‘నీట్‌ పరీక్షను రద్దు చేయం’.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు | Centre Affidavit Filed On Supreme Court About Neet Ug Exam | Sakshi
Sakshi News home page

‘నీట్‌ పరీక్షను రద్దు చేయం’.. సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు

Published Fri, Jul 5 2024 4:41 PM | Last Updated on Fri, Jul 5 2024 5:42 PM

Centre Affidavit Filed On Supreme Court About Neet Ug Exam

సాక్షి,న్యూఢిల్లీ : నీట్‌ యూజీ పరీక్షపై సుప్రీం కోర్టులో కేంద్రం అఫిడవిట్‌ దాఖలు చేసింది. అఫిడవిట్‌లో నీట్-యూజీ 2024 పరీక్షలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేనందున, పరీక్షను మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపింది. 

పరీక్షను రద్దు చేస్తే లక్షలాది మంది విద్యార్ధుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని చెప్పింది. ఈ మొత్తం అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని ఇప్పటికే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌ను కోరినట్లు చెప్పిన కేంద్రం.. నీట్‌ పరీక్ష లీకేజీ నిందితుల్ని అరెస్ట్‌ చేశామని పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement