సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఆస్తులు, అప్పుల వివరాలను ప్రకటించారు. ప్రస్తుతం కేరళలోని వాయనాడ్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయన అదే స్థానం నుంచి ఈసారి లోక్‌సభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా అఫిడవిట్‌లో తన ఆస్తులు, అప్పుల వివరాలను సమర్పించారు.
రాహుల్ గాంధీ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం... ఆయన వద్ద స్టాక్ మార్కెట్ పెట్టుబడులు రూ.4.3 కోట్లు, మ్యూచువల్ ఫండ్ డిపాజిట్లు రూ.3.81 కోట్లు, బ్యాంకు ఖాతాలో రూ.26.25 లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం తన వద్ద రూ. 55,000 నగదు ఉందని, 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 1,02,78,680 ఆర్జించినట్లు పేర్కన్నారు.
#Congress leader Rahul Gandhi's Asset and Liability!!👇👇
— House of Stocks~NISM certified (@CommonInsan) April 4, 2024
Assets worth 20,29,52,000.
Liability- 49,70,000.
Also Invested in Stocks-Mutual Fund and Gold Bond.#stockmarkets #stockmarkets #RahulGandhi #BJP #NarendraModi pic.twitter.com/tx6eCcrWrf
రాహుల్ గాంధీ వద్ద రూ.15.2 లక్షల విలువైన బంగారు బాండ్లు కూడా ఉన్నాయి. అలాగే జాతీయ పొదుపు పథకాలు, పోస్టల్ సేవింగ్స్, ఇన్సూరెన్స్ పాలసీలలో రూ. 61.52 లక్షల విలువైన పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఆయన దగ్గరున్న ఆభరణాల విలువ రూ.4.2 లక్షలు.
రాహుల్ గాంధీ చరాస్తుల మొత్తం విలువ రూ.9.24 కోట్లు కాగా, స్థిరాస్తుల మొత్తం విలువ దాదాపు రూ.11.14 కోట్లు. ఆయన నామినేషన్‌తోపాటు అందించిన వివరాల ప్రకారం ఆయన మొత్తం ఆస్తుల విలువ రూ.20 కోట్లకుపైగా ఉంది. అదే సమయంలో సుమారు రూ.49.7 లక్షల అప్పు కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment