ఢిల్లీ: ది కేరళ స్టోరీ సినిమాపై నిషేధాజ్ఞాలను వ్యతిరేకిస్తూ ఆ చిత్రనిర్మాతలు దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టులో ఇవాళ విచారణ నడుస్తోంది. అయితే గత విచారణలో సీజేఐ నేతృత్వంలోని బెంచ్.. పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వానికి వివరణ కోరుతూ నోటీసులు అందించగా.. ఆ నోటీసులకు తమిళనాడు ప్రభుత్వం స్పందించింది.
ది కేరళ స్టోరీ సినిమాను నిషేధించారనే వాదనను తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించిందని చెబుతూ ఆ చిత్ర నిర్మాతలు ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేశారని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్‌లో పేర్కొంది. ప్రేక్షకుల స్పందన సరిగా లేకపోవడంతో థియేటర్లలో సినిమా ప్రదర్శనను నిలిచిపోయిందే తప్ప.. ఆ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.
తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. ‘‘మే7వ తేదీ నుంచి జనాలు థియేటర్లకు రాకపోవడం వల్లే ఎగ్జిబిటర్లు వాళ్లంతట వాళ్లే సినిమాను ప్రదర్శించడం ఆపేశారు. సినిమా థియేటర్లకు భద్రత కల్పించడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేద’’ని అఫిడవిట్‌లో పేర్కొంది. అంతేకాదు.. సినిమాలో చెప్పుకోదగ్గ నటులు ఎవరూ లేకపోవడమో/ అందులోవాళ్ల నటన బాగా లేకపోవడమో.. ఏ కారణాలవల్లనో చిత్ర ప్రదర్శన ఆపేసి ఉంటారని అభిప్రాయపడింది.
ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ థియేటర్ యజమానులపై, మల్టీప్లెక్స్ నిర్వాహకులపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు. సినిమా ఆగిపోవడంలో ప్రభుత్వ పాత్ర కూడా ఏం లేదు అని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. ఈ మేరకు మల్టీప్లెక్స్ నిర్వాహకుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్‌ను సైతం అఫిడవిట్‌లో పొందుపర్చింది తమిళనాడు ప్రభుత్వం.
ఇదీ చదవండి: ప్రధానికి అత్తగారినంటే ఎవరూ నమ్మలేదు
Comments
Please login to add a commentAdd a comment