాలి’ అంటారు. కేవలం కాల్పనిక సాహిత్యమే కాక, చరిత్ర, సామాజిక శాస్త్రాలకు చెందిన ఎన్నో విలువైన గ్రంథాల్ని, అంతే విలు వైన ఆత్మకథల్ని, స్వీయ చరిత్రల్ని కూడా యతిరాజులు తెలుగు, తమిళ, హిందీ భాష ల్లోకి అనువదించారు. రాయటానికి చేయి సహకరించకపోయినా తాను చెబుతూ డీటీపీ చేయించడం విశేషం. ఇంత వయసులో కూడా వీరు నిత్య చదువరిగా ఉండటం అద్భుతమైన విషయం. వివిధ భాషల్లోని ప్రగతిశీల మానవతా రచన లను ఇతర భాషలకు అందజేయటం వీరికి చాలా ఇష్ట మైన ప్రవృత్తి. తెలకపల్లి రవి, వరప్రసాద్ (సాహితీ స్రవంతి) -
డిష్యుం... డిష్యుం...
గెస్ట్ కాలమ్ గనిలో పనిలో కార్ఖానాలో/యంత్రభూతముల కోరలు తోమే/కార్మిక ధీరుల విషాదాశ్రులకు/ఖరీదు కట్టే షరాబు లేడోయ్! ఎనభైఏళ్ల కిందట మహాకవి రాసిన వాక్యాలు ఇప్పటికీ ప్రసంగాలలో వినిపిస్తుంటాయి. నేడే మేడే అంటూ ఒకప్పుడు మాదాల రంగారావు ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో పాడితే పరవశించిన పరిస్థితి ఇప్పుడు వుందా? వాలెంటైన్స్ డేల కాలంలో కార్మికుల దినోత్సవాలకు ప్రాముఖ్యం కనిపిస్తుందా? విత్ ఎ క్లిక్ ఆఫ్ సెకండ్లో కావలసినవి వచ్చేస్తుంటే, వర్చ్యువాలిటీ విశ్వరూపం దాలుస్తుంటే, ఈ కాలం చెల్లిన మాటలు వినేవారెవ్వరు..? మేడే మొదలైందే పనిగంటల తగ్గింపు కోసం. ఎనిమిది గంటలు పని, ఎనిమిది గంటలు విశ్రాంతి, మరో ఎనిమిది గంటలు మా ఇష్టం అన్నది వారి నినాదం. కాని ఇప్పుడు మనం చెప్పుకునే కంప్యూటర్ నిపుణులకు పనిగంటల నియమం ఖచ్చితంగా అమలవుతోందా? ఇంటికి కూడా లాప్‌ట్యాప్ తీసుకొచ్చి పడక గదిలోనూ పని చేయడం, వర్కింగ్ హాలీడేలు చూడ్డం లేదా? నేరుగా ఉద్యోగాలిస్తే నిబంధనలు, పనిగంటలు పాటించాలని కాంట్రాక్టు ఔట్ సోర్సింగు అంటూ డొంక తిరుగుడుగా దోచుకోవడం రోజూ చూస్తున్నాం. ఇదెంత దూరం పోయిందంటే సాంకేతిక నైపుణ్యానికి మారుపేరుగా చెప్పుకునే జపాన్‌లోనే కరోషి అనే పనివొత్తిడి జబ్బుతో 2015లో దాదాపు 1500 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారిక అంచనా. ప్రపంచీకరణ ఫలితంగా పెట్టుబడులు ప్రవహించి ఉద్యోగావకాశాలు పెరిగిపోతాయన్న అంచనాలు ఇప్పుడు లేవు. అమెరికా నుంచి మనదేశం వరకూ నిరుద్యోగుల లెక్కలు వినిపిస్తున్నాయి. లక్నోలో కొద్ది మాసాల కిందట అతి సాధారణమైన అటెండర్ ఉద్యోగాల కోసం 23 లక్షల మంది దరఖాస్తు చేశారు. వారిలో 25 మంది డాక్టరే ట్లు కూడా వున్నారు! ఛత్తీస్‌ఘడ్‌లో ఇలాగే లెక్కకు మిక్కుటంగా 75 వేల దరఖాస్తులు వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలనే రద్దు చేసి పారేశారు. భారత్ వెలిగిపోతుంది, మేకిన్ ఇండియా... ఈ నినాదాల వెలుతురు వెనుక చీకటి గాఢంగా ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మునిగిపోయే టైటానిక్‌లా వుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. చెట్లు లేని చోట ఆముదపు చెట్టులా తప్ప మన ఆర్థిక వ్యవస్థ గొప్పగా సాధించిందనుకోవద్దని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామరాజన్ హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం సంపద ఏ కొద్దిమంది దగ్గరో పోగుపడటం. మన దేశ సంపదలోని సగం కేవలం ఒక శాతం మంది సంపన్నుల దగ్గరే ఉంది. అమెరికాలో కూడా కేవలం 158 కుటుంబాలే దేశ సంపద మీద పెత్తనం చేస్తున్నాయి. ఈ సంపద అంతా ఎక్కడిది? కోటానుకోట్ల మంది కార్మికులతో విచక్షణారహితంగా చాకిరీ చేయించుకోవడం, వారికి అందాల్సిన వేతనాలని ఇవ్వకపోవడం, ఆదాయం