Ramatheertham Temple
-
ఏపీ సర్కార్ తరుపున పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి బొత్స
-
Nellimarla: రామకోనేరుకు మహర్దశ
నెల్లిమర్ల రూరల్ (విజయనగరం జిల్లా): పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం సీతారామస్వామి ఆలయం పక్కనున్న రామకోనేరుకు మహర్దశ కలగనుంది. కోనేరు అభివృద్ధి పనులకు దేవదాయ శాఖ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. అమృత సరోవర్ కార్యక్రమంలో భాగంగా కోనేరును బాగుచేసేందుకు రూ.1.50 కోట్ల వ్యయంతో దేవదాయశాఖ కమిషనర్‌కు ప్రతిపాదనలు పంపించారు. ఈ మేరకు ఉపాధిహామీ సిబ్బంది రామకోనేరుకు జియో ట్యాగింగ్ పూర్తి చేశారు. జలవనరుల శాఖ అధికారులు కోనేరుకు కొలతలు వేసి అభివృద్ధి పనులపై అంచనాలు రూపొందించే పనిలో నిమఘ్నమయ్యారు. 12 ఎకరాల్లో రామకోనేరు రామకోనేరు 12 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. రామక్షేత్రానికి విచ్చేసే భక్తులు ముందుగా కోనేరులో పుణ్య స్నానమాచరించిన తరువాత సీతారామస్వామిని, ఉమా సదాశివుడిని దర్శించుకుంటారు. ప్రస్తుతం రామకోనేరులో రెండు పుష్కర ఘాట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన ఆలయాల కోనేరుల అభివృద్ధిలో భాగంగా ఆ శాఖ అధికారులు తాజాగా అమృత సరోవర్ పథకం కింద రామతీర్థం కోనేరును ఎంపిక చేశారు. పనులు పూర్తయితే రామక్షేత్రానికి మరింతి శోభ సాక్షాత్కరించనుంది. కోనేరు అభివృద్ధి ఇలా... రామకోనేరులోకి నీరు వచ్చి పోయేందుకు ఇన్లెట్, ఔట్లెట్ నిర్మాణాలు పూర్తి చేస్తారు. కోనేరు చుట్టూ ఉన్న గట్టును మరింత పటిష్టం చేయనున్నారు. కోనేరులో పూడికతీత పనులు, చుట్టూ రాతి కట్ట నిర్మాణాలు, పడమర వైపు సువిశాలంగా పుష్కర ఘాట్ నిర్మాణం, భక్తుల సౌకర్యార్థం పుష్కరఘాట్ల వద్ద అదనపు షెడ్ల నిర్మాణం, మూడు అడుగుల ఎత్తులో గట్టు, రిటైనింగ్ వాల్స్ ఏర్పాటు తదితర అభివృద్ధి పనులు పూర్తిచేస్తారు. వీటితో పాటూ 100 మీటర్ల పోడవు, 5 మీటర్ల వెడల్పుతో కూడిన సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోనేరు అభివృద్ధి పనులకు సుమారు రూ.3 కోట్లు అవసరమవుతాయని దేవస్థాన ఈఓ ప్రసాదరావు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులకు కొలతలు రామతీర్థం దేవస్థానాన్ని ఇరిగేషన్ జేఈ శ్రీనివాసరావు గురువారం సందర్శించారు. అభివృద్ధి పనులకు ఈఓ ప్రసాదరావుతో కలిసి కోనేరు చుట్టూ కొలతలు వేశారు. పుష్కరిణి గట్టుతో పాటు ఇన్లెట్, ఔట్లెట్ చానళ్లను పరిశీలించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి పనులకు సంబంధించి పూర్తి నివేదికను అందజేస్తామని ఆయన తెలిపారు. (క్లిక్: రాజాం టు అమెరికా.. కష్టాలను ఈది సూపర్ సీఈవోగా) -
కొలువుదీరిన కోదండరామయ్య
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం నీలాచలం బోడికొండపై సోమవారం కోదండ రాముడు కొలువుదీరాడు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య పండితుల ఈ క్రతువును వైభవంగా జరిపించారు. రామతీర్థం క్షేత్రం యావత్తూ జైశ్రీరామ్ నామస్మరణతో పులకించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పంతో ఈ ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. రూ.3 కోట్ల నిధులతో పూర్తయిన కోదండ రామస్వామి వారి నూతన రాతి దేవాలయంలో గడిచిన మూడ్రోజులూ తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు నిర్విరామంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తిచేశారు. వేకువజామున యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, దాతాది సామాన్య హోమం, పూర్ణాహుతి, యంత్ర, బింబ స్థాపనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోదండ రామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సూర్యనారాయణరాజు, ఇ.రఘురాజు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ హరిజవహర్‌లాల్, కలెక్టర్ సూర్యకుమారి, ప్రత్యేకాధికారి భ్రమరాంబ ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు. -
రామతీర్థం ఆలయ పునఃనిర్మాణం పూర్తి
సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణం కేవలం నాలుగు నెలల్లో పూర్తయింది. ఇక్కడి బోడికొండపై పాత ఆలయం ఉన్నచోటే రూ.3 కోట్ల ఖర్చుతో నూతన హంగులతో కొత్త రాతి దేవాలయం పునర్నిర్మాణానికి 2021 డిసెంబరు 22న శంకుస్థాపన జరగగా.. సోమవారం (ఈనెల 25న) పునర్నిర్మించిన ఆలయంలో విగ్రహ ప్రతిష్ట జరగనుంది. వైఖానస ఆగమ పండితులు నిర్ణయించిన ముహుర్తం మేరకు సోమవారం ఉ.7.37 గంటలకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండ రామస్వామి వార్లను పునఃప్రతిష్టించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణతో పాటు మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక ఎంపీ చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు అప్పలనాయుడు, దేవదాయ శాఖ కమిషనర్ హరిజవహర్‌లాల్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తుపాన్లతో పనులు ఆలస్యం 2020 డిసెంబరు 28వ తేదీ అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగలు కొండపై స్వామి విగ్రహాన్ని తొలగించగా.. అనంతరం అది కొండపైన కోనేరులో బయటపడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. విగ్రహాల పునఃప్రతిష్టతో పాటు పురాతన ఆలయం మొత్తాన్ని కూడా పునర్నిర్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. సంఘటన జరిగిన ఐదు రోజుల్లోనే నాటి దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి రూ.3 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించారు. జనవరి 3న మంత్రి ప్రకటన చేయగా.. జనవరి 9కల్లా దేవదాయ శాఖ అనుమతులిచ్చింది. అలాగే, 2021 జనవరి 22 నాటికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి శ్రీ సీతారామలక్ష్మణ నూతన విగ్రహాలు రామతీర్థం చేరాయి. 28న కొండ కింద శ్రీరామాలయంలోని ఏర్పాటుచేసిన బాలాలయంలో ఆ విగ్రహాల చర ప్రతిష్ట జరిగింది. ఇక 2021 ఆగస్టు నాటికే పాత ఆలయాల శిథిలాలను తొలగించి కొత్త ఆలయ పనులు ప్రారంభించాలని ఉన్నతాధికారులు నిర్ణయించినప్పటికీ, అప్పట్లో రెండుసార్లు తుపాను రావడం.. గ్రానైట్ రాళ్ల తరలింపునకు అవరోధాలు ఎదురవడంతో డిసెంబర్లో శంకుస్థాపన జరిగింది. ఈలోపు కొండపైకి కొత్తగా త్రీఫేజ్ కరెంటు ఏర్పాటుచేశారు. విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని కొండ దిగువన ఏర్పాటు చేసిన యాగశాల జనరేటర్ వెలుగుల్లో పనులు.. ఇక పాత ఆలయం స్థానంలో గ్రానైట్ రాయితో కొత్త ఆలయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి మూడేసి టన్నుల బరువు ఉండే గ్రానైట్ రాళ్లను కూడా ఆలయ పునర్నిర్మాణంలో ఉపయోగించారు. 600 మీటర్ల ఎత్తులోని బోడికొండ పైకి గ్రానైట్ రాళ్లను తరలించేందుకు 200 మీటర్ల పొడవున ప్రత్యేక ట్రాక్‌ను ఏర్పాటుచేయడంతో పాటు 12 టన్నుల బరువుండే రాళ్లను ఎత్తగలిగే భారీ హైడ్రాలిక్ క్రెయిన్లను ఉపయోగించారు. మరోవైపు.. త్వరగా ఆలయ పునర్నిర్మాణం పూర్తిచేసేందుకు జనరేటర్ల సాయంతో రాత్రి వేళల్లో పనులు జరిపారు. కుప్పం, చెన్నై ప్రాంతాల నుంచి వచ్చిన 25 మంది శిల్పులతో పాటు దేవదాయ శాఖ ఇంజనీరింగ్ అధికారులు ఈ పనుల్లో పాల్గొన్నారు. మరిన్ని అదనపు వసతులతో.. ప్రధాన ఆలయ పనులు ఇప్పటికే పూర్తికాగా, ఆలయం వద్ద మరికొన్ని ఆదనపు వసతులు కల్పించనున్నారు. ► గర్భాలయంతో పాటు ఆలయ మండపం, ధ్వజస్తంభం, ప్రాకారం (కాంపౌండ్ వాల్), కొత్తగా యాగశాలనూ నిర్మిస్తున్నారు. వీటిని మరో మూణ్ణెలల్లో పూర్తిచేయనున్నట్లు అధికారులు తెలిపారు. ► మెట్ల మార్గానికి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేశారు. గతంలో స్వామివారికి సమర్పించే నివేదనను వండడానికి వసతిలేదు. ఇప్పుడు కొత్తగా నివేదనశాలలను ఏర్పాటుచేస్తారు. ► అలాగే, కొండపైన భక్తుల కోసం ప్రత్యేక షెల్టరును ఏర్పాటుచేయడంతోపాటు భక్తుల కోసం మంచినీటి ట్యాంకు, వాష్ రూములు నిర్మించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. స్వామి ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నా నేను విజయనగరం జిల్లా కలెక్టరుగా ఉన్న సమయంలోనే రామతీర్థం ఆలయంలో ఆ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన జరిగినప్పుడూ, విగ్రహ ప్రతిష్ట సమయంలో దేవదాయ శాఖ కమిషనర్‌గా నేనే ఉన్నాను. ఆ స్వామివారే మళ్లీ నాకు దేవదాయ శాఖ కమిషనర్ పోస్టు ఇప్పించి తొందరగా ఆ పనులన్నీ చేయించుకోమని అవకాశం ఇచ్చినట్లుగా భావిస్తున్నాను. – హరిజవహర్‌లాల్, దేవదాయ శాఖ కమిషనర్ -
అశోక్ గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులు
విజయనగరం: రామతీర్థం ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుకు 41ఏ సీఆర్పీసీ నోటీసులను పోలీసులు అందజేశారు. అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు ఇచ్చారు. కాగా,, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో అశోక్ గజపతిరాజు కేసు నమోదైన సంగతి తెలిసిందే. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా తాజాగా అశోక్ గజపతిరాజుకు అవసరమైనప్పుడు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందంటూ 41ఏ సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. -
అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు
విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదైంది. బుధవారం రామతీర్థం ఘటన నేపథ్యంలో ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు నెలిమర్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. రామతీర్థంలో రామాలయ పునర్నిర్మాణ శంకుస్థాపనను అడ్డుకొని ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించారని అశోక్‌గజపతిరాజుపై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అశోక్‌గజపతిరాజుపై 427, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చదవండి: బోడికొండపై 'దండు'యాత్ర.. కాగా, రెండో భద్రాద్రిగా భాసిల్లుతున్న విజయనగరం జిల్లా రామతీర్థం బోడికొండపై కోదండ రామస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు టీడీపీ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అడ్డు తగిలి వీరంగం సృష్టించిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం శంకుస్థాపన సమయానికి ముందుగానే కొందరు టీడీపీ కార్యకర్తలను వెంటబెట్టుకుని ఆయన బోడికొండ పైకి చేరుకున్నారు. రామతీర్థం దేవస్థానం తన పూర్వీకులదని, అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఎలా శంకుస్థాపన చేస్తుందంటూ దేవదాయ శాఖ అధికారులపై చిందులేశారు. శంకుస్థాపన కోసం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని కిందకి తోసేశారు. అనువంశిక ధర్మకర్తనైన తనకు తెలియకుండా ముహూర్తం ఎలా నిర్ణయిస్తారంటూ కేకలు వేశారు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న మంత్రులతో వాగ్వాదానికి దిగారు. -
అశోక్ గజపతిరాజు హుందాగా వ్యవహరించాలి:మంత్రి వెల్లంపల్లి
-
దేవుడి ఆలయాన్ని సర్కస్ కంపెనీ అంటారా..?: మంత్రి వెల్లంపల్లి
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై ఆలయ ధర్మకర్త అశోక్‌గజపతిరాజు వీరంగం సృష్టించడంపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. 'అశోక్ గజపతి రాజు హుందాగా వ్యవహరించాలి. ఆలయ ధర్మకర్తగా ఆలయ అభివృద్ధిని అడ్డుకోవడం హేయమైన చర్య. ధర్మకర్త అని చెప్పుకోవడమే తప్ప దేవాలయాన్ని ఏనాడైనా అభివృద్ధి చేశారా?. రాష్ట్ర ప్రభుత్వం రాతి ఆలయాన్ని పటిష్టంగా నిర్మిస్తుంటే సర్కస్ కంపెనీ అని అశోక్ గజపతి అనడంపై చర్యలు తీసుకొవడం జరుగుతుంది. ఏం జరగకపోయినా ఏదో జరిగినట్లు అశోక్‌గజపతిరాజు రాద్ధాంతం చేస్తున్నారు. ఇన్నాళ్లు ఆలయ అభివృద్ధి చేయకపోవడం, ఇప్పుడు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం చూస్తుంటే రాముని విగ్రహం ధ్వంసంలో వీళ్ల పాత్ర ఉందేమోనని అనుమానం కలుగుతోంద'ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. చదవండి: (రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం) -
రామతీర్థం బోడికొండపై అశోక్‌గజపతిరాజు వీరంగం
సాక్షి, విజయనగరం: పవిత్ర పుణ్యక్షేత్రం రామతీర్థం నీలాచలం బోడికొండపై రూ.3కోట్ల వ్యయంతో నిర్మించనున్న శ్రీ కోదండ రామాలయ పునఃనిర్మాణానికి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణితోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, దేవస్థాన అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన అనంతరం వించ్ మోటారు సహకారంతో ట్రాక్ మీదుగా శిలా ఖండాలను ఒక్కొక్కటిగా కొండపైకి చేరవేసి ఆలయాన్ని నిర్మించడానికి ఏర్పాట్లు చేశారు. మండపంతోపాటు ధ్వజస్తంభం, ఆలయ ప్రాకారం, వంటశాలను నిర్మించనున్నారు. నీటి కొలను సుందరీకరణ, మెట్ల మార్గం ఆధునికీకరిస్తారు. శంకుస్థాపన అనంతరం ఆరు నెలల్లో నిర్మాణం పూర్తి చేసేందుకు దేవదాయశాఖ ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం దిగువున ప్రధాన ఆలయంలో ఏర్పాటు చేసిన బాలాలయంలో కోదండ రాముడు నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొండపై నిర్మాణం పూర్తయిన వెంటనే విగ్రహాలను నూతన ఆలయంలో పునఃప్రతిష్టిస్తారు. అశోక్‌గజపతిరాజు వీరంగం రామతీర్థం బోడికొండపై అశోక్ గజపతి రాజు వీరంగం సృష్టించారు. దుండగులు ధ్వంసం చేసిన ఆలయాన్ని ప్రభుత్వం నిర్మించడాన్ని అశోక్ గజపతి రాజు తప్పుబట్టారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేరున ఉన్న శిలాఫలకాన్ని తొలగించాలని అశోక్ అధికారులపై చిందులు తొక్కారు. ఆ క్రమంలోనే శంకుస్థాపం బోర్డును సైతం అశోక్‌గజపతిరాజు పీకిపారేశారు. -
జనవరిలో ‘రామతీర్థం’ ఆలయం ప్రారంభం
నెల్లిమర్ల రూరల్/విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా రామతీర్థంలోని బోడికొండపై శ్రీకోదండ రామాలయాన్ని పునర్నిర్మించి వచ్చే ఏడాది జనవరి నాటికి ప్రారంభిస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. బుధవారం రామతీర్థం, విజయనగరంలలో వేర్వేరుగా ఆయన మీడియాతో మాట్లాడారు. రామతీర్థంలోని బోడికొండపై కోదండరామాలయ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించామని, టెండర్లు కూడా పూర్తయ్యాయని తెలిపారు. కొండపై ఆలయ నిర్మాణానికి అవసరమైన వసతులు సమకూర్చి అనుకున్న సమయానికి ఆలయాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. ఆగమశాస్త్రం ప్రకారం పండితులు, స్వామీజీల సూచనల మేరకే ఆలయాన్ని నిర్మిస్తున్నామన్నారు. చిలకలూరిపేట నుంచి పనివారిని రప్పించి పూర్తి రాతి కట్టడంగా ఆలయాన్ని రూపొందిస్తున్నట్టు చెప్పారు. అనంతరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడుతో కలిసి ఆలయ నమూనాలను మంత్రి విడుదల చేశారు. దేవాలయాల పరిరక్షణే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నారని విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. రాష్ట్రంలో దేవాలయాల పరిరక్షణలో భాగంగా 65 శాతం ఆలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తయిందని తెలిపారు. చంద్రబాబు 40 గుడులు కూల్చితే వాటి అభివృద్ధికి వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేశారని పేర్కొన్నారు. చదవండి: ఏపీని తాకిన రుతుపవనాలు -
సిట్ దర్యాప్తు సాగుతోందిగా.. సీబీఐ ఎందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దేవాలయాలపై దాడులకు సంబంధించి సిట్ దర్యాప్తు సాగుతున్నందున ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు అవసరంలేదని హైకోర్టు పేర్కొంది. ఈ దాడులపై సీబీఐ లేదా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)లతో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ కృష్ణాజిల్లా కొత్తూరు తాడేపల్లి గ్రామానికి చెందిన లెక్చరర్ కె.రామకృష్ణ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్‌ను) పరిష్కరించింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్‌గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దేవాలయాలపై జరుగుతున్న దాడుల ఘటనలపై దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేశామన్న ప్రభుత్వ వాదనను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం సిట్ దర్యాప్తును కొనసాగనిద్దామని తెలిపింది. సిట్ దర్యాప్తు ముగియకముందే సీబీఐ దర్యాప్తు కోరుతూ పిటిషన్ దాఖలు చేయడం అపరిపక్వమే అవుతుందని స్పష్టం చేసింది. ప్రస్తుత దశలో సీబీఐ దర్యాప్తు అవసరం లేదని, ఈ దశలో న్యాయస్థాన జోక్యం కూడా అవసరం లేదని తేల్చిచెప్పింది. ఒకవేళ సిట్.. దేవాలయాలపై దాడులకు పాల్పడిన నిందితులను పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు కోర్టుకు రావచ్చని పిటిషనర్‌కు మౌఖికంగా తెలిపింది. ఈ దాడుల కేసు దర్యాప్తును సిట్ ఓ తార్కిక ముగింపునకు తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేస్తూ పిల్‌ను పరిష్కరించింది. అంతకుముందు పిటిషనర్ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ ఆలయాలపై తరచు దాడులు జరుగుతున్నాయని, విగ్రహాల ధ్వంసం జరుగుతోందని చెప్పారు. అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం తగులబెట్టిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిందన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలో దేవతామూర్తి విగ్రహం నుంచి తలను వేరుచేశారని, దీనిపై ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసిందని చెప్పారు. రథం దగ్ధం కన్నా రామతీర్థం ఘటన తీవ్రమైనదని, అందువల్ల సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ ప్రభుత్వం ఆలయాలపై దాడులను తీవ్రంగా పరిగణిస్తోందని, అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసిందని చెప్పారు. ఈ వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం పిల్‌ను పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. -
రామతీర్థానికి కోదండరాముడు
నెల్లిమర్ల రూరల్: విజయనగరం జిల్లా రామతీర్థానికి తిరుమలలో రూపుదిద్దుకున్న కోదండరాముని విగ్రహాలు శనివారం చేరుకున్నాయి. రామతీర్థంపై ఉన్న కోదండ రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. టీటీడీకి చెందిన ఎస్వీ శిల్ప కళాశాలలో స్వామివారి విగ్రహాలను తయారు చేశారు. దేవదాయ ఆర్జేసీ భ్రమరాంబతో పాటు మరికొందరు అధికారులు శుక్రవారం తిరుపతి వెళ్లి ప్రత్యేక ఎస్కార్ట్ వాహనంలో సీతారామలక్ష్మణస్వామి విగ్రహాలను శనివారం రామతీర్థానికి తీసుకువచ్చారు. అర్చకులు విగ్రహాలు తీసుకువచ్చిన వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి స్వామివారి విగ్రహాలను రామతీర్థంలో తిరు వీథి గావించి ఆలయం వద్దకు తీసుకువచ్చారు. విగ్రహాలకు అర్చకులు పూజలు నిర్వహించిన అనంతరం పక్కనే ఉన్న ప్రత్యేక గదిలో భద్రపరిచారు. ఆర్జేసీ భ్రమరాంబ మాట్లాడుతూ..ఈ నెల 28న శాస్త్రోక్తంగా బాలాలయంలో విగ్రహాలను ప్రతిష్టిస్తామని తెలిపారు. నీలాచలంపై కోదండ రామాలయం అభివృద్ధి పనులు పూర్తయ్యాక అక్కడ విగ్రహాలను పునః ప్రతిష్టింపజేస్తామన్నారు. అప్పటివరకు బాలాలయంలోనే స్వామివారికి నిత్యపూజలు కొనసాగుతాయని చెప్పారు. -
రామతీర్థంలో కొలువుకు సీతారాములు సిద్ధం
తిరుపతి ఎడ్యుకేషన్: ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాలని విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. శుక్రవారం ఈ విగ్రహాలను విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నారు. శిల్పారామం అభివృద్ధికి రూ. 9.50 కోట్లు సాక్షి, అమరావతి: పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గురువారం రూ.9.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పనులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను నిధులు విడుదల చేసింది. -
రామతీర్థం విగ్రహాలకు తుది మెరుగులు
తిరుపతి ఎడ్యుకేషన్: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో ఇటీవల దుండగులు శ్రీరాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ధ్వంసమైన శ్రీరాముని విగ్రహం స్థానంలో నూతనంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని ప్రతిమలను ప్రతిష్టించేందుకు ఆ జిల్లా దేవదాయ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా విగ్రహాల తయారీకి ఈ నెల 8న టీటీడీ ఉన్నతాధికారులను దేవదాయ శాఖ అధికారులు సంప్రదించారు. అలిపిరిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో ఏఈ మహేందర్‌రెడ్డి పర్యవేక్షణలో స్థపతి మునిశంకర్, మార్కింగ్ స్థపతి మారుతీరావు నేతృత్వంలో శిల్పులు రమేష్, నాగరాజు, సుబ్రమణ్యం ఆచారీ విగ్రహాల తయారీ పనిలో నిమగ్నమయ్యారు. మూలవిరాట్ తయారీకి కంచి నుంచి కృష్ణశిల(బ్లాక్ గ్రానైట్)ను తెప్పించారు. పీఠంతో కలిపి శ్రీరాముని విగ్రహం 3.6 అడుగులు, సీతా, లక్ష్మణుల విగ్రహాలు పీఠంతో కలిపి 3 అడుగులతో మలుస్తున్నారు. గురువారం సాయంత్రానికి ఈ విగ్రహాలు తుదిమెరుగులు దిద్దుకోనున్నాయి. -
కొండ దిగిన కోదండరాముడు
ఒక వైపు వేదపండితుల మంత్రోచ్ఛారణలు... మరోవైపు ప్రాయశ్చిత్త హోమాలు... ఇంకోవైపు పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ సీతా, లక్ష్మణ, ఆంజనేయుని సమేతంగా శ్రీ కోదండరాముడు నీలాచలం నుంచి దిగాడు. ఆగమ పండితులు సంప్రదాయబద్ధంగా హోమాలు జరిపించగా... ఆలయంలోని విగ్రహాలను తొలగించారు. వాటిని దిగువనున్న శ్రీరామస్వామి వారి ప్రధాన ఆలయంలోకి తరలించారు. సాక్షి, విజయనగరం : నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని నీలాచలంపైనున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో గల సీతారామలక్ష్మణుల విగ్రహాల్లో శ్రీరాముడి విగ్రహాన్ని గతనెల 28 వ తేదీ అర్ధరాత్రి ఎవరో గుర్తు తెలి యని దుండగులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ ఘటనపై సిట్ దర్యాప్తు జరుగుతోంది. అయితే ఆ విగ్రహాల స్థానంలో నూతన విగ్రహాలను పునఃప్రతిష్టించాలని ప్రభుత్వం సంకల్పించింది. దానిలో భాగంగా ప్రస్తుతం ఉన్న విగ్రహాలను తొలగించే కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఆలయంలోని మండపంలో ఉదయం 7 నుంచి 10గంటల వరకు ఆగమ పండితులు శాస్త్రోక్తంగా ప్రాయశ్చిత్త హోమాలు నిర్వహించారు. ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రం నుంచి విచ్చేసిన ఆగమ పండితులు వంశీకృష్ణ, ఫణిరామ్, రామతీర్థం అర్చకులు కిరణ్‌కుమార్, పవన్ హోమాలు జరిపించారు. అనంతరం గోమాత తోకకు తాడును కట్టి ఆ తాడు సాయంతో విగ్రహాలను వాటి స్థానాల్లోంచి కదిలించారు. ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలతో పాటు పురాతన లక్ష్మణుడి విగ్రహాన్ని కూడా పక్కకు జరిపారు. అధికారుల పర్యవేక్షణలో తరలింపు శాస్త్ర ప్రకారం కదిలించిన విగ్రహాలను పోలీసులు, సీఐడీ అధికారుల పర్యవేక్షణలో కొండ దిగువనున్న ప్రధాన ఆలయంలోకి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత కలి్పండంతో పాటు అత్యంత గోప్యత పాటించారు. ఇతరులెవరినీ పరిసరాల దరిదాపులకు కూడా రానివ్వలేదు. విగ్రహాలకు ఎలాంటి అపవిత్రత అంటకుండా జాగ్రత్త పడ్డారు. దేవదాయశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని ఈఓ రంగారావు చెప్పారు. ఇదిలా ఉండగా శ్రీకోదండరామస్వామి వారి ఆలయంలో పునఃప్రతిష్టించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానంలో నూతన విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నాటికి విగ్రహాల తయారీ ప్రక్రియ పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. రామతీర్ధం చేరుకున్న తరువాత ఆ విగ్రహాలను ప్రధాన ఆలయంలోని బాలాలయంలో పునఃప్రతిష్టించేందుకు ఆలయ అ«ధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఆలయ ఆధునికీకరణకు సన్నాహాలు కొండపై ఉన్న పురాతన ఆలయాన్ని ఆధునికీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. దీనిలో భాగంగా రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు ఉన్నతాధికారులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆలయ పునఃనిర్మాణానికి, అభివృద్ధికి రూ.3కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించడంతో జిల్లాలోని శ్రీరాముడి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏడాదిలో పూర్తి రాతికట్టడాలతో పూర్తయ్యే ఆలయ పునరి్నర్మాణంలో భాగంగా, మెట్ల మార్గాన్ని సరిచేయడంతో పాటు కొత్త మెట్లు నిర్మిస్తారు. దేవాలయ పరిసరాలు మొత్తం విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు. శాశ్వత నీటి వసతి, కోనేటిని శుభ్రపరచి చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు, ప్రాకార నిర్మాణం, హోమశాల, నివేదన శాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులు జరగనున్నాయి. -
రేపటి నుంచి విగ్రహాల పునఃప్రతిష్ట సన్నాహక పనులు
సాక్షి, అమరావతి: రామతీర్థం శ్రీరామస్వామి వారి ఆలయంలో విగ్రహాల పునః ప్రతిష్ట సన్నాహక కార్యక్రమాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విగ్రహ పునఃప్రతిష్టతో పాటే ఆగమ పండితుల సలహాలతో పురాతన ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. పునః ప్రతిష్టకు ముందు చేపట్టాల్సిన పనులు ప్రారంభించేందుకు దేవదాయ శాఖ అధికారులు సోమవారం ఆలయంలో ప్రత్యేక హోమం నిర్వహించనున్నారు. హోమం అనంతరం సంప్రదాయ బద్ధంగా ఆలయంలోని దేవతామూర్తుల విగ్రహాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసే బాలాలయంలో ఉంచుతారు. ఆలయంలోని గర్భాలయం పాతకాలపు కట్టడం అయినా ఇప్పటికీ పటిష్టంగా ఉండడంతో గర్భాలయ గోడలను అలానే ఉంచుతూ.. లోపలి భాగాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని దేవదాయ శాఖ నిర్ణయించింది. గర్భాలయం ముందు భాగాన ఉన్న మండపం, భక్తులు ప్రదక్షిణ చేసే ప్రాకారం వంటి వాటిని కూడా పూర్తిస్థాయిలో పునర్నిర్మించాలని నిర్ణయించింది. కొండపై ఉన్న ఆలయం వద్ద ఏ పనులు చేపట్టాలన్నా తగిన స్థాయిలో నీటిని అందుబాటులో ఉంచేందుకు యుద్ధప్రాతిపదికన కొండపై నీటి ట్యాంకును కూడా దేవదాయ శాఖ ఏర్పాటు చేయనుంది. కొండపై ఆలయం వద్దకు భక్తులు సులభంగా వచ్చి వెళ్లేందుకు వీలుగా మెట్ల మార్గాన్ని కూడా విస్తరిస్తారు. కొండపై ఆలయాన్ని ఆనుకుని ఉన్న కోనేరును కూడా ఆధునికీకరిస్తారు. ఇదిలా ఉండగా, రామతీర్థం ఆలయంలో పునః ప్రతిష్టించేందుకు శ్రీరాముడి మూలవిరాట్ విగ్రహంతో పాటు సీతమ్మ, లక్ష్మణుడి విగ్రహాలను టీటీడీ శిల్పులు ఈ నెల 23 నాటికి సిద్ధం చేస్తారు. ఆయా కార్యక్రమాల పర్యవేక్షణకు దేవదాయ శాఖ జాయింట్ కమిషనర్ భ్రమరాంబను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఆలయ ఆధునికీకరణపై రేపు మంత్రి సమీక్ష శ్రీరామస్వామి గర్భాలయాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మించాలని ఒకరిద్దరు స్వామీజీలు దేవదాయ శాఖకు సూచన చేసినట్టు తెలిసింది. ఆ సూచనలను ఇతర ఆగమ పండితుల దృష్టికి తీసుకెళ్లే విషయమై దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు సోమవారం శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. -
ఈ కులమతాల ముద్రలెందుకు?
నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. ఆయన దాదాపు 40 సంవత్సరాల నుండి రాజకీయాల్లో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేశారు. ప్రతి పక్ష నేతగా పనిచేశారు. ఇంతటి అనుభవ మున్న వ్యక్తి.. ఏపీలో ప్రస్తుతం సీఐడీ అధిపతిగా ఉన్నవారు ఒక మతానికి చెందిన వ్యక్తి కాబట్టి రామతీర్థం విగ్రహ విధ్వంసం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీఐడీ దర్యాప్తునకు ఆదేశించారని అన్నట్లు 6 జనవరి 2021న మీడియాలో చూశాను. అలాగే హిందువులపై దాడి జరిగితే ఖబడ్దార్ అని కూడా చంద్ర బాబు అన్నారని వార్తలొచ్చాయి. ఆయన అలా అనే బదులు ఏ మతం వారూ మరో మతంవారిపై, వారి మందిరాలపై దాడి చేసినా అది మంచిదికాదు అని చెప్పి ఉండాల్సింది. ఎవరు ఎవ రిపై దాడి చేసినా సహించం అనాల్సింది. అధికారులకు కులాన్ని, మతాన్ని అంటగడితే ఏ అధికారి కూడా చట్టప్రకారం పని చేయలేడు. ఏ అధికారి అయినా విధి నిర్వహణలో అవినీతి, అలక్ష్యానికి పాల్పడినా, లేదా పక్షపాతం చూపినా ఆ అధికారిమీద తప్పకుండా చర్య తీసుకోవాలి. మన సమాజంలో అత్యంత నిజాయితీ పరులు, అత్యంత అవినీతిపరులు అన్ని కులాల్లో, మతాల్లో ఉన్నారు. ఈ రోజు ఒక కులానికి, మతానికి చెందిన వ్యక్తి అధికారంలో ఉండ వచ్చు. రేపు మరో కులానికి, మతా నికి చెందిన వ్యక్తి అధికారంలోకి రావచ్చు. అతడు ఏం చేస్తున్నాడు, పేద ప్రజలకు లాభం చేస్తున్నాడా లేదా? రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూరుతున్నదా లేదా అతడేమైనా అవినీతికి పాల్పడుతున్నాడా? ఎక్కడైనా పక్షపాతం చూపుతు న్నాడా– వాటిని గమనించాలి. పొరపాటు ఉంటే ఖండించాలి. అంతే కానీ, అతని కులాన్ని బట్టి, మతవిశ్వాసాలను బట్టి ఆ వ్యక్తిని అంచనావేయడం చాలా తప్పు. చంద్రబాబు నాయుడి వంటి పరిపాలనా అనుభవం కలిగిన నాయకులు కులభేదాలను ప్రస్తావిస్తూ ఈ విధంగా మాట్లాడితే సమాజం విచ్ఛిన్న మౌతుంది. ప్రజలు అధికారుల పట్ల, న్యాయమూర్తుల పట్ల విశ్వాసం కోల్పోతారు. రాజ్యాంగ వ్యవస్థ మనుగడ పెను ప్రమా దంలో పడుతుంది. కులమత భేదాలు, ఘర్షణలు ఎక్కువై పోతాయి. ఒక చిన్న ఉదాహరణ. మా నాన్నగారు గొప్ప రామభక్తులు. నిరంతరం రామనామం ఆయన పెదాలపై ఉండేది. అమ్మ నిరంతరం పూజలు పునస్కారాలు చేసేది, కానీ ఎంతోమంది ఇతర మతస్తులకు, ఇతర కులాలవారికి మా ఇంట్లో మాతోపాటు భోజనం పెట్టేవారు. ఎంతోమంది పేద విద్యార్థులకు వారు తోడ్పడ్డారు. ఏ రోజూ కుల, మత భేదాలు పాటించలేదు. కాబట్టి నేను అందరిని కోరుతున్నది ఏమిటంటే అధి కారంలో ఉన్నవారికి కులాలకు, మతాలను ఏ పరిస్థితుల్లోనూ ఆపాదించవద్దు. శంకరన్ లాంటి ఐఏఎస్ అధికారి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎంతో శ్రమించారు. ఆదివాసీల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారు.అధికారుల్లో, న్యాయమూర్తుల్లో ఏ కులం వారైనా ఉండ వచ్చు. ఒక అధికారి, న్యాయమూర్తి ఫలానా కులం వ్యక్తి కాబట్టి ఒక కేసులో వాది, ప్రతివాది లేదా ముద్దాయి అతని కులంవాడు కాబట్టి ఆ అధికారి లేదా న్యాయమూర్తి న్యాయం చేయడేమో అని అనుమానిస్తే ఇక ఎవరూ దర్యాప్తు చేయలేదు. ఏ కేసును విచా రించలేదు. ఇలా ఐతే ఈ రాజ్యాంగ వ్యవస్థ కూలిపోతుంది. రేపటి రోజు ఒక విచిత్రమైన పరిస్థితి ఎదురుకావచ్చు. చంద్రబాబు ప్రకటన ఆధారంగా ఒక నేరంలో క్రైస్తవులు గానీ ముస్లింలు గానీ ముద్దాయిలుగా ఉంటే ఏ హిందూ అధికారీ వారిని విచారించగూడదని క్రైస్తవులు లేదా ముస్లింలు డిమాండ్ చేయవచ్చు. అలాగే దళితులు ముద్దాయిలుగా ఉంటే వేరే కులం వారు తమను విచారణ చేయకూడదని డిమాండ్ చేయవచ్చు. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక దేవాలయంలోని పూజారి ఒక స్త్రీని ఇతరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడనే వార్త చూశాము. ఇక నేరం చేసిన వ్యక్తి పూజారి (బ్రాహ్మణుడు) కాబట్టి బ్రాహ్మణ కులానికి చెందిన ఏ అధికారి కూడా ఆ పూజారిని విచారించవద్దంటే ఎలా వీలవుతుంది? ఇలా ప్రతీ కేసులో, ప్రతీ విచారణలో విచారణ చేస్తున్న వారిది ఏ మతం, ఏ కులం, ఆ కేసులోని వ్యక్తులది ఏ కులం అని చూడడం మొదలు పెడితే మన సమాజం విచ్ఛిన్నమౌతుంది. కుల, మత ద్వేషాలు పెరుగు తాయి. జస్టిస్ ఒ. చిన్నపరెడ్డి, జస్టిస్ కృష్ణయ్యర్, జస్టిస్ రంగ నాథ్ మిశ్రా, జస్టిస్ రామస్వామి, జస్టిస్ పి. వెంకటరామిరెడ్డి లాంటి విశిష్ట న్యాయమూర్తులు ఏ రోజైనా కుల మతాల గురించి ఆలోచించారా– ఏనాడైనా వారు విచారణ క్రమంలో పక్షపాతం చూపారా; అన్ని కులాల నుంచి వచ్చిన వారిలో ఎంతో నిజాయితీ, నిబద్ధత కల్గిన అధికారులు, న్యాయమూర్తులు ఉంటారు. బ్రాహ్మణకులంలో పుట్టిన గురజాడ అప్పారావు భర్తలు చనిపోయిన స్త్రీలకు మరో వివాహం చేసుకొనే హక్కు ఉండాలని స్త్రీలకు విద్య కావాలని పోరాడలేదా? అంబేడ్కర్ స్త్రీలకు సమాన ఆస్తిహక్కు ఉండాలని వాదించలేదా?అలాగే బ్రాహ్మణుడైన రామకృష్ణ పరమహంస, కాయస్త కులానికి చెందిన వివేకానందుడిని ప్రథమ శిష్యునిగా చేర్చు కోలేదా? పోతులూరి వీరబ్రహ్మం.. దూదేకుల సిద్ధయ్యను తన ప్రథమ శిష్యుడిగా తీర్చిదిద్దలేదా? షిరిడీసాయి అన్ని కులాల వారిని, మతాలవారిని సమానంగా చూడలేదా? మహాత్ములు ఎవ్వరూ ఏ మతం వారైనా ఏ కులం వారైనా కులమత భేదాలను పాటించలేదు. ఒకవైపు ఎందరో కులాంతర వివాహాలు చేసుకుంటున్న ఈ రోజుల్లో వ్యక్తులందరికీ.. ముఖ్యంగా అధికారులకు కులం అంట గట్టడం విద్వేషాలను పెంచే యత్నంగా భావించాల్సి వస్తుంది. ఇక ముందైనా మన రాజకీయ నాయకులు కాస్త విజ్ఞతతో, ఇంగితజ్ఞానంతో మాట్లాడతారని ఆశిద్దాం. -జస్టిస్ చంద్రకుమార్ వ్యాసకర్త విశ్రాంత న్యాయమూర్తి మొబైల్ : 79974 8486 -
ఏ మతం హింసను ప్రేరేపించదు: మత పెద్దలు
