కోల్‌కతా: నిర్దేశిత గడువులోగా కోరిన సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించని 1000 బీఈడీ కాలేజీలకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) షోకాజ్ నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన కాలేజీల్లో బీఈడీ, డీఈడీ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్లు చేపట్టవద్దని ఎన్సీటీఈ ఆదేశించిందని మానవ వనరుల శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
వీటితోపాటు మరో 3వేల కాలేజీలకు త్వరలో నోటీసులు పంపనున్నారు. బీఈడీ, డీఈడీ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో తమకు అందించాలని కోరినా సమర్పించని కాలేజీలపై ఎన్సీటీఈ చర్యలకు ఉపక్రమించింది.
Comments
Please login to add a commentAdd a comment