
సాక్షి, విజయవాడ: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలను తిప్పికొట్టాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమపాలన చేస్తుంటే.. చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: ‘రామతీర్థం ఘటనలో చంద్రబాబు హస్తం’)
ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారన్నారు. రామతీర్థం ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు. అంతర్వేది ఘటనపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రథం నిర్మాణం చేపట్టి పూర్తి చేసిందన్నారు. ‘‘రాష్ట్రంలో పండగ వాతావరణాన్ని భగ్నం చేయాలని చంద్రబాబు చూస్తున్నారు. లోకేష్ మాటలకు రాష్ట్రంలో విలువలేదని’’ ఎమ్మెల్యే పార్థసారధి విమర్శించారు.(చదవండి: పప్పునాయుడు సవాల్‌కు మేం రెడీ..)