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలన చూసి ఓర్వ లేక ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆయన శుక్రవారం విజయవాడలో జరిగిన సర్వమత పెద్దల సమావేశంలో మాట్లాడారు. అధికారం వచ్చిననాటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని చెప్పారు. ప్రజారంజక పాలనను అడ్డుకోవాలని దుష్టశక్తులు కుట్రలు చేస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేందుకు కొందరు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.(చదవండి: 'బీజేపీ జై శ్రీరాం కాకుండా చేసిన అభివృద్ధి చెప్పాలి') ‘‘రాష్ట్రంలో 30 లక్షలమందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.దుర్మార్గపు ఆలోచనలతోనే ఆలయాలపై దాడులు చేస్తున్నారు.సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. జీవో తెచ్చి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసిందని’’ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.(చదవండి: ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ) సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశం.. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ, ఏ మతం కూడా హింసను ప్రేరేపించదన్నారు. సర్వమానవ సౌభ్రాతృత్వం మన సందేశమని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని.. దేవుని దృష్టిలో అందరూ సమానులేనన్నారు. మానవ శాంతి కోసమే మతం అని మత పెద్దలు పేర్కొన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి వాతావరణం నెలకొంది. ఎక్కడా మతపరమైన విద్వేషాలు, మత కల్లోలాలు లేని ఏకైక రాష్ట్రం మనది. అన్ని మతాల వారు కలిసిమెలసి జీవిస్తున్నారు. ఎక్కడా మతపరమైన మెజార్టీ, మైనారిటీ అన్న భావన ప్రజల్లో లేదు. మారుమూల ప్రాంతాల్లోని ఆలయాల్లో ఇటీవల ఆందోళన కలిగిస్తున్న ఘటనలు, విష పూరిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని’’ మత పెద్దలు తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు , విమర్శలు చేయడం తగదన్నారు. -
‘బాబు మత రాజకీయాలు.. పతనం తప్పదు..’
సాక్షి, విజయవాడ: దేవుడితో రాజకీయం చేస్తే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి మరింత పతనం తప్పదని ఏఐసీసీ చైర్మన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా హెచ్చరించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వెయ్యి కాళ్ల మండపాన్ని కూల్చారని, అలిపిరిలో దేవుడు ఎలా బుద్ధి చెప్పాడో తెలుసు. ఆయన పాలనలో విజయవాడలో గుళ్లను కూలగొట్టారు. అందుకే ఈ రోజు ఇంత పతనమయ్యారు. అయినా చంద్రబాబుకి బుద్ధి లేకుండా ఇప్పుడు మత రాజకీయాలు మొదలుపెట్టారు. సీఎం జగన్.. దేవాలయాల్లో భద్రత కోసం 20 వేల సీసీ కెమెరాలు పెట్టారు. చంద్రబాబు తన పాలనలో ఇలా ఎందుకు చెయ్యలేదు. అయ్యప్ప మాల వేస్తే మద్యం ఆదాయం తగ్గిపోతుందన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. (చదవండి: సీఎం జగన్ కీలక నిర్ణయాలు..) ‘‘చంద్రబాబు హయాంలో ఆలయాలను కూల్చి టాయిలెట్లు కట్టారు. డీజీపీ మతం గురించి మాట్లాడుతున్న చంద్రబాబు.. గతంలో సీపీగా పెట్టలేదా?.ఇప్పడు పనిచేస్తున్న అధికారులంతా చంద్రబాబు హయాంలో ఉన్నవారే కదా?. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను కొత్తగా తెచ్చారా?. చంద్రబాబు చేయని ఆలయాల అభివృద్ధి, నిర్మాణాలను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని రోజా అన్నారు.(చదవండి: రహదారుల అభివృద్ధికి 6400 కోట్లు) -
మతాలతో ఆటలా..: సజ్జల రామకృష్ణారెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రతిపక్షాలు మతాలతో ఆడుకుంటున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రతిపక్షాలు ప్రమాదకర రాజకీయాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘‘ఎవరూ లేని ప్రదేశాల్లో అర్ధరాత్రి విధ్వంసాలకు పాల్పడుతున్నారు.. సున్నితమైన అంశాలపై మేం ఎప్పుడూ ఆందోళన చేయలేదు.రామతీర్థం ఘటన పథకం ప్రకారమే చేయించారు. ఉన్మాద స్థాయిలో ఉన్నవారే విధ్వంసానికి పాల్పడ్డారు. చంద్రబాబు హయాంలో విజయవాడలో ఆలయాలను కూల్చేశారు. పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్‌తో 29 మంది చనిపోయారు. సదావర్తి భూముల సంఘటన మర్చిపోయారా?. దేవుడి విగ్రహాలను పగలగొడితే ఎవరికి లాభం?’’ అని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. (చదవండి: ‘లోకేష్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు’) మతపరమైన అజెండా ఉన్న బీజేపీ కూడా చంద్రబాబులా స్పందించడం లేదు. బీజేపీకి దగ్గరయ్యేందుకే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు మతం ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారని, ఇలాంటి నీచ రాజకీయాలను సీఎం జగన్ సహించరని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినచర్యలు తీసుకుంటామన్నారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా పనిచేస్తున్నామని, సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి నిప్పులు చెరిగారు. (చదవండి: లోకేష్ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?) -
‘లోకేష్‌కు ఆ రెండింటికి తేడా తెలియదు’
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ప్రభుత్వ సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేత చంద్రబాబు, లోకేష్ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరి మడికి, చేపల చెరువుకు తేడా తెలియని వ్యక్తి లోకేష్ అని ఎద్దేవా చేశారు. ‘‘మహానేత వైఎస్సార్, ఆయన తనయుడు సీఎం జగన్ ప్రజలకు శాశ్వతంగా అందించే పథకాలెన్నో తెచ్చారు. పదిహేనేళ్లు పరిపాలించిన చంద్రబాబు.. ప్రజలకు గుర్తుండిపోయే ఒక్క పథకం కూడా తీసుకురాలేదని’’ దుయ్యబట్టారు.(చదవండి: త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’) కుల మతాల మధ్య చిచు పెట్టే ధోరణి నుంచి చంద్రబాబు బయటకురావాలని శ్రీకాంత్‌రెడ్డి హితవు పలికారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన ఆర్గనైజింగ్ కమిటీ ద్వారానే అలయాలపై దాడులు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. పూజ సమయంలో కూడా చంద్రబాబు చెప్పులు వదిలిపెట్టలేదని ఆయన నిప్పులు చెరిగారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) -
త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. ‘‘వాటికన్ సిటీకి, అమరావతికి సంబంధం ఏంటి?. చంద్రబాబు అమరేశ్వరుని భూములు కూడా దోచుకున్నారు. మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు పవిత్రమైన హిందువైతే విజయవాడలో ఆలయాలను ఎందుకు కూల్చారు?. ఆలయాలను కూల్చినప్పుడు చంద్రబాబుకు హిందువులు గుర్తురాలేదా? అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ దుయ్యబట్టారు. (చదవండి: పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్) -
రామతీర్థంలో సెక్షన్ 30 అమలు
సాక్షి, విజయనగరం : రామతీర్థం ఆలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఆలయ సమీపంలో సభలు, సమావేశాలకు అనుమతిలేదని డీఎస్పీ సునీల్ తెలిపారు. రామతీర్థంలో సెక్షన్ 30 అమలుచేస్తున్నామని, ఎవరూ చట్టాలను అతిక్రమించవద్దని, చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విగ్రహం ధ్వంసం దర్యాప్తుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కోవిడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నాయని తెలిపారు. రామతీర్థం వైపు ఎవరూ వెళ్లకుండా రాజపులోవ జంక్షన్లో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మరోవైపు రామతీర్థంలో సీఐడీ విచారణ ప్రారంభమైంది. తొలుత సమాచారం వెలుగులోకి వచ్చిన విధానాన్ని సీఐడీ అధికారులు సేకరిస్తున్నారు. కాగా రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించిన విషయం తెలిసిందే. ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. -
అన్నింటా విఫలమైన అశోక్ గజపతిరాజు
సాక్షి ప్రతినిధి, విజయనగరం: వేల కోట్లు దానం చేసిన రాజవంశంలో పుట్టినా... రామతీర్ధంలో రాముడి ఆలయానికి కనీసం కరెంటు ఇవ్వలేకపోయారు. తాత ముత్తాతల గొప్ప తనాలు చెప్పుకుంటూ... గుడిలో ఒక సీసీ కెమెరా పెట్టించలేకపోయారు. చరిత్రను దాచేసి నీతిమంతులమని చెప్పుకుంటూ... జనం చేత జేజేలు కొట్టించుకున్నారు. ఇప్పుడు వాస్తవాలు తెలుస్తున్నాయి. దర్పం, ఆర్భాటాలను చూసి మోసపోయిన నగరవాసులు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. ఆ రాజరిక వారసత్వ రాజకీయానికి చరమగీతం పాడుతున్నారు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడించి పరాజితునిగా కూర్చోబెట్టారు. ఇప్పుడు కనీసం తాను అనువంశిక ధర్మకర్తగా ఉన్న గుడిలో రాముడిని కూడా కాపాడుకోలేకపోయారు. ఇదీ టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్‌గజపతిరాజు పరిస్థితి. అలంకారానికే పదవులు... కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు 1978 నుంచి జనతాపార్టీ, తెలుగుదేశం పార్టీలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ పదవులను అనుభవించారు. ఎన్టీ రామారావు నుంచి, చంద్రబాబు నాయుడు వరకూ టీడీపీలో ప్రతి ఒక్కరూ అశోక్‌కు పెద్దమనిషి హోదా ఇచ్చి గౌరవించినా... తన పదవీ కాలంలో ప్రజ లకుగానీ, తాను నివశిస్తున్న విజయనగరానికి గానీ ఏమీ చేయలేకపోయారన్న అపప్రథ మూటగట్టుకున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉపాధి కల్పించే రెండు ప్రధాన జూట్‌మిల్లులు మూతపడినా పట్టించుకోలేదు. 12వేల కార్మి క కుంటుంబాలు రోడ్డున పడ్డా వదిలేశారు. రాష్ట్రంలోని 12 జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలున్నా ఇక్కడ ఏర్పాటుకు కృషి చేయలేదు. జిల్లాకు కేటాయిస్తామన్న మెడికల్ కళాశాల కోసం స్థలం ఇస్తామని చెప్పి ఆ తర్వాత అదే స్థలాన్ని తమ పార్టీకే చెందిన వ్యక్తికి ధారాదత్తం చేశారు. విజయనగర వాసుల తాగు నీటి సమస్య పరిష్కరించడంలో విఫలమయ్యారు. అభివృద్ధికి అడ్డంపడుతున్నా మౌనమే... 2015 జూలై నెలలో సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉన్న విజయనగరం మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా, స్థానిక టీడీపీ పాలకులు తమ పదవులు కాపాడుకునేందుకు ఆ ఉత్తర్వులను అమల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. వారి పదవీకాలం పూర్తయ్యేంత వరకు ఉత్తర్వులను అబియన్స్‌లో ఉంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి పట్టణాభివృద్ధిని అడ్డుకున్నారు. దానిపైనా అశోక్ స్పందించలేదు. పట్టణాభివృద్ధి గురించి ఆలోచించలేదు. (చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) 426 కిలోమీటర్ల చిన్నా, పెద్ద కాలువలున్న నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయలేకపోవడంతో చిన్నపాటి వ ర్షం కురిసినా ప్రధాన జంక్షన్లన్నీ ముంపుబారిన పడు తున్నాయి. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని పూర్తి చేయలేకపోయారు. పైగా తన మంత్రిత్వ శాఖకు సంబంధించిన సంస్థ టెండర్ వేస్తే దానిని తన విచక్షణాధికారంతో క్యాన్సిల్ చేయించారు. చివరికి ఎన్నికల ముందు హడావుడిగా విమానాశ్ర యం నిర్మించేస్తున్నామంటూ బిల్డప్పులిచ్చి శంకు స్థాపన చేస్తున్నా దానిని ఆపలేదు. ధర్మకర్తగా విఫలమై... అశోక్ చైర్మన్‌గా ఉన్న రామతీర్థంలో కోదండ రామస్వామి ఆలయంలో జరిగిన దుర్ఘటనకు ఆయన చేసిన తప్పిదాలే కారణాలుగా కనిపిస్తున్నాయి. బోడికొండపై ఉన్న ఆలయాన్ని ఇన్నాళ్లూ ఆయన పట్టించుకోలేదు. హుద్‌హుద్ తుఫాన్‌కు కూలిన రాతిగోడను కూడా పునరుద్ధరించలేకపోయారు. కనీసం విద్యుత్ సౌకర్యాన్నయినా కల్పించలేదు. సీసీ కెమెరాలు పెట్టించలేదు. అవే ఉంటే రాముడి విగ్రహం శిరస్సు ఖండించిన దోషులు ఈపాటికే సులభంగా దొరికేసేవారు. ఆ అవకాశం లేకుండా చేసినందునే చైర్మన్ పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను తొలగించింది. ఈ వైఫల్యాలన్నింటినీ తొక్కిపెట్టి, కేవలం రాష్ట్రమంత్రి మాట్లాడిన ఒక పదాన్ని తప్పుబట్టి అనవసర రాద్ధాంతం చేయిస్తున్నారు. ఈ మొత్తం పరిణామాల వల్ల పోయిన గౌరవం నిలబెట్టుకునేందుకు పార్టీ లోనూ, ప్రజల్లోనూ తన ఉనికి చాటుకునేందుకు కులం కార్డును ఆశ్రయించకతప్పలేదు. పార్టీలోనూ చిన్నచూపే... దశాబ్దాలుగా రాజకీయ ఆశ్రయమిచ్చిన తెలుగుదేశం పార్టీని కూడా పెద్దగా పట్టించుకోవడం లేదనేది ఇటీవల జరిగిన సంఘటనలు రుజువు చేస్తున్నాయి. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు వేరుకుంపట్లు పెట్టుకోవడం ఓ ఉదాహరణ. కేవలం తానూ, తన కుమార్తె, కొందరు అనుచరులే అని గిరిగీసుకున్న ఆయనకు వ్యతిరేకంగా విజయనగరంలో టీడీపీకి రెండో కార్యాలయం ఏర్పాటయ్యింది. దానిని అధిష్టానం దృష్టికి అనుచరుల ద్వారా తీసుకెళ్లినా ఏమీ ఒరగలేదు. సరికదా బోర్డు తీసేసినట్టే తీసి మరలా పెట్టడం కొసమెరుపు. రెండు రోజుల క్రితం చంద్రబాబు జిల్లాకు వచ్చినపుడు తన బంగ్లాకు తీసుకువెళ్లాలని ప్రయత్నించి, అక్కడా విఫలమయ్యారు. రాజకీయ వారసురాలిగా కుమార్తెను ఎమ్మెల్యేగా బరిలోకి దింపి గెలిపించుకోలేక తండ్రిగానూ ఓడిపోయారు. -
రామతీర్థం ఘటనపై సీఐడీ విచారణ
సాక్షి, అమరావతి: రామతీర్థం ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఐడీ విచారణకు ఆదేశించారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇటీవల ఆలయాల్లో చోటుచేసుకున్న ఘటనలపై పోలీస్, దేవదాయ శాఖల అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, దేవదాయ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్, ప్రత్యేక కమిషనర్ అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో వెలంపల్లి మాట్లాడుతూ.. రామతీర్థం ఘటనలో కొందరు అనుమానితులను పోలీసులు గుర్తించారని, ఒకట్రెండు రోజుల్లో దోషులను పట్టుకునేలా విచారణ కొనసాగుతోందన్నారు. పూర్తి హంగులతో ఆలయం ఆధునికీకరణ ఎటువంటి వసతులు లేని రామతీర్థం ఆలయాన్ని పూర్తిగా ఆధునికీకరించాలని సీఎం జగన్ ఆదేశించినట్టు మంత్రి చెప్పారు. ఇప్పటికే ఆలయ డిజైన్లు ప్రాథమికంగా తయారు చేయించామన్నారు. ఒకట్రెండు రోజుల్లో విగ్రహ పునఃప్రతిష్ఠ తేదీలను ఖరారు చేస్తామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను సైతం తిరిగి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని చెప్పారు. ర్యాలీ విరమించుకోవాలని విజ్ఞప్తి రామతీర్థం అంశం సున్నితంగా మారిన నేపథ్యంలో బీజేపీ, ఇతర పార్టీలు మంగళవారం తలపెట్టిన ర్యాలీని విరమించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఘటనలపై ఎవరైనా అభిప్రాయం చెప్పవచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఎలాంటి చర్యలకైనా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అది టీడీపీ కార్మిక సంఘం కట్టుకున్న గుడి విజయవాడ బస్టాండ్‌లో ఘటన జరిగిన ఆలయం టీడీపీ అనుబంధ కార్మిక సంఘం సభ్యులు కట్టుకున్నదని.. అందులో మట్టి విగ్రహాలను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్నారని మంత్రి వివరించారు. ఆ ఆలయానికి, దేవదాయ శాఖకు, ప్రభుత్వానికి సంబంధం లేదని.. గుడి భద్రతను పట్టించుకోవాల్సిన టీడీపీ దానిని ఎందుకు పట్టించుకోలేదో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో సుబ్రహ్మణ్యస్వామి విగ్రహ ధ్వంసంపైనా సీఐడీ విచారణకు ఆదేశించామని.. ఆ ఆలయం కూడా టీడీపీ నేత గన్ని కృష్ణ నిర్వహణలో ఉందని అన్నారు. నిందితులకు శిక్షలు పడ్డాయ్ వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక దేవదాయ శాఖకు సంబంధించి 8 ఆలయాల్లో దుశ్చర్యలు చోటు చేసుకున్నాయని.. వాటిలో కొందరు నిందితులను పోలీసులు పట్టుకున్నారని చెప్పారు. ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉండే వాటితో కలిపి మొత్తం 31 ఆలయాలపై దాడులు జరిగాయని, గుప్త నిధుల కోసం తవ్వకాలు, హుండీ చోరీలు వంటి వాటితో కలిపి పోలీసులు 88 కేసులు నమోదు చేశారని వివరించారు. ఆ కేసుల్లో 159 మందిని అరెస్ట్ చేశారని, వారిలో కొందరికి రెండేళ్ల శిక్ష పడిందని, మరికొందరు రిమాండ్‌లో ఉన్నారని వివరించారు. ప్రైవేట్ ఆలయాల్లో భద్రతపైనా దృష్టి గడచిన రెండేళ్లలో రాష్ట్రంలోని 31 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు దేవదాయ శాఖ గుర్తించింది. వీటిలో 23 ఆలయాలు ప్రైవేట్ వ్యక్తుల ఆదీనంలో ఉన్నట్టు తేల్చారు. దేవదాయ శాఖ పరిధిలోని 8 ఆలయాల్లో వివిధ ఘటనలు చోటు చేసుకున్నట్టు అధికారులు తేల్చారు. ఈ నేపథ్యంలో మారుమూల ఉండే ప్రైవేట్ ఆలయాల భద్రతపై దేవదాయ శాఖ, పోలీసులు శాఖ దృష్టి పెట్టాయి. ప్రైవేట్ ఆలయాల భద్రత విషయంలో ఆలయ నిర్వహక కమిటీలు సమన్వయంతో వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. పోలీసు స్టేషన్ల వారీగా ప్రైవేట్ ఆలయాల నిర్వహకులను పిలిపించి మాట్లాడే ప్రక్రియను పోలీసులు మొదలు పెట్టారు.