టీడీపీవి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే పార్థసారధి | YSRCP MLA Kolusu Parthasarathy Comments On TDP And BJP | Sakshi

టీడీపీవి దిగజారుడు రాజకీయాలు: ఎమ్మెల్యే పార్థసారధి

Feb 23 2022 5:52 PM | Updated on Feb 23 2022 7:25 PM

YSRCP MLA Kolusu Parthasarathy Comments On TDP And BJP - Sakshi

సాక్షి, అమరావతి: గౌతమ్‌రెడ్డి మరణంతో ప్రజలు విషాదంలో ఉన్నారని.. ఈ సమయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పార్థసారధి మండిపడ్డారు. కనీస మానవత్వం లేకుండా టీడీపీ నాయకులు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. టీడీపీ నాయకులు సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

చదవండి: ‘బండారూ! మందేసి మాట్లాడుతున్నావా? ఇంతటి మహా విషాదాన్ని కూడా రాజకీయం చేస్తారా?’

‘‘టీడీపీ, బీజేపీ నాయకులు మాట్లాడుతున్న తీరు సిగ్గుచేటు. సుజనా చౌదరి ఆడించిన నాటకంలో తోలు బొమ్మల్లా ఆడుతున్నారు. విభజనతో జరిగిన అన్యాయంపై జీవీఎల్‌ ఎందుకు మాట్లాడటం లేదు. కరోనాను రాష్ట ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమ్మ ఒడి, చేయూత వంటి కార్యక్రమాలు ఉన్నాయా అంటూ పార్థసారథి ప్రశ్నించారు. నాడు-నేడు కార్యక్రమం కోసం ఏపీకి  ఏమైనా ఆర్థిక చేస్తున్నారా అంటూ దుయ్యబట్టారు. ఏపీకి న్యాయం చేయాలనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఉందా?. బాధ్యతల నుంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పారిపోతోందని పార్థసారధి మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement