ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తమతమ ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. బుధవారం నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు అఫిడవిట్‌లో తమ చరాస్తులు, స్థిరాస్తుల వివరాలను పొందుపర్చారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రధాన పార్టీలకు సంబంధించి పలువురు అభ్యర్థులు వెల్లడించిన వివరాలు పరిశీలిస్తే..
సాక్షి, చెన్నూర్: టీఆర్‌ఎస్ చెన్నూర్ అభ్యర్థి బాల్క సుమన్ అఫిడవిట్‌లో మొత్తం ఆస్తుల విలువ రూ.1,06,08,266లుగా చూపించారు. భార్య రాణి అలేఖ్య పేరున రూ.67,06,130లు విలువ చేసే ఆస్తి ఉన్నట్లు తెలిపారు. సుమన్ వద్ద రూ.2,76,395ల నగదు, భార్య వద్ద రూ.41,290ల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు. సుమన్ పేరు మీద ఫిక్స్‌డ్ డిపాజిట్ రూ.29,60,948, భార్య పేరున రూ.14,081లు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరున సోని ప్రాజెక్టులో రూ.10లక్షల పెట్టుబడులు, సుమన్ పేరున జనరల్ ఇన్‌ఫ్రాలో రూ.2.50 లక్షల అప్పు, అన్న బిల్డర్స్‌లో రూ.20 లక్షల అప్పు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరున బ్యాంక్‌లో రూ.7.50 లక్షల అప్పు ఉన్నట్లు వెల్లడించారు. సుమన్ పేరున రూ.2,76,706లు విలువ చేసే బంగారు ఆభరణాలు, భార్య పేరున రూ.15,35,500 విలువ చేసే ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. హోండా సిటీ కారు, ఇన్నోవా క్రిస్టా ఉన్నట్లు అఫ్‌డవిట్‌లో పేర్కొన్నారు.
ఉట్నూర్(ఖానాపూర్): ఖానాపూర్ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అజ్మిరా రేఖానాయక్ అఫిడవిట్‌లో ఆమె ఆస్తులు, అప్పుల వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం రేఖానాయక్ చేతిలో రూ. 1,42,554ల నగదు ఉన్నట్లు తెలిపారు. ఎస్‌బీహెచ్ సెక్రెట్రియెట్ హైదారాబాద్ బ్రాంచ్‌లో రూ. 80,497లు, ఎస్‌బీహెచ్ ఖానాపూర్ బ్రాంచ్‌లో రూ.54,409లు, గాయిత్రి కో అపరెటీవ్ బ్యాంక్‌లో రూ.3,42,430లు ఉన్నట్లు తెలి పారు. అలాగే ఏఆర్‌ఎస్ గ్రూప్‌లో రూ.లక్ష పెట్టుబడి, ఏఆర్‌ఎస్ మోటార్స్‌లో రూ. 30,76,283 పెట్టినట్లు తెలిపారు. ఇన్నోవా కారు విలువ రూ.9లక్షలుగా చూపించారు. 280 గ్రాముల బంగారం(విలువ రూ. 8.90లక్షలు), మూడు కిలోల వెండి (విలువ రూ.1.50 లక్షలు)గా తెలిపారు. సిరిసిల్ల జిల్లా వేములవాడలో వేంకటేశ్వర ఫిల్లింగ్ స్టేషన్ (విలువ రూ.52,25, 935లు)గా చూపించారు.
తన చరాస్తుల విలువ మొత్తం రూ.1,09,62,109 లుగా వెల్లడించారు. స్థిరాస్తి 23 ఎకరాల 17 గుంటల వ్యవసాయ భూమి (మార్కెట్ విలువ రూ.1.50కోట్లు)గా తెలిపారు. 5,500 స్క్వేర్ ఫీట్ల నివాస స్థలం ప్రస్తుతం మార్కెట్ విలువ రూ.1.95 కోట్లుగా చూపించారు. ఖానా పూర్‌లో నివాసం ప్ర స్తుత మార్కెట్ విలువ రూ.25 లక్షలుగా తెలిపారు. మొత్తం స్థిరాస్తులు రూ.3.70 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే వివిధ బ్యాంకుల్లో రూ.37,16,892ల రుణం ఉన్నట్లు తెలిపారు. మొత్తం అప్పులు రూ.62,46,564 ఉన్నట్లు వెల్లడిం చారు.
భర్త శ్యాంనాయక్ ఆస్తి..
అలాగే భర్త శ్యాంనాయక్ పేరున చరాస్తులు చేతిలో రూ.3లక్షల నగదు, ఎస్‌బీహెచ్ ఖానాపూర్ బ్రాంచ్‌లో రూ.25,41,076లు, ఎల్‌ఐసీ ప్రీమియం రెండు కలిపి రూ.7లక్షలు ఉన్నట్లు తెలిపారు. 60 గ్రాముల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తం చరాస్తుల విలువ రూ.37,33,076లుగా వెల్లడించారు. అలాగే శ్యాంనాయక్‌కు స్థిరాస్తులు 6ఎకరాల 12 గుంటల వ్యవసా య భూమి ఉన్నట్లు తెలిపారు. దాని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.75 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో నివాసయోగ్యమైన భూమి ప్రస్తుత మార్కెట్ విలువ రూ. 85 లక్షలుగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment