టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు | YSRCP Vallabhaneni Vamsi Visited Hospitalized Sandhya Rani In Unguturu, Details Inside | Sakshi
Sakshi News home page

టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్‌కు ఓటేసిందని ట్రాక్టర్‌తో తొక్కించబోయారు

Published Thu, May 16 2024 12:12 PM | Last Updated on Thu, May 16 2024 1:09 PM

బాధితురాలికి వల్లభనేని వంశీ పరామర్శ

బాధితురాలికి వల్లభనేని వంశీ పరామర్శ

సాక్షి, కృష్ణా: ఏపీలో ఎన్నికల సందర్భంగా పచ్చ బ్యాచ్‌ రెచ్చిపోయింది. ఎన్నికల్లో ఓటమి భయంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారు. 

ఈ క్రమంలోనే వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిన వారిపై భౌతిక దాడులకు దిగారు. కాగా, ఉంగుటూరు మండలం ఆత్కూరులో టీడీపీ నాయకుడు ఏడుకొండలు అరాచకం సృష్టించారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేసిందన్న కారణంగా వేముల సంధ్యా రాణి అనే ఓటర్‌ను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపే ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదంలో సంధ్యా రాణి రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న పిన్నమనేని ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. 

ఇక​, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యా రాణిని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ పరామర్శించారు. ఆమెను కలిసి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు.. ఆ ఘటనపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement