
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లా రామతీర్థం కొండపై శివరాత్రి వేడుకల్లో అపశృతి చోటుచేసకుంది. శివరాత్రి వేడుకలకు వెళ్లిన ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు రామతీర్థం కొండపై నుంచి జారిపడి మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులను విజయనగరం జిల్లా దాసన్నపేటకు చెందిన సాయిరాం, కుమార్‌లుగా గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న నెల్లిమర్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment