చంద్రబాబు నాయుడు
హైదరాబాద్: ఎప్పుడు సీరియస్గా ఉండే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు నోరూరించే మాటలు మాట్లాడారు. నాటుకోడి పులుసు, రాగి సంకటిల ప్రత్యేకతల గురించి చెప్పారు. సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి రాసిన నవ్యాంధ్ర పుస్తకాన్ని ఈరోజు ఆయన ఇక్కడ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ నాటుకోడి పులుసు, రాగిసంకటి వంటి రాయలసీమ రుచులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సి ఉందన్నారు.
ఎక్కడా లేనంత సాంస్కృతిక సంపద తెలుగునాట ఉందని చెప్పారు. వీటికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకురావాల్సి ఉందన్నారు.