
సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం ముట్టుకుంటే షాక్ కొట్టాల్సిందేనని, దశలవారీగా మద్యపాన నిషేదం అమలు చేస్తామని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన కరోనా వైరస్.. ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఉయ్యురుకు పట్టిన కరోనా వైరస్ అంటూ మండిపడ్డారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కరోనాని ఎదురుకుంటూనే ప్రజల కష్టాలు తెలుసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి అని కొనియాడారు. రాష్ట్రంలో వాలంటీర్ల పనితీరు భేష్ అంటూ పొగిడారు. రైతులు నష్ట పోకుండా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment