ముంబై: త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అహ్మద్ నగర్ సౌత్ నుంచి మాజీ ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తండ్రి దిలీప్ ఖేద్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు.
దీనిలో దిలీప్ ఖేద్కర్ తాను విడాకులు తీసుకున్నట్లు వెల్లడించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇచ్చిన సమాచారానికి భిన్నమైన వివరాలు దీనిలో ఉన్నాయి. కొద్ది నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ తాను మనోరమ ఖేద్కర్‌ను వివాహం చేసుకున్నట్లు వెల్లడించారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో దిలీప్ ఖేద్కర్ అహ్మద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ టిక్కెట్‌పై పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. నాడు లోక్‌సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్‌లో దిలీప్ ఖేద్కర్.. మనోరమ ఖేద్కర్‌ను తన భార్యగా పేర్కొన్నారు. నాటి అఫిడవిట్‌లో దిలీప్ ఖేద్కర్ తమ ఉమ్మడి ఆస్తుల వివరాలను తెలిపారు. తన కుటుంబాన్ని అవిభక్త హిందూ కుటుంబంగా పేర్కొన్నారు.
దిలీప్, మనోరమ ఖేద్కర్ 2009లో పూణే ఫ్యామిలీ కోర్టులో పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారని ఒక మీడియా సంస్థ తెలిపింది. వారిద్దరూ 2010, జూన్ 25న విడిపోయారు. విడాకులు తీసుకున్నప్పటికీ, ఈ జంట పూణేలోని బానర్ ప్రాంతంలోని మనోరమా ఖేద్కర్ బంగ్లాలో సహజీవనం కొనసాగించారు.
కాగా రిజర్వేషన్ ప్రయోజనాలను పొందేందుకు యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (2022) కోసం ఆమె చేసిన దరఖాస్తులో తప్పుడు సమాచారాన్ని అందించినందుకు పూజా ఖేద్కర్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సస్పెండ్ చేసింది. అయితే ఆమె ఈ ఆరోపణలను ఖండించారు. ఢిల్లీలోని వివిధ అకాడమీలలో తన మాక్ ఇంటర్వ్యూలలో పూజా ఖేద్కర్ తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నందున తన కుటుంబ ఆదాయం సున్నా అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె తన తల్లితోపాటు ఉంటోంది. అయితే, లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దిలీప్ ఖేద్కర్ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల విలువను రూ.40 కోట్లగా చూపారు.
ఇది కూడా చదవండి: లింగ సమానత్వంలో భారత్ ముందడుగు
Comments
Please login to add a commentAdd a comment