రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం: ఎస్పీ | SP Raja kumari Comments Over Ramatheertham Idol Desecration | Sakshi
Sakshi News home page

రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం: ఎస్పీ

Published Sat, Jan 2 2021 12:46 PM | Last Updated on Sat, Jan 2 2021 3:39 PM

SP Raja kumari Comments Over Ramatheertham Idol Desecration - Sakshi

సాక్షి, విజయనగరం: రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్‌జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది.

ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘29న రామతీర్ధంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆ ముందు రోజు అంటే 28న విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.  ఈ ఘటనలో 20 మందిని విచారిస్తున్నాం. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రామతీర్ధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.(చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement