
విజయవాడ: వల్లభనేని వంశీ అక్రమ అరెస్ట్ కేసులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కొత్త నిజాలను బయటపెట్టింది. చంద్రబాబు ప్రభుత్వం కుట్రను బహిర్గతం చేస్తూ.. సత్యవర్థన్ వాంగ్మూలాన్ని వైఎస్సార్ సీపీ విడుదల చేసింది. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’లో ఆధారాలను వైఎస్సార్ సీపీ బయటపెట్టింది. ‘Truth Bomb’ పేరుతో వంశీ అక్రమ అరెస్టులో నిజాలు ఇవిగో అంటూ వైఎస్సార్ సీపీ ఆధారాలను విడుదల చేసింది.
వంశీ అరెస్టే లక్ష్యంగా చంద్రబాబు సర్కారు చేసిన కుట్రలతో పాటు, గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులకు సంబంధించిన ఆధారాలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్ మెంట్ అందుకు నిదర్శనంగా పేర్కొంది. ఫిబ్రవరి 10 వ తేదీన సత్యవర్థన్ ఏదైతే స్టేట్ మెంట్ ఇచ్చాడో దాన్ని విడుదల చేసింది. ఘటన జరిగిన సమయంలో తాను అక్కడ లేనని సత్యవర్థన్ కోర్టుకు చెప్పిన స్టేట్ మెంట్ ను వైఎస్సార్ సీపీ బహిర్గతం చేసింది.
💣 Truth Bomb 💣
వంశీ అరెస్టు లక్ష్యంగా చంద్రబాబు సర్కార్ కుట్రలు
- గన్నవరం కేసులో కట్టుకథలు, కల్పితాలు, తప్పుడు సాక్ష్యాలు, అక్రమ అరెస్టులు
- కోర్టు ముందు సత్యవర్థన్ స్టేట్మెంటే అందుకు నిదర్శనం
- చంద్రబాబు సర్కార్ కుట్రను బయటపెట్టిన సత్యవర్థన్ ఫిబ్రవ… pic.twitter.com/H5hseJpSv0— YSR Congress Party (@YSRCParty) February 18, 2025
Comments
Please login to add a commentAdd a comment