తిరుపతి ఎడ్యుకేషన్: ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో ధ్వంసమైన విగ్రహాల స్థానంలో కొత్త విగ్రహాలను తయారు చేయాలని విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులు టీటీడీకి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో తిరుపతిలోని టీటీడీ శిలా శిల్ప ఉత్పత్తి కేంద్రంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని విగ్రహాలను శిల్పులు తయారు చేశారు. శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు విగ్రహాలను పీఠంతో కలిపి వేర్వేరుగా కృష్ణశిల రాతితో వీటిని మలిచారు. శుక్రవారం ఈ విగ్రహాలను విజయనగరం జిల్లా దేవదాయ శాఖ అధికారులకు అప్పగించనున్నారు.
శిల్పారామం అభివృద్ధికి రూ. 9.50 కోట్లు
సాక్షి, అమరావతి: పులివెందులలో ఉన్న శిల్పారామంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు గురువారం రూ.9.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. 11 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన శిల్పారామం పార్కు శిథిలావస్థకు చేరుకోవడంతో ఆయా ప్రాంతాల్లో అభివృద్ధితో పనులతో పాటు మౌళిక సదుపాయాలు కల్పించేందుకుగాను నిధులు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment