
సాక్షి, కృష్ణా: కృష్ణా జిల్లా ఉయ్యూరు మున్సిపాలిటీలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియను పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పరిశీలించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జడ్పీటీసీ, ఎంపీటీసీ సహా అన్ని మున్సిపాలిటీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. టీడీపీకి స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ముందు ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చామని అన్నారు. డబ్బు, మద్యం పంపిణీ లేకుండా ఎన్నికల్లో గెలుస్తామని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment