జవాన్‌ పాటకు మెగాస్టార్‌ డ్యాన్స్‌.. పార్టీలోనే హైలైట్! | Chiranjeevi dance to Jawan song with Raja Kumari at Diwali party - Sakshi
Sakshi News home page

Chiranjeevi: పార్టీలో స్టెప్పులేసిన చిరంజీవి.. 68 ఏళ్ల వయసులో ఆ స్వాగ్‌ ఏంటి బాసూ..

Published Wed, Nov 15 2023 10:42 AM | Last Updated on Wed, Nov 15 2023 10:54 AM

Chiranjeevi Dance to Jawan Song at Diwali Party - Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి.. తన నటనకే కాదు డ్యాన్స్‌కు కూడా చాలామంది ఫ్యాన్స్‌ ఉన్నారు. చాలా సినిమాల్లో ఆయన స్టెప్పులు ఎంతో ఫేమస్‌ అయ్యాయి. 68 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటూ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు బాస్‌. తాజాగా ఈయన దీపావళి పార్టీలో కాలు కదిపాడు. షారుక్‌ ఖాన్‌ జవాన్‌ సినిమాలోని పాటకు జోష్‌తో స్టెప్పులేశాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

రెట్టింపు జోష్‌తో చిందేసిన మెగాస్టార్‌
ప్రముఖ ఇండియన్‌ ర్యాపర్‌ రాజకుమారి జవాన్‌ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌ ఆలపిస్తుండగా మెగాస్టార్‌ వేసిన స్టెప్పులు పార్టీలోనే హైలైట్‌గా నిలిచాయి. రాజకుమారి ఎంత జోష్‌గా పాట పాడుతుంటే అంతకు రెట్టింపు జోష్‌తో చిరు డ్యాన్స్‌ చేశాడు. రామ్‌చరణ్‌ తండ్రిని ఎంకరేజ్‌ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన జనాలు ఈ వయసులో కూడా ఆయన ఎంత ఉత్సాహంతో డ్యాన్స్‌ చేస్తున్నారో అని కామెంట్లు చేస్తున్నారు. మెగాస్టార్‌ స్వాగ్‌కు ఫిదా అయిపోతున్నారు.

చిరు ఇంట పార్టీ
ఇంతకీ పార్టీ జరిగింది మరెక్కడో కాదు.. మెగాస్టార్‌ ఇంట్లోనే! క్లీంకార పుట్టిన తర్వాత వచ్చిన తొలి దీపావళి పండగ కావడంతో ఎంతో ఘనంగా వేడుక నిర్వహించారు. ఈ పార్టీకి స్టార్‌ హీరోలు మహేశ్‌బాబు, వెంకటేశ్‌, ఎన్టీఆర్‌తో పాటు మంచు లక్ష్మి తదితరులు విచ్చేశి సందడి చేశారు. 

చదవండి: ప్రియుడిపై హీరోయిన్‌ ముద్దుల వర్షం, ఫోటోలు వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement