Raja Kumari
-
జవాన్ పాటకు మెగాస్టార్ డ్యాన్స్.. పార్టీలోనే హైలైట్!
మెగాస్టార్ చిరంజీవి.. తన నటనకే కాదు డ్యాన్స్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చాలా సినిమాల్లో ఆయన స్టెప్పులు ఎంతో ఫేమస్ అయ్యాయి. 68 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు బాస్. తాజాగా ఈయన దీపావళి పార్టీలో కాలు కదిపాడు. షారుక్ ఖాన్ జవాన్ సినిమాలోని పాటకు జోష్‌తో స్టెప్పులేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెట్టింపు జోష్‌తో చిందేసిన మెగాస్టార్ ప్రముఖ ఇండియన్ ర్యాపర్ రాజకుమారి జవాన్ చిత్రంలోని టైటిల్ సాంగ్ ఆలపిస్తుండగా మెగాస్టార్ వేసిన స్టెప్పులు పార్టీలోనే హైలైట్‌గా నిలిచాయి. రాజకుమారి ఎంత జోష్‌గా పాట పాడుతుంటే అంతకు రెట్టింపు జోష్‌తో చిరు డ్యాన్స్ చేశాడు. రామ్‌చరణ్ తండ్రిని ఎంకరేజ్ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన జనాలు ఈ వయసులో కూడా ఆయన ఎంత ఉత్సాహంతో డ్యాన్స్ చేస్తున్నారో అని కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్ స్వాగ్‌కు ఫిదా అయిపోతున్నారు. చిరు ఇంట పార్టీ ఇంతకీ పార్టీ జరిగింది మరెక్కడో కాదు.. మెగాస్టార్ ఇంట్లోనే! క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన తొలి దీపావళి పండగ కావడంతో ఎంతో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ పార్టీకి స్టార్ హీరోలు మహేశ్‌బాబు, వెంకటేశ్, ఎన్టీఆర్‌తో పాటు మంచు లక్ష్మి తదితరులు విచ్చేశి సందడి చేశారు. View this post on Instagram A post shared by Raja Kumari (@therajakumari) చదవండి: ప్రియుడిపై హీరోయిన్ ముద్దుల వర్షం, ఫోటోలు వైరల్ -
ఐ యామ్ రెబల్
బాయ్స్.. ఈ ‘ఉమెన్స్ డే’ కి అమ్మాయిలు పాడబోయే ఒక కొత్త సాయుధ గీతాన్ని మీ వీధి మైక్ లో నేషనల్ యాంథమ్ గా వినేందుకు సిద్ధంగా ఉండండి. చూస్తుంటే పాప్ గాయని రాజకుమారి సృష్టించిన ఈ సరికొత్త ‘ఐ యామ్ రెబల్..’ ట్రాక్ పురుషాధిక్యాన్ని అవనతం చేయబోతున్నట్లే ఉంది. ఇండిపెండెన్స్ డే కి ‘మా తుఝే సలామ్’, వినాయక చవితికి ‘జై జై గణేశా’ వినిపించినట్లుగా ఉమెన్స్ డే కి ఇక పై.. ‘ఐ యామ్ రెబెల్’ మార్మోగవచ్చు. ఇదొక జెండర్ ఈక్వాలిటీ జాతీయగీతం అనుకోండి!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం! తెలుగులో ఏమిటి? ఇది తెలుగే కదా! పోనీ తేలిగ్గా ఏమిటి? ‘ఇది నా రోజు. దిస్ ఈజ్ మై డే!’ ఎంత సింపుల్‌గా ఉంది. కరెక్ట్ అర్థం కూడా. ప్రతి‘ఉమెన్స్ డే’కి మనకు వినిపించే మాటలు.. స్త్రీ సాధికారత, స్త్రీ పురుష సమానత్వం. మరి ఆ మాటలకు అర్థం ఏమిటి? అదే.. తేలికైన భాషలో ఎలా చెప్తాం? పాప్ సింగర్ రాజా కుమారి అయితే చక్కగా, అబ్బాయిలకు అర్థమయ్యేలా చెబుతారు. అబ్బాయిలకా! అమ్మాయిలకు కదా అర్థం కావలసింది. కాదు. అబ్బాయిలకే. స్త్రీ సాధికారతకు, స్త్రీ పురుష సమానత్వానికి రాజా కుమారి చెబుతున్న అర్థం.. ‘ఐ యామ్ రెబల్’. అదే మాటను ఆవిడ కియారా అద్వానీ, బాణి జె లతో కలిసి పాటగా చెబుతున్నారు. ఆటగా చెబుతున్నారు. ఆ పాట, ఆట ఉన్న వీడియో ట్రాకే.. ఐ యామ్ రెబల్. మంగళవారం ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో విడుదల అయింది. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఈ ట్రాక్‌ను విడుదల చేశారు రాజా కుమారి. ఆ హిప్–హాప్ ట్రాక్ ఇప్పుడు అమ్మాయిల చేత ‘ఐ యామ్ రెబల్’ అంటూ సాయుధ గీతం పాడిస్తోంది. ఫెమినిస్టు ఉద్యమానికి రాగల కొద్ది రోజుల్లోనే ఈ ట్రాక్ ఒక సిగ్నేచర్ సాంగ్ అయినా కావచ్చు. స్వాతంత్య్ర దినోత్సవానికి.. ‘మా తుఝే సలాం’, వినాయక చవితికి.. ‘జై జై గణేశా..’, ఇప్పుడిక మార్చి ఎయిత్కి ‘ఐ యామ్ రెబల్’!! అంతుందా? ఉంది. ఓసారి ఆ వీడియో చూడండి. 2 నిముషాల 11 సెకన్లు. అందులో మీకు మీరు కనిపిస్తారు. (బాయ్స్.. మీరు కాదు). అమ్మాయలూ.. మీరెలానైతే, ఎంతగానైతే దూకుడు గా ఉండాలనుకుంటారో.. అలాగే మీ ప్రతిరూపం అందులో కనిపిస్తుంది. పాడింది రాజా కుమారి. రాసింది రాజా కుమారి. ఆమె భావాలకు ఫీచరింగ్ ఇచ్చింది కియారా అద్వానీ. మ్యూజిక్ దంచేసింది.. అవును, దంచుడే.. డీజే సా! సంకేత్ అర్జున్వాడే. కియారాతో పాటు చిన్న స్లిప్‌గా వి.జె.బాణి కూడా జర్రున జారి వెళతారు. మొత్తం ముగ్గురమ్మాయిల తీన్మార్! రాజా కుమారి అసలు పేరు శ్వేత. తను ఈ సాంగ్‌ని హిందీలో.. ‘నా ఇష్టం వచ్చినట్లు నేనుంటాను. నేను రెబెల్’ను అని రాశారు. శ్వేత ర్యాపర్, సింగర్, సాంగ్ రైటర్. ఇక రెండో అమ్మాయి కియా అద్వాని. బాలీవుడ్ నటి. మూడో అమ్మాయి బాణి.. వీజే, మోడల్, టెలివిజన్ హోస్ట్. సమాజంలో స్త్రీలు, ఆడపిల్లల పట్ల ఏవైతే పురుషాధిక్య భావాలు ఉన్నాయో వాటిని ఈ ‘ఐ యామ్ రెబల్’లో ప్రశ్నించారు, ధిక్కరించారు, వెక్కిరించారు.. వీళ్లు ముగ్గురూ. ఇంటర్నేషల్ ఉమెన్స్ డేకి వీధి వీధిలో మోగాల్సిన, మార్మోగాల్సిన స్త్రీవాద జాతీయ గీతం అని మీకు అనిపిస్తే కనుక ఆశ్చర్యం లేదు. అంతగా గర్ల్ పవర్‌ను దట్టించి వదిలారు. పాటను లాస్ ఏంజెలిస్‌లో కొంత, ముంబైలో కొంత షూట్ చేశారు. రాజా కుమారి, కియారా, వి.జె. బాణితో పాటు మరికొందరు అమ్మాయిలు కూడా రెబలియన్లుగా కనిపించి, కవ్వించి, మెరుపులా మాయమైపోతారు. రాజా కుమారి (శ్వేత) -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించం: ఎస్పీ
సాక్షి, విజయనగరం: రామతీర్ధం ఘటనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే సహించమని ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు. విచారణలో పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా రామతీర్థం బోడికొండపై ఉన్న కోదండ రామాలయంలో ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు శ్రీరాముని విగ్రహం శిరస్సు తొలగించిన విషయం విదితమే. ఈ దుశ్చర్యపై తీవ్రంగా స్పందించిన ప్రభుత్వం.. డీఐజీ రంగారావు, ఎస్పీ రాజకుమారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. దేవదాయశాఖ ఆర్జేసీ భ్రమరాంబను విచారణాధికారిగా నియమించింది. ఈ క్రమంలో విచారణ చేపట్టిన పోలీసు బృందాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఎస్సీ రాజకుమారి మాట్లాడుతూ.. ‘‘29న రామతీర్ధంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే ఆ ముందు రోజు అంటే 28న విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 20 మందిని విచారిస్తున్నాం. రాజకీయ పార్టీలు సంయమనం పాటించాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. ఇక రాజకీయ నాయకుల పర్యటనల నేపథ్యంలో రామతీర్ధం వద్ద భారీగా పోలీసులను మోహరించారు.(చదవండి: అయ్యో... రామ‘చంద్ర’!) -
సరిహద్దులో తనిఖీలు చేయండి
బంట్వారం: కర్ణాటక సరిహద్దులోని తొర్మామిడి శివారులో ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేయాలని జిల్లా ఎస్పీ రాజకుమారి పోలీసులకు సూచించారు. శుక్రవారం ఆమె బంట్వారం పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. పెండింగ్ రికార్డులను, ఫైళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజకుమారి విలేకరులతో మాట్లాడారు. వార్షిక తనిఖీల్లో భాగంగానే పీఎస్‌ను సందర్శించినట్లు తెలిపారు. బంట్వారం ఠాణా పరిధిలో 2012లో 86 కేసులు నమోదవగా 7 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గతేడాది 109 కేసులకు గాను 11 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు. ఈఏడాది ఇప్పటివరకు 92 కేసులు నమోదవగా 32 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఎస్పీ వివరించారు. 22 కేసులు లోక్‌అదాలత్‌లో పరిష్కారమయ్యాయని తెలిపారు. తెలంగాణ- కర్ణాటక సరిహద్దులో ఉన్న తొర్మామిడి శివారులో మఫ్టీలో నిత్యం వాహనాల తనిఖీలు చేయాలని ఎస్పీ ఈసందర్భంగా మోమిన్‌పేట సీఐ రంగాను ఆదేశించారు. వాహనాల తనిఖీలతో చోరీలను నివారించవచ్చని చెప్పారు. గతేడాదితో పోలిస్తే బంట్వారం పోలీస్‌స్టేషన్ పరిధిలో నేరాలు, ఆత్మహత్యలు, రోడ్డుప్రమాదాలు తగ్గిపోయాయని ఆమె వివరించారు. రాంపూర్, తొర్మామిడి, మోత్కుపల్లి, బార్వాద్ తదితర గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి 4 కేసులు ఇంకా దర్యాప్తులో ఉన్నాయని తెలిపారు. ఓ గ్యాంగ్ ట్రాన్స్ఫార్మర్ల చోరీకి పాల్పడుతున్నట్లు తాము గుర్తించామని ఎస్పీ రాజకుమారి చెప్పారు. సదరు గ్యాంగ్ ఆట కట్టించేందుకు ఓ పోలీస్ బృందం దర్యాప్తు చేస్తోందన్నారు. సిబ్బంది కొరతతో కొంత ఇబ్బంది ఏర్పడుతుందని తెలిపారు. స్థానిక పోలీస్ క్వార్టర్స్‌లో మంచి నీటి సమస్య ఉన్నట్లు గుర్తించామని ఆమె అన్నారు. బోరు వేయడానికి కావల్సిన బడ్జెట్ కోసం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలు పంపించనున్నట్లు ఎస్పీ వివరించారు. స్థానిక సిబ్బంది పనితీరుపై బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. అంతకు ముందు ఎస్పీ రాజకుమారి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో డీఎస్పీ స్వామి, సీఐ రంగా, స్థానిక ఎస్ఐ రవీందర్ సిబ్బంది ఉన్నారు. -
ఊరేగింపులు, ర్యాలీలు నిషేధం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: ఈనెల 16 వరకు ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతులు లేవని జిల్లా ఎస్పీ రాజకుమారి తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. సోమవారం ఎస్పీ వికారాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌం టింగ్‌ను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. వికారాబాద్ పట్టణంలో ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై 10:30 గంటలకు ముగిసిందని ఎస్పీ పేర్కొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అప్రమత్తమై బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని ఆమె చెప్పారు. ఈనెల 16 తర్వాత అనుమతులు పొంది ర్యాలీలు నిర్వహించుకోవచ్చని ఎస్పీ తెలిపారు. వికారాబాద్ ఎన్నికల అధికారి, సబ్ కలెక్టర్ అమ్రపాలి మాట్లాడుతూ.. వికారాబాద్‌లోని 27 వార్డులకు కౌం టింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పారు. కౌం టింగ్‌కు సహకరించిన అధికారులకు, నాయకులకు ఆమె అభినందనలు తెలిపారు. నెలకు పైగా ఉత్కం ఠతో ఎదురు చూసిన మున్సిపల్ ఫలితాలు వెలువడడంతో టెన్షన్‌కు తెరపడింది. అంతా సవ్యంగా జరగడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.