పంచకపోవడం వల్లనే. ఇది చాలదన్నట్టు సాంకేతికాభివృద్ధిని పెంచడం వల్ల, రోబోల రంగప్రవేశం వల్ల నోరున్న మనుషుల ప్రాధాన్యం ఇంకా తగ్గిపోతుంది. మెషీన్లలో వారూ మెషీన్లుగా మారిపోక తప్పదు. తమ చైతన్యాన్ని, హక్కులను, డిమాండ్లను మర్చిపోయి మరమనుషులుగా మారక తప్పదు. కాని ఇది ఎంతోకాలం సాగకపోవచ్చు. ‘ప్రపంచ కార్మికులారా ఏకం కండు పోయేదేమీ లేదు సంకెళ్లు తప్ప’ అన్న మార్క్స్ మాటకు మర మనుషులు కూడా గొంతు కలిపే రోజు వస్తుంది. అయితే అప్పుడెప్పుడో ఆయన చెప్పినట్టే కార్మికులు జీవిస్తున్నారా? యంత్రాలు అన్ని పనులూ సులభం చేయలేదా? కంప్యూటర్ల వినియోగంతో శ్రమ తగ్గి నైపుణ్యం, నాణ్యత మెరుగుపడలేదా? మరి కఠోరశ్రమ అవసరముందా? మనిషికి మరమనిషి ప్రత్యామ్నాయం కావడం ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సాంకేతిక నైపుణ్యం మనకు యంత్రాలనిస్తుంది కాని నడిపేది మనిషే. అవి తమకు ఇవ్వబడిన ఆదేశాల ప్రకారం చెప్పింది చెప్పినట్టు చేసుకుపోతాయి తప్ప తేడాపాడాలు వాటికి తెలియవు. కనుక మ్యాన్ అండ్ మెషీన్ ఒక కాంబినేషన్. ఒకటి వుంటేనే మరొకటి. మేధా శారీరక శ్రమతో సాంకేతిక పరికరాలను సృష్టించాల్సింది మనుషులే. సృజనాత్మకంగా ఉత్పాదకత పెంచడం ఎలాగో కూడా మనుషులే ఆలోచించాలి తప్ప వాటికవే లక్ష్యాలు నిర్దేశించుకోలేవు. వాటికి కావలసిన సరఫరాలు సమన్వయం మనుషులతోనే జరుగుతుంది. మరలు కూడా ఒక దశ వరకే పనిచేస్తాయి. తర్వాత వేడిక్కిపోతాయి. చెడిపోతాయి. ఆగిపోతాయి. ఏదో ఒక ఇంధనం లేకుంటే నడవలేవు. కనుకనే మానవ రహిత మరప్రపంచాన్ని వూహించడానికి లేదు. - తెలకపల్లి రవి,సీనియర్ పాత్రికేయులు -
గబ్బర్‌సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి
చేస్తే రాజకీయాలు చేయండి లేకపోతే సినిమాలు చేసుకోండి పవన్‌కల్యాణ్‌కు తెలకపల్లి రవి హితవు ఒంగోలు: ‘చూడప్ప సిద్దప్పా.. ఉంటే రాజకీయాల్లో ఉండు, లేకపోతే సినిమాలు చేసుకో’ అంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌కు సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు తెలకపల్లి రవి హితవు పలికారు. శనివారం ఒంగోలు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ పవన్ కల్యాణ్ గబ్బర్‌సింగ్‌లా బయలుదేరి సిద్దప్పలా వెనక్కి వస్తున్నారని విమర్శించారు. ఆయన ఎవరి తరఫున ప్రశ్నిస్తున్నాడో అర్ధం కాకుండా ఉందన్నారు. ప్రశ్నించడమంటే చంద్రబాబునాయుడు చెప్పిన జవాబులు బయట చెబితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. చంద్రబాబుకు గెస్ట్‌గా ఉండకూడదని, గెస్టు ఆర్టిస్టులా అప్పుడప్పుడు కనిపించి ఏవో డైలాగులు చెబితే ఏమి లాభమని, ప్రజలను తప్పుతోవ పట్టించడమేనని ధ్వజమెత్తారు. రాజకీయ నాయకులపై ప్రజలకు ఉన్న చులకనభావాన్ని పవన్‌కల్యాణ్ మరింత తగ్గిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదా లేదు, ప్యాకేజీ లేదు, ఇవ్వకపోతే చూద్దాం అంటున్నారని , ఇప్పటికే మూడోవంతు పాలన కాలం ముగిసి పొయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబునాయుడు రాయలసీమకు వెళ్లి తాను రాయలసీమ బిడ్డనని చెప్పుకోవడం వల్ల ఉపయోగం ఏమిటని ప్రశ్నించారు. అమరావతి చుట్టూ 21 నగరాలు నిర్మిస్తామని చెబుతున్నారని, అసలు అమరావతి పట్టణాన్ని ఇంతవరకూ పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఆయన కట్టబోయే రాజధాని స్టేట్ స్పాన్సర్డ్ సింగపూర్ వెంచర్ అని రవి ఎద్దేవా చేశారు. బీహార్ ఓటమి తర్వాత కూడా బీజెపీ గుణపాఠం