బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు
- ఎస్పీ ఆకె రవికృష్ణ
- నంద్యాల పీఎస్, పోలీస్ క్వార్టర్స్ పరిశీలన
నంద్యాల: శ్రీశైలం, మహానంది బ్రహ్మోత్సవాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన నంద్యాల టూటౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలకు 2వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాల సబ్ డివిజన్‌లోని పోలీస్ బలగాలను మహానంది క్షేత్రానికి తరలిస్తామన్నారు. అనంతరం ఎస్పీ పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. త్వరలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసుల కుటుంబీకులు, మహిళా కానిస్టేబుళ్లతో ఆయన మాట్లాడారు. వారికోరిక మేరకు ప్రహరీ నిర్మాణానికి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ప్రతిపాదనలను పంపుతామన్నారు. పోలీస్ క్వార్టర్స్‌కు సమీపంలో ఉన్న ఉర్దూ స్కూల్ చిన్నారులకు పుస్తకాలు పంపిణీ చేశారు. ఆయన వెంట సీఐలు గుణశేఖర్‌బాబు, ఇస్మాయిల్, టూటౌన్ ఎస్‌ఐ మోహన్‌రెడ్డి ఉన్నారు.