నేర్చుకోలేదని, మీడీయాలో ఎఫ్‌డీఐలను అనుమతించడం ద్వారా తాము కార్పొరేట్ రంగానికి దగ్గరగా ఉన్నట్లు చెప్పుకుంటోందని, మరోవైపు కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను వివాదం చేయడం సరికాదన్నారు. దేశంలో పెరుగుతున్న మతపరమైన అసహనంపై తెలుగురాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడకపోవడం మంచిపద్దతి కాదన్నారు. లౌకిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న గురజాడ శతవర్ధంతి ఉత్సవాలను పెద్ద ఎత్తున జరపాలని సూచించారు. అదే సమయంలో విశ్వనాధసత్యనారయణ పేరును ముందుకు తెచ్చి వివాదం చేయడం సరికాదన్నారు. -
పచ్చని పొలాల్లో చిచ్చు పెడతారా..?
ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తాడేపల్లి రూరల్ : తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి, తూళ్ళురు మండలం వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లో జరిగిన సంఘటనలను ప్రముఖ రాజకీయ విశ్లేషకులు తెలకపల్లి రవి తీవ్రంగా ఖండించారు. ఆగ్రామాలను సందర్శించిన ఆయన పచ్చని పొలాల్లో రాజధాని చిచ్చు రాజేసిన పాపం రాష్ట్ర ప్రభుత్వందేనని విమర్శించారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వ హించి రైతులకు నష్ట పరిహారం అందించడంతో పాటు భవిష్యత్‌లో ఇటువంటివి జరగకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తలపెట్టిన భూ సమీకరణను వ్యతిరేకించిన గ్రామాల్లోనే ఇవి జరగడం గమనించాలన్నారు. ల్యాండ్ పూలింగ్ విధానం రైతులకు నష్టదాయకమన్నారు. కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఎటువంటి ప్యాకేజి ప్రకటించక పోవడం పట్ల రైతులతో పాటు సామాన్య ప్రజలు కూడా అసంతృప్తి చెందుతుందన్నారు. రైతులను భయభ్రాంతులకు గురి చేయడానికే ఇలాంటి సంఘటనలు సృష్టిస్తున్నారని అభిప్రాయపడ్డారు. గ్రామాలలో రైతుల మధ్య గొడవలు పెట్టి ప్రభుత్వం తాను అనుకున్నది సాధించాలనుకుని ఇలాంటి చర్యకు పూనుకున్నట్లు రైతులు అనుమానిస్తున్నారన్నారు. దీని వల్ల గ్రామాల్లో శాంతి, భద్రతల సమస్యలు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగి, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగుకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. శాంతియుత వాతావరణం కోసం కృషి చేయాలని ఆయన అన్నారు. ఆదివారం ఆర్ధరాత్రి నుంచి జరిగిన సంఘటనలో 5చోట్ల పాక లు, 20వేల బొంగులు కాలి బూడిద య్యాయని నష్టం లక్షల రూపాయల్లో ఉంటుందని రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు పాశం రామారావు, కౌలు రైతు సంఘం నాయకులు వై.వి.రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
నాటుకోడి పులుసు గురించి మాట్లాడిన చంద్రబాబు
హైదరాబాద్: ఎప్పుడు సీరియస్‌గా ఉండే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నోరూరించే మాటలు మాట్లాడారు. నాటుకోడి పులుసు, రాగి సంకటిల ప్రత్యేకతల గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్ర పుస్తకాన్ని ఈరోజు ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాటుకోడి పులుసు, రాగిసంకటి వంటి రాయలసీమ రుచులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సి ఉందన్నారు. ఎక్కడా లేనంత సాంస్కృతిక సంపద తెలుగునాట ఉందని చెప్పారు. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సి ఉందన్నారు. -
సాక్షి ప్రతినిధిపై లగడపాటి చిందులపై తెలకపల్లి రవి స్